సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్తగా టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. సిటీలోనే తొలిసారిగా రూ.23 లక్షల వ్యయంతో ఎనిమిది లేయర్ల సింథటిక్ ఆక్రాలిక్ టెన్నిస్ కోర్టును క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు.
వీసీ రామకృష్ణ రామస్వామి ఈ కోర్టును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ అర్హత గల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా అమలుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ కె.వి.రాజశేఖర్ మాట్లాడుతూ మొదటి దశలో ప్రధాన క్యాంపస్‌లో, రెండవ దశలో సౌత్ క్యాంపస్‌లో టెన్నిస్ కోర్టుతో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ సెంటర్ బాస్కెట్ బాల్ , బీచ్ వాలీబాల్, ఏరోబిక్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియత్రణ అధికారి వెంకటేశ్వరరావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ కిషోర్, పీఈటీలు శ్యామ్‌సన్, కృపాకర్ పాల్గొన్నారు.
హెచ్‌సీయూలో టెన్నిస్ కోర్టు ప్రారంభం
Published Fri, Oct 25 2013 12:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement