![Maria Sharapova Announced Her Engagement With Boyfriend - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/19/maria-1.jpg.webp?itok=yMUxArKw)
మాస్కో: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తన అభిమానులకు క్రిస్మస్, న్యూయర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ గిల్కెస్‌ను త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు. ఇటీవల టెన్నిస్‌కు గూడ్‌బై చెప్పిన మారియా శనివారం తన బాయ్‌ఫ్రేండ్‌తో కలిసి ఉన్న ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఇది చిన్న రహస్యం. మేము కలిసిన మొదటి రోజు నుంచే ఒకే చెబూతూనే ఉన్నాను. ఇతడు అలెగ్జాండర్ గిల్కెస్ కదా’ అంటూ తన ప్రేమ రహస్యాన్ని బయటపెట్టారు. (చదవండి: టెన్నిస్‌కు గుడ్‌బై: షరపోవా భావోద్వేగం)
ఇక మారియా పోస్టుకు బాయ్‌ఫ్రెండ్ గిల్కెస్ ఇలా సమాధానం ఇస్తూ.. ‘ఒకే చెప్పి నన్ను చాలా చాలా సంతోషమైన అబ్బాయిని చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ మారియాతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. కాగా మారియా రష్యా వ్యాపారవేత్త అయిన అలెగ్జాండర్ గిల్కెస్‌తో ప్రేమలో ఉన్నట్లు 2018లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా నిలిచిన మారియా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్మెంట్ ప్రకటించారు. 32 ఏళ్లకే 28 ఏళ్ల తన టెన్నిస్ ఆటకు ముగింపు పలకడంతో ఆమె అభిమానులంతా షాక్‌కు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment