
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సర్క్యూట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల వరుసగా రెండో టైటిల్ సాధించింది. నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్‌లో ప్రాంజల విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రాంజల 6–1, 7–6 (7/2)తో టాప్ సీడ్, ప్రపంచ 142వ ర్యాంకర్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది.
గంటా 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల తొలి సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రెండో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నాలుగుసార్లు చొప్పున చేజార్చుకున్నారు. అయితే టైబ్రేక్‌లో ప్రాంజల పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గతవారం కూడా ఇదే వేదికపై జరిగిన టోర్నీలో క్యానీ పెరిన్‌నే ఓడించి ప్రాంజల తొలి టైటిల్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment