
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని పోరాటం ముగిసింది. ఈజిప్ట్‌లోని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రావ్య సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తొలి రౌండ్‌లో నిష్క్రమించింది. క్వాలిఫయర్ హోదాలో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్ ఆడిన శ్రావ్య 2–6, 2–6తో లీసా మేస్ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయం పాలైంది.
డబుల్స్ తొలి రౌండ్‌లో శ్రావ్య–లీసా మేస్ ద్వయం 4–6, 2–6తో మినామి అకియామ–ఇకుమి యామజకి (జపాన్) జోడీ చేతిలో ఓడింది. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో హైదరాబాద్ ఆటగాడు విఘ్నేశ్ పెరణమల్లూర్ 1–6, 3–6తో పెర్చికాట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment