
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ మారియా షరపోవా (రష్యా) కథ ముగిసింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో క్రికెటర్ కమ్ టెన్నిస్ స్టార్ ఆష్‌బార్టీ (ఆస్ట్రేలియా)ఈ రష్యాస్టార్‌ను మట్టికరిపించింది. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో ఆష్‌బార్టీ విజయం సాధించింది. ఈ విజయంతో 22 ఏళ్ల ఆష్‌బార్టీ తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2014లో టెన్నిస్‌కు విరామం ఇచ్చి అనూహ్యంగా క్రికెట్ ఆడిన ఆష్‌బార్టీ.. మహిళల బిగ్‌బాష్‌లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిథ్యం ఇచ్చింది.
టెన్నిస్ రాకెట్ వదిలి బ్యాట్ పట్టుకున్నఈ యంగ్ లేడీ క్రికెట్‌లోనూ అదరగొట్టింది. లీగ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే 29 బంతుల్లో 37 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టుకున్న ఆష్‌బార్టీ గతేడాదే కెరీర్ బెస్ట్ 15వ ర్యాంకును సొంత చేసుకుంది. ఇక తాజాగా ఐదు గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన టెన్నిస్ దిగ్గజం షరపోవాను మట్టికరిపించి ఔరా అనిపించింది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ చేరింది.
The most famous victory of her young career.
— #AusOpen (@AustralianOpen) January 20, 2019
Congratulations, @ashbar96 👏👏👏#AusOpen pic.twitter.com/MEvPFeKZc7