Harvard Business School
-
'షుగర్‌పోవా'ను తీపెక్కించనున్న మరియా
రష్యాలోపుట్టి.. రాకెట్ చేతబట్టి.. ఒట్టి చేతులతో అమెరికా గడ్డపై అడుగు పెట్టి.. వరుస విజయాలు సాధిస్తూ కోట్లు గడించి.. చివరికి డోపింగ్ టెస్టులో విఫమై రెండేళ్ల నిషేధానికి గురైన టెన్నిస్ స్టార్ మరియా షరపోవా కెరీర్ ఆద్యంతం సినిమా కథను తలపిస్తుంది. ఓ వైపు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య తనపై విధించిన నిషేధ కాలాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోన్న ఆమె.. మరోవైపు వ్యాపారాన్ని విస్తరించేపనిలో బిజీగా ఉంది. షరపోవా సొంత కంపెనీ 'షుగర్ పోవా' ఇప్పటికే 32 దేశాల్లో టేస్టీ క్యాండీలను విక్రయిస్తోంది. కాగా, కంపెనీని మరిన్ని దేశాలకు విస్తరించడంతోపాటు కొత్త కంపెనీలను కూడా ప్రారంభించానుకుంటోంది. (చదవండి: అనుకోకుండా అగాధంలోకి..) ఆ క్రమంలోనే వ్యాపార మెలకువలు నేర్చుకునేందుకు ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్(బోస్టన్)లో చేరింది. రెండు వారాల ప్రత్యేక కోర్సులో చేరిన మరియా.. 'ఇదెలా జరిగిందో తెలియదు.. హార్వర్డ్ లో ప్రోగ్రామ్ చేయకుండా ఉండలేకపోతున్నా' అంటూ ట్విట్టర్ లో స్పందించింది. షరాపోవా పనే బాగుంది. కుదిరితే మళ్లీ బ్యాట్ పట్టుకుని బ్రాండ్లకు అంబాసిడర్ కావచ్చు. లేదంటే బిజినెస్ లో ఇంకా ముందుకు వెళ్లొచ్చు. -
బోర్డులో సమాన హోదాకు నో
న్యూయార్క్ : మహిళలు,పురుషులు సమానం.. ఇద్దరూ సమాన హక్కులు కలిగి ఉండాలి. ప్రతి నిర్ణయంలో ఇద్దరూ భాగస్వాములు అయితేనే ఏ పనైనా విజయవంతమవుతుందని అంటుంటారు. అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ బోర్డులోనే లింగవివక్ష కొనసాగుతోంది. ఈ అసమానతలను పరిష్కరించడానికి సగం మంది మహిళలు కార్పొరేట్ బోర్డు డైరెక్టర్లుగా ఉండాలనే అభిప్రాయ సేకరణ సర్వేలో, కేవలం 10 శాతం మంది పురుషులే ఆమోదం తెలిపారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, మహిళల కార్పొరేట్ డైరెక్టర్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించింది. బోర్డు అపాయింట్ మెంట్లు ఎలా జరుగుతాయనే దానికి, జెండర్ నే ప్రధాన అంశంగా తీసుకుంటున్నారని 39 శాతం మహిళలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేవలం ఒక్క శాతం పురుషులు మాత్రమే మహిళలకు, పురుషులకు సమానహోదా కల్గిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల బోర్డు సభ్యత్వం తక్కువగా ఉంటుందని ఈ సర్వేలో తేలింది. మహిళల్లో తక్కువ నైపుణ్యాలు ఉండటం వల్లే బోర్డు డైరెక్టర్ పదవుల్లో ఉండటం లేదని వయస్సు పైబడిన పురుష డైరెక్టర్లు అంటున్నారు. కానీ బోర్డు ప్రాధాన్యత ప్రకారం నుంచి బోర్డు డైరెక్టర్ పదవులు ఇవ్వడం లేదని, పాత కాలం నుంచి వస్తున్న పురుష ఆధిక్య సమాజం వల్లే బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం లేదని సర్వేల్లో తేలింది. 49 శాతం మంది మహిళా డైరెక్టర్లు బోర్డు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని, కానీ 9శాతం మందే దీనికి మద్దతిస్తున్నారని సర్వే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది కార్పొరేట్ బోర్డు సీట్లలో కేవలం ఒక్కరే మహిళ ఉంటున్నారని గ్లోబల్ రీసెర్చింగ్ సంస్థ డెలాయిట్ తెలిపింది. 49 దేశాల్లో బోర్డు సభ్యత్వంపై డెలాయిట్ సర్వే జరిపింది. పలు యూరోపియన్ దేశాల్లో వచ్చే నాలుగేళ్లలో 40 శాతం మహిళలు కార్పొరేట్ బోర్డులో ప్రాతినిధ్యం వహించేలా యూరోపియన్ కమిషన్ బోర్డు కోటాలు నిర్ణయించింది. -
ఉద్యోగుల ఐడియాలతో 50 కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: ఉద్యోగుల నుంచి వినూత్న ఐడియాలను ఆహ్వానించడం ద్వారా తమ కస్టమర్లకు సుమారు 50 కోట్ల డాలర్ల (రూ. 3000 కోట్లు) విలువైన సొల్యూషన్లను అందించగలిగామని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పేర్కొంది. ఐడియాప్రెన్యూర్‌షిప్‌పై దృష్టిసారించిన హెచ్‌సీఎల్ టెక్ 2008 నుంచి సుమారు 32 వేలకు పైగా వినూత్న ఐడియాలను తమ సిబ్బంది నుంచి వెలికితీయడం గమనార్హం. ‘ఒక నిర్మాణాత్మక పద్దతిలో మా ఉద్యోగులు తమ ఆలోచనలను పంచుకోవడానికి, మరింత పదును పెట్టడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశాం. కింది స్థాయి నుంచీ వినూత్న ఐడియాలను ఆకర్షించడం అనేది సరికొత్త విప్లవం. మా కంపెనీ వ్యూహంలో చాలా కీలకంగా మారింది’ అని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పృథ్వి షెర్గిల్ పేర్కొన్నారు. 2005లో ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ ఫస్ట్.. కస్టమర్స్ సెంకండ్(ఈఎఫ్‌సీఎస్) అనే కొత్త మేనేజ్మెంట్ విధానంతో ఉద్యోగుల్లో దాగి న వినూత్న ఆలోచనలను సరిగ్గా వినియోగించుకోగలుగుతున్నామన్నారు. ఈ విధానం ఇప్పటికే విద్యా సంస్థలు(హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ చేస్తోంది), విశ్లేషకులను ఆకర్షించిందని షెర్గిల్ చెప్పారు.