డేటింగ్‌ చేద్దామనుకున్నా.. లవర్‌ దొరకలేదు! | Maria Sharapova reveals about DATING | Sakshi
Sakshi News home page

డేటింగ్‌ చేద్దామనుకున్నా.. లవర్‌ దొరకలేదు!

Published Sun, Apr 16 2017 1:15 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

డేటింగ్‌ చేద్దామనుకున్నా.. లవర్‌ దొరకలేదు!

డేటింగ్‌ చేద్దామనుకున్నా.. లవర్‌ దొరకలేదు!

నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి.. నిషేధానికి గురయిన టెన్నిస్‌ బ్యూటీ మరియా షరపోవా తాజాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆటకు దూరమైన ఈ ఏడాదికాలంలో నచ్చినవాడితో డేటింగ్‌ చేద్దామని అనుకున్నానని, కానీ తన ప్రేమ అన్వేషణ ఫలించలేదని చెప్పుకొచ్చింది. తను భయపెట్టేరకమని పురుషులు భావిస్తున్నారని, అందుకే ఈ ఏడాదికాలంలో ఎవరితో డేటింగ్‌ చేయడానికి వీలుపడలేదని చెప్పింది.

‘విభిన్న రంగాలు, విభిన్న సంస్కృతులకు చెందిన విభిన్న వ్యక్తులతో కలిసి గడుపాడాన్ని నేను ఆస్వాదిస్తాను. ఆ దృష్టితో నేను ప్రపంచపటం అంతా చుట్టి రావాలనుకుంటాను’ అని 29 ఏళ్ల షరపోవా చెప్పింది. మరి ఎలాంటి పురుషుడు మీకు నచ్చుతాడని ప్రశ్నిస్తే.. ‘సొంత అభిప్రాయాలు కలిగి ఉండి, సొంత జీవిత దృక్పథంతో తన రంగును, వ్యక్తిత్వాన్ని గౌరవించుకునే వ్యక్తి నాకు నచ్చుతాడు’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది.

2016 ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా షరపోవా నిషేధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు పరీక్షల్లో తేలడంతో ఆమెపై రెండేళ్లు సస్పెన్షన్‌ విధించారు. తర్వాత నిషేధిత కాలాన్ని 15 నెలలకు తగ్గించారు. మెల్డోనియంను నిషేధించిన విషయం తనకు తెలియదని, అధికారులు ఈ విషయాన్ని నేరుగా అథ్లెట్లకు తెలియజేసి ఉంటే బాగుండేదని షరపోవా అప్పట్లో చెప్పింది. తాజాగా, ఆ ఉత్ప్రేరకం తీసుకొని ఉండాల్సింది కాదంటూ షరపోవా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement