సుష్మా స్వరాజ్‌పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియా అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెను తానెప్పుడూ భారత దేశ రాజకీయాల్లో ప్రముఖమైన నాయుకురాలిగా చూడలేదన్నారు. ఈ మేరకు తాను రాసిన "నెవర్ గివ్ ఏ ఇంచ్ : ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్"లో సుష్మా స్వరాజ్‌ని కొన్ని అమెరికన్ పదాలతో అవమానకరంగా వర్ణించారు. అంతేగాదు సుష్మా రాజకీయం పరంగా ఆమె కీలకపాత్రధారి కాకపోవడంతోనే మోదీకి అత్యంత సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సన్నిహితంగా పనిచేశానని తన పుస్తకంలో రాశాడు.
వాస్తవానికి సుష్మా స్వరాజ్ మోదీ ప్రభుత్వంలో మే 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆమెతో దౌత్యానికి సంబంధించిన విషయాల్లో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఇకపోతే తదుపరి భారత విదేశాంగా మంత్రి.. 2019లో కొత్తగా నియమితులైన జైశంకర్‌ని తాను స్వాగతించానని, పైగా అతను తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు పాంపియో. అతను మాట్లాడే ఏడు భాషల్లో ఇంగ్లీష్ ఒకటని, అది తనకంటే బాగా మెరుగ్గా ఉంటుందని అన్నారు. ఆయనను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. తన పుస్తకంలో జైశంకర్ వచ్చే 20204 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా చెప్పారు. అతను ఒక గొప్ప ప్రోఫెషనల్, హేతుబద్ధమైన వ్యక్తి మాత్రమే గాదని తన దేశానికే గొప్ప రక్షకుడిగా కూడా అభివర్ణించారు.
చివరిగా తాను సుష్మాతో పొలిటకల్‌గా తనతో చాలా ఇబ్బందిపడ్డానని, తనకు ఏవిధంగా సహకరించలేదని చెప్పారు. కానీ జైశంకర్‌తో చాలా సన్నిహితంగా పనిచేయగలిగినట్లు చెప్పుకొచ్చారు. ఐతే ఈ వ్యాఖ్యలకు జైశంకర్ స్పందించి..తాను పాంపియో పుస్తకంలో సుష్మా స్వరాజ్‌ని అవమానిస్తూ రాసిన వ్యాఖ్యలను చూశానన్నారు. ఆమెను తానెప్పుడూ ఎంతో గౌరవంగా చూసుకున్నానని, అలాంటి ఆమె పట్ల ఇలా అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తానని చెప్పారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా, సన్నిహితంగా ఉండేవాడినన్నారు. ఆమెను అగౌరపరిచేలా చేసిన సంభాషణనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
అంతేగాదు పాంపియో తన పుస్తకంలో భారత్ అమెరికాను నిర్లక్ష్యం చేయడం దశాబ్దాల ద్వైపాక్షిక వైఫల్యంగా పేర్కొన్న విషయంపై కూడా శంకర్ ధీటుగా కౌంటరిచ్చారు. ఇదిలా ఉండగా పాంపియో తన పుస్తకంలో... భారత్ అమెరికా, భారత్ సహజ మిత్రులని నొక్కి చెప్పారు. తమ ప్రజలు ప్రజాస్వామ్య చరిత్ర, ఉమ్మడి భాష, సాంకేతికత తదితర వాటిన్నింటిని భారత్‌తో పంచుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు.
అంతేగాదు అమెరికా మేధో సంపత్తి ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న మార్కెట్ భారతదేశమేనన్న విషయాన్ని కూడా నొక్కి చెప్పారు. దక్షిణాసియాలో వ్యూహాత్మకమైన స్థానం చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి భారత్‌తో దౌత్యాని మూలధారం చేసిందని రాశారు. ఆ పుస్తకంలో తాను ఎంచుకున్న భారతదేశాన్ని అమెరికా తదుపరి గొప్ప మిత్రదేశంగా మార్చడంలో సమయం వెచ్చించండి, కృషి చేయండి అని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
(చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కీలక వ్యాఖ్యలు)