ఫైనల్లో హుమేరా జోడీ | Humera Jodi in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో హుమేరా జోడీ

Oct 20 2024 4:03 AM | Updated on Oct 20 2024 4:03 AM

Humera Jodi in the final

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ15 టోర్నీలో తెలంగాణ అమ్మాయి హుమేరా బహార్మస్‌ డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం బెంగళూరులో జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్‌) ద్వయం 7–6 (7/2), 6–4తో దివ భాటియా–సాయి సంహిత చామర్తి (భారత్‌) పై విజయం సాధించింది.

హోరాహోరీగా సాగిన తొలి పోరులో పోరాడి గెలిచిన హుమేరా బహర్మస్‌ జంట... రెండో సెట్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ చెలరేగింది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఆకాంక్ష దిలీప్, తనీషా కశ్యప్‌ విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. 

ఆక్షాంక్ష 7–5, 3–6, 6–2తో వైష్ణవి ఆడ్కర్‌ (భారత్‌)పైనే విజయం సాధించగా... తనీషా 6–1, 7–5తో కరోలాన్‌ డెలానూ (న్యూ కాలెడోనియా) పై గెలిచింది. ఆదివారం జరగనున్న టైటిల్‌ పోరులో ఆకాంక్షతో తనీషా అమీతుమీ తేల్చుకోనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement