
నిషేధం తర్వాత అద్భుత విజయం
సాక్షి, న్యూయార్క్: యూఎస్ ఓపెన్ 2017ను మాజీ ప్రపంచనెంబర్ వన్ స్టార్ మరియా షరపోవా అద్భుత విజయంతో ఆరంభించారు. డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం అనంతరం తొలిసారి రాకెట్ పట్టిన ఆమె రెండో సిమోనా హలెప్‌ను 6-4, 4-6, 6-3 వరుస సెట్లలో మట్టి కరిపించారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా, హలెప్‌లు హోరాహోరీగా తలపడ్డారు. ఒత్తిడి అధిగమించే క్రమంలో తడబాటుకు గురైన హలెప్ మ్యాచ్‌లో చిత్తైయ్యారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన షరపోవా.. నాకు ఇదో కొత్త రోజుగా భావించాను. కొత్త అవకాశం. కొత్త మ్యాచ్. గెలవాలనే బరిలోకి దిగాను. కానీ అంతకంటే ఎక్కువ సాధించినట్లు అనిపిస్తోంది.' అని అన్నారు.