షరపోవాకు ‘ఫ్రెంచ్’ వైల్డ్ కార్డు నిరాకరణ
పారిస్: డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధానికి గురై... గత నెలలోనే పునరాగమనం చేసిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు ‘వైల్డ్ కార్డు’ ఇవ్వడం లేదని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. దాంతో గతంలో రెండుసార్లు (2012, 2014లో) ఈ టోర్నీలో విజేతగా నిలిచిన షరపోవా ఈసారి బరిలో దిగే అవకాశాన్ని కోల్పోయింది.
నిషేధం గడువు ముగిశాక ‘వైల్డ్ కార్డు’ల సహాయంతో షరపోవా మూడు టోర్నీల్లో ఆడింది. ప్రస్తుతం ఆమె టాప్–200లోకి రావడంతో జూలైలో జరిగే వింబుల్డన్ టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడేం దుకు అర్హత సాధించింది. ‘గాయాల నుంచి తేరుకున్న వాళ్లకు వైల్డ్ కార్డులు ఉంటాయి. అంతేగానీ డోపింగ్‌లో పట్టుబడి తిరిగి వచ్చేవాళ్లకు వైల్డ్ కార్డులు ఇవ్వరు’ అని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు ఫెరాన్‌డిని తెలిపారు.