
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రొ సర్క్యూట్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్‌లో 19 ఏళ్ల ప్రాంజల విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 396వ ర్యాంకర్ ప్రాంజల 2–6, 7–5, 6–0తో ప్రపంచ 144వ ర్యాంకర్, టాప్ సీడ్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్)ను బోల్తా కొట్టించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
2 గంటల 15 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల రెండు ఏస్‌లు సంధించడం తోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. గతేడాది ఈజిప్ట్‌లో జరిగిన షర్మ్ ఎల్ షేక్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ప్రాంజల ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే.
Comments
Please login to add a commentAdd a comment