సెరెనా x షరపోవా | Australia Open 2016: Serena Williams sets up quarter-final with Maria Sharapova | Sakshi
Sakshi News home page

సెరెనా x షరపోవా

Published Sun, Jan 24 2016 10:00 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

సెరెనా x షరపోవా

సెరెనా x షరపోవా

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్లో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్, ఐదో ర్యాంకర్ మరియా షరపోవా తలపడనున్నారు. నాలుగో రౌండ్లో అమెరికా నల్లకలువ సెరెనా 6-2, 6-1 స్కోరుతో మార్గరిటా గస్పర్యన్ (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. మరో మ్యాచ్లో రష్యా భామ షరపోవా 7-5, 7-5తో బిలిండా బెనిక్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది.

మిక్స్డ్ డబుల్స్లో భారత వెటరన్ లియాండర్ పేస్ జోడీ శుభారంభం చేసింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జతకట్టిన పేస్ తొలి రౌండ్లో 6-3, 7-5తో అనస్టాసియా (రష్యా), డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)పై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement