
షరపోవానా.. ఆమె ఎవరు?
సచిన్ టెండూల్కర్ ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించిన రష్యన్ టెన్నిస్ భామ మారియా షరపోవాపై సచిన్ అభిమానులు పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. ఆమె ఫేస్బుక్ పేజీలోకి దూసుకెళ్లి, అసలు షరపోవా అంటే ఎవరు అంటూ మండిపడ్డారు. ఆమెకు 'జ్ఞానబోధ' చేయడానికి తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. దీంతో షరపోవా పేజి మొత్తం తీవ్రమైన వ్యాఖ్యలతో నిండిపోయింది. అలాగే ట్విట్టర్లో కూడా.. 'హూ ఈజ్ మారియా షరపోవా' అనేది పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.
సచిన్.. షరపోవాల మధ్య అసలు పోలికన్నదే లేదని, షరపోవా ఫేస్బుక్ పేజీకి కేవలం 13.6 మిలియన్ల లైకులు మాత్రమే ఉంటే, టెండూల్కర్ పేజీకి 20.1 మిలియన్ల లైకులున్నాయని అభిమానులు చెబుతున్నారు. అలాగే, షరపోవా కంటే టెండూల్కర్కు ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య కూడా 3.2 మిలియన్లు ఎక్కువ. డేవిడ్ బెక్హాం ఫుట్ బాల్ లోకి వచ్చినప్పుడే సచిన్ టెండూల్కర్ కూడా క్రికెట్లోకి వచ్చాడని, ఆయనెవరో తెలుసా అని విలేకరులు అడిగినప్పుడు.. తెలియదని షరపోవా చెప్పడంతోనే అసలు సమస్య అంతా వచ్చింది.
RT if you want to Hear Below statement from sharapova. Sachin , who is Maria Sharapova ? pic.twitter.com/qGnGXcDTf4
— Virat Kohli (@imviratkohlifan) July 4, 2014
Who is Maria Sharapova? This is Sachin Tendulkar who respects his game. Learn from him. pic.twitter.com/3sCZ8Ir8qN
— Sir Ravindra Jadeja (@SirJadeja) July 2, 2014
You shout 4 ur every shot but whole world shouted 4 his every stroke. thtz the diffrnce b/w God nd a common player #Who is Maria Sharapova
— Shivani Singh (@SinghShivi28) July 3, 2014