
రోమ్: టెన్నిస్ ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేట్ ఎవరంటే ప్రస్తుతానికి అందరూ ఠక్కున చెప్పే పేరు రోజర్ ఫెడరర్. కానీ... మహిళల మాజీ నం.1 మరియా షరపోవా మాత్రం రాఫెల్ నాదల్ అంటోంది. ఈ మేరకు ఆమె సోమవారం ట్విట్టర్‌లో పెట్టిన వీడియో వివాదాస్పదమైంది. ఇటాలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా నాదల్‌తో కలిసి ఇక్కడ సాధనలో పాల్గొంటున్న షరపోవా... ‘కోర్టులో రెండు నిమిషాల సాధనలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీవోఏటీ) ఆటగాడి ముందు తేలిపోయాను’ అంటూ పోస్ట్ చేసింది.
ఇందులో ‘మట్టి కోర్టులపై గ్రేటెస్ట్ ఆటగాడు’ అని నొక్కి చెప్పకపోవడంతో... ఫెడరర్ అభిమానులకు మరోలా అనిపించింది. గెలిచిన 16 గ్రాండ్‌స్లామ్స్‌లో పది మట్టి కోర్టులపై ఆడే ఫ్రెంచ్ ఓపెనే కాగా... నాదల్ గ్రేటెస్ట్ ఎలా అవుతాడంటూ వారు మండిపడ్డారు. ఇది ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చకు దారి తీసింది. మరోవైపు కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ ఖాతాలో ఒక ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఉంది. ముఖాముఖిలో మాత్రం ఫెడరర్‌పై నాదల్ (23–15)దే పైచేయి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment