మరియా షరపోవా సొంత కంపెనీ 'షుగర్ పోవా' ఇప్పటికే 32 దేశాల్లో టేస్టీ క్యాండీలను విక్రయిస్తోంది. దానిని మరిన్ని దేశాలకు విస్తరించడంతోపాటు కొత్త కంపెనీలను కూడా..
రష్యాలోపుట్టి.. రాకెట్ చేతబట్టి.. ఒట్టి చేతులతో అమెరికా గడ్డపై అడుగు పెట్టి.. వరుస విజయాలు సాధిస్తూ కోట్లు గడించి.. చివరికి డోపింగ్ టెస్టులో విఫమై రెండేళ్ల నిషేధానికి గురైన టెన్నిస్ స్టార్ మరియా షరపోవా కెరీర్ ఆద్యంతం సినిమా కథను తలపిస్తుంది. ఓ వైపు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య తనపై విధించిన నిషేధ కాలాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోన్న ఆమె.. మరోవైపు వ్యాపారాన్ని విస్తరించేపనిలో బిజీగా ఉంది. షరపోవా సొంత కంపెనీ 'షుగర్ పోవా' ఇప్పటికే 32 దేశాల్లో టేస్టీ క్యాండీలను విక్రయిస్తోంది. కాగా, కంపెనీని మరిన్ని దేశాలకు విస్తరించడంతోపాటు కొత్త కంపెనీలను కూడా ప్రారంభించానుకుంటోంది. (చదవండి: అనుకోకుండా అగాధంలోకి..)
ఆ క్రమంలోనే వ్యాపార మెలకువలు నేర్చుకునేందుకు ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్(బోస్టన్)లో చేరింది. రెండు వారాల ప్రత్యేక కోర్సులో చేరిన మరియా.. 'ఇదెలా జరిగిందో తెలియదు.. హార్వర్డ్ లో ప్రోగ్రామ్ చేయకుండా ఉండలేకపోతున్నా' అంటూ ట్విట్టర్ లో స్పందించింది. షరాపోవా పనే బాగుంది. కుదిరితే మళ్లీ బ్యాట్ పట్టుకుని బ్రాండ్లకు అంబాసిడర్ కావచ్చు. లేదంటే బిజినెస్ లో ఇంకా ముందుకు వెళ్లొచ్చు.