
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. షోలాపూర్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల (భారత్)–చింగ్ వెన్ సు (చైనీస్ తైపీ) ద్వయం 7–5, 1–6, 10–6తో మయా జాన్సెన్ (అమెరికా)–ఎరిన్ రౌట్లిఫి (న్యూజిలాండ్) జంటపై విజయం సాధించింది.
అంతకుముందు జరిగిన సెమీస్‌లో ప్రాంజల జోడి 6–3, 6–7 (7/9), 10–8తో యెక్సిన్ మా (చైనా)–మెక్‌పీ (ఆస్ట్రేలియా) జంటను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment