యూఎస్ ఓపెన్ నుంచి షరపోవా అవుట్!
ప్రపంచ మూడో ర్యాంక్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్ని నుంచి వైదొలిగింది. భుజానికి గాయం కారణంగా టోర్ని నుంచి తప్పుకున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో టెన్నిస్ లో చివరి టోర్ని కోసం డ్రాలు తీయడానికి ముందు షరపోవా తప్పుకున్నట్టు యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ డైరెక్టర్ డేవిడ్ బ్రీవర్ తెలిపాడు.
భుజం నొప్పి కారణంగా యూఎస్ ఓపెన్ లో పాల్గొనలేనని షరపోవా తమకు సమాచారం అందించిందని బ్రీవర్ వెల్లడించారు. షరపోవా త్వరగా కోలుకోవాలని బ్రీవర్ మీడియాతో అన్నాడు. షరపోవా తప్పుకోవడంతో పోలాండ్ కు చెందిన అగ్నియోజ్కా రాండ్వాన్ స్కా మూడో సీడ్ గా యూఎస్ ఓపెన్ బరిలోకి దిగనుంది.