అస్తానా (కజకిస్తాన్): ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం తొలి రౌండ్‌లో నిఖత్ 5–0తో రఖీమ్‌బెర్దీ జన్సాయా (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు) కూడా తొలి రౌండ్‌లో విజయాలు అందుకున్నారు.
మీనాక్షి 4–1తో గసిమోవా రొక్సానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... అనామిక పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుమ్‌బయేవా అరైలిమ్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. ఇస్మిత్ (75 కేజీలు), సోనియా (54 కేజీలు) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. ఇష్మిత్ 0–5 తో అర్మాత్ (కజకిస్తాన్) చేతిలో, సోనియా 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు.
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ..
రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలిరౌండ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–2తో అర్నాల్డి–పసారో (ఇటలీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బొలెలీ–వావాసోరి (ఇటలీ)లతో బోపన్న–ఎబ్డెన్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment