వాళ్లంతా విజేతలు. తమ కలలను నెరవేర్చుకొన్న వారు. అత్యున్నత లక్ష్యాలను సాధించిన వారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారు. ప్రత్యేకించి నేటి యువతకు అత్యంత ఇష్టులు. సక్సెస్‌కు ప్రతి రూపాల్లాంటి వారు. మరి వారు తమ అనుభవసారంతో సక్సెస్ గురించి, దాన్ని సాధించడం గురించి ఎలాంటి సలహాలు ఇచ్చారంటే...
రిస్క్‌లేనిదే లైఫ్ లేదు!
ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో చేసే రిస్క్. సర్దుకుపోయే మనస్తత్వంతో, సేఫ్‌సైడ్ ఉండాలనే తీరుతో జీవితంలో చాలా వాటిని కోల్పోతాం. రిస్క్ చేసినప్పుడే జీవితంలో మార్పు ఖాయం.
- మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు
నిజాయతీగా ఉండాలి
మనకు మనం నిజాయితీగా ఉండటం విజయానికి సోపానం. శ్రమ విషయంలో, చేయాల్సిన పని విషయంలో లోపాలను గుర్తించగలిగితే, మనకు మనం సమాధానపడితే విజయానికి దారిలో ఉన్నట్టే..
- రఫెల్ నాదల్,టెన్నిస్ ఆటగాడు
ఆత్మవిశ్వాసంతో...
గుడ్‌లుకింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. అది మీకు హాయినిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తుంది. అలాంటి ఆత్మవిశ్వాసం ఉంటే ఇతర ఒత్తిళ్లన్నింటినీ మరిచి మీరు అనుకొన్నది సాధించగలరు...
- మారియా షరపోవా , టెన్నిస్ ప్లేయర్
సుఖాలపై దృష్టిపెట్టొద్దు...
లక్ష్యాన్ని సాధించాలి అని బలంగా నిర్ణయించుకొన్నాకా మరో ఆలోచన వద్దు. కలలను నిజం చేసుకోవడానికి పోరాడాలి. చాలా వాటిని త్యాగం చేయక తప్పవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి శ్రమిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలవు..
- లియోనల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు.