వరల్డ్ గ్రూప్‌కు భారత్ అర్హత | India to qualify for the World Group | Sakshi
Sakshi News home page

వరల్డ్ గ్రూప్‌కు భారత్ అర్హత

Published Fri, May 1 2015 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

India to qualify for the World Group

బ్యాంకాక్ : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) బాలికల జూనియర్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1తో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ అమినేని శివాని 1-6, 1-6తో అంబర్ మార్షల్ చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో మహక్ జైన్ 6-2, 6-1తో ఒలివియా గడెకిపై నెగ్గి స్కోరును 1-1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో శివాని-మహక్ జైన్ ద్వయం 2 గంటల 35 నిమిషాల్లో 6-4, 5-7, 6-4తో ప్రత్యర్థి జంటను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement