'దురదృష్టవశాత్తు ఆడలేకపోతున్నా' | Maria Sharapova Withdraws From US Open With Leg Injury | Sakshi
Sakshi News home page

'దురదృష్టవశాత్తు ఆడలేకపోతున్నా'

Published Mon, Aug 31 2015 9:09 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

'దురదృష్టవశాత్తు ఆడలేకపోతున్నా'

'దురదృష్టవశాత్తు ఆడలేకపోతున్నా'

న్యూయార్క్: రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. కుడి కాలికి గాయం కారణంగా ఆమె ఈ ప్రతిష్టాత్మక టోర్నికి దూరమైంది. షరపోవా స్థానంలో డారియా కసత్కినా బరిలోకి దిగుతుందని యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ డైరెక్టర్ డేవిడ్ బ్రెవెర్ తెలిపారు.

'దురదృష్టవశాత్తు ఈ ఏడాది యూఎస్ ఓపెన్ లో ఆడలేకపోతున్నా. ఈ ప్రతిష్టాత్మక టోర్నిలో ఆడాలని చాలా ప్రయత్నించా. కొన్ని వారాల్లోనే కోలుకుని పూర్తి ఫిటెనెస్ తో బరిలోకి దిగుతానని అభిమానులందరికీ చెబున్నా' అని షరపోవా ట్వీట్ చేసింది. షరపోవా వైదొలగడంతో 'క్యాలెండర్ గ్రాండ్ స్లామ్' పూర్తి చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ కు ఒక అడ్డంకి తొలగినట్టైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement