భారత్‌కు టాప్ సీడింగ్ | India to the top seeding | Sakshi
Sakshi News home page

భారత్‌కు టాప్ సీడింగ్

Published Wed, Sep 23 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

India to the top seeding

న్యూఢిల్లీ : డేవిస్ కప్ గ్రూప్ 1 ఆసియా/ఓసియానియా జోన్‌లో భారత టెన్నిస్ జట్టుకు టాస్ సీడింగ్ దక్కింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ టోర్నీ డ్రాను సాంటియాగోలో నేటి (బుధవారం) నుంచి జరిగే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఏజీఎం ముగింపు రోజున వెల్లడిస్తారు. ఉజ్బెకిస్తాన్‌కు రెండో సీడ్ దక్కింది. ఈ రెండు జట్లకు తొలి రౌండ్‌లో బై లభించింది. ఇటీవల జరిగిన ప్లేఆఫ్‌లో చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిన భారత జట్టు ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆసియా స్థాయి గ్రూప్-1లో భారత్, ఉజ్బెకిస్తాన్‌లతో పాటు చైనా, కొరియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement