
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌లో పరాజయం పాలైంది. గ్వాలియర్‌లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 3–6, 1–6తో ఐదోసీడ్ కర్మన్ కౌర్ థండి (భారత్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల (భారత్)–కరిన్ కెన్నెల్ (స్విట్జర్లాండ్) జోడీకి ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో సెమీస్‌కు చేరింది. నేడు జరిగే సెమీస్‌లో టాప్‌సీడ్ యానా సిజికోవా (రష్యా)–అనా వెసెలినోవిక్ (మాంటెనిగ్రో) జంటతో ప్రాంజల జోడీ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment