
షరపోవా వ్యాఖ్యలు అగౌరవం కాదు: సచిన్
న్యూఢిల్లీ: రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా వ్యాఖ్యలపై సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సచిన్ ఎవరో తెలియదంటూ షరపోవా వ్యాఖ్యానించడాన్ని తాను అగౌరవంగా భావించడలేదని ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
షరపోవా వ్యాఖ్యలపై సచిన్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్, ట్విట్టర్లలో మాస్టర్ అభిమానులు షరపోవాపై ఘాటైన కామెంట్లు చేశారు. వింబుల్డన్ను తిలికించేందుకు సచిన్ లండన్ వెళ్లాడు. ఇతర క్రీడా దిగ్గజాలతో కలసి మ్యాచ్ను వీక్షించాడు. అయితే ఇతర ఆటగాళ్ల గురించి ప్రస్తావించిన షరపోవా సచిన్ ఎవరో తనకు తెలియదంటూ చెప్పింది.