ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం | Maria Sharapova falls to Dominika Cibulkova at Australian Open | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం

Published Mon, Jan 20 2014 11:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదయింది. రష్యా స్టార్ క్రీడాకారిణి మారియా షరపోవాకు షాక్ తగిలింది. నాలుగుసార్లు మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన షరపోవా నాలుగు రౌండ్లో ఇంటిముఖం పట్టింది. స్లోవెకియా క్రీడాకారిణి డొమినిక సిబుల్కోవా చేతిలో 3-6 6-4 6-1 పరాజయం పాలయింది. తొలి రౌండ్లో ఆధిక్యం కనబరిచిన షరపోవా తర్వాతి రెండు రౌండ్లలో వెనుకబడిపోయింది.

నిర్ణాయక చివరి రెండు రౌండ్లలో పుంజుకుని డొమినిక సంచలనం సృష్టించింది. షరపోవాను మట్టికరిపించింది. తాను తుంటి ఎముక గాయంతో బాధపడుతున్నానని మ్యాచ్ ముగిసిన తర్వాత షరపోవా వెల్లడించింది. అయితే ఓటమికి దీన్ని సాకుగా చూపదలచుకోలేదని పేర్కొంది. భీకరమైన ఫామ్‌లో ఉన్న అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు ఊహించని విధంగా అనా ఇవనోవిచ్ చేతిలో ఆదివారం ఓటమిపాలయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement