పారిస్: త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి మాజీ చాంపియన్, రష్యన్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా వైదొలిగారు. కొన్ని వారాల క్రితం భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షరపోవా ఇంకా పూర్తిగా కోలుకోపోవడంతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు షరపోవా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నేను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభతరం కాదు’ అని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఓవరాల్‌గా ఐదు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన షరపోవా.. రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. 2012,14 సంవత్పరాల్లో షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచారు.
అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఏ టోర్నీలోనూ షరపోవా పాల్గొనలేదు. ఫిబ్రవరి నెలలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమె తిరిగి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు షరపోవా. మే 26వ తేదీ నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment