మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నేరుగా ఆడేందుకు ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఈ టోర్నీ మాజీ విజేత మరియా షరపోవాకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. గాయం కారణంగా గతేడాది ఈ రష్యా స్టార్ ఎక్కువ కాలం ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్ 147కు పడిపోయింది. ఫలితంగా ర్యాంక్ ప్రకారం ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 32 ఏళ్ల షరపోవాకు మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కలేదు.
అయితే ఈ టోరీ్నలో ఆమె గత రికార్డును పరిగణనలోకి తీసుకొని నిర్వాహకులు వైల్డ్ కార్డు ద్వారా నేరుగా మెయిన్ ‘డ్రా’లో స్థానం కలి్పంచారు. 2003లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడిన షరపోవా 2008లో చాంపియన్‌గా నిలిచింది. 2007, 2012, 2015లలో ఫైనల్లో ఓడి రన్నరప్ ట్రోఫీ అందుకుంది. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనుండటం ఎంతో ప్రత్యేకం. ఈ టోరీ్నలో నాకెన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయి. ఒకసారి విజేతగా నిలిచాను. మూడుసార్లు ఫైనల్లో ఓడాను. మరోసారి ఇక్కడ ఆడే అవకాశం ఇచి్చనందుకు సంతోషంగా ఉంది’ అని షరపోవా వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment