
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన మాజీ చాంపియన్ అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ కథ ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో సెరెనా అనూహ్యంగా ఓటమిపాలైంది. రెండు గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్లెస్కోవా 6-4, 4-6 7-5తో సెరెనాపై ఘనవిజయం సాధించి సెమీస్‌లోకి అడుగెట్టింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు ప్లెస్కోవానే పైచేయి సాధించింది.
తొలి సెట్ కోల్పోయిన సెరెనా.. పుంజుకొని రెండోసెట్‌ను గెలిచింది. చివరి సెట్‌లో నువ్వా-నేనా అన్నట్లు గేమ్ సాగగా.. ప్లెస్కోవానే విజయం వరించింది. ఈ ఓటమితో 24వ గ్రాండ్ స్లామ్ నెగ్గాలని భావించిన సెరెనా ఆశలు గల్లంతయ్యాయి. దీంతో సెరెనా- ప్లిస్కోవా ముఖాముఖి 2-2గా నమోదైంది. 2016 యూఎస్ ఓపెన్ సెమీస్‌లో కూడా ప్లిస్కోవా చేతిలో సెరెనా ఖంగుతిన్నది.
Comments
Please login to add a commentAdd a comment