The International Tennis Federation
-
విష్ణువర్ధన్‌కు 31వ డబుల్స్ టైటిల్
గువహటి: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తన ఖాతాలో 31వ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. శుక్రవారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–3 టోర్నమెంట్లో తన భాగస్వామి శ్రీరామ్ బాలాజీ (భారత్)తో కలిసి విష్ణు టైటిల్ దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 4–6, 6–1, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో శశికుమార్ ముకుంద్ (భారత్)–తిముర్ ఖాబిబులిన్ (కజకిస్తాన్) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో మాత్రం విష్ణువర్ధన్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. శశికుమార్ ముకుంద్తో జరిగిన మ్యాచ్‌లో విష్ణు 3–6, 6–4, 1–6తో పరాజయం పాలయ్యాడు. -
ప్రాంజల, శ్రీవైష్ణవి ముందంజ
ఐటీఎఫ్ టోర్నమెంట్ డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి శుభారంభం చేశారు. ఇక్కడి శాంతి టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రాంజల జోడి డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 3-6, 6-3, 6-3తో స్నేహాదేవి రెడ్డి (భారత్)పై, ఎనిమిదో సీడ్ శ్రీవైష్ణవి 6-1, 6-1తో సారాహ్ పాంగ్ (సింగపూర్)పై గెలిచారు. నాలుగో సీడ్ రిషిక సుంకర 6-3, 6-3తో వాసంతి షిండే (భారత్)పై నెగ్గగా, హైదరాబాద్ అమ్మాయి, ఐదో సీడ్ నిధి చిలుముల 7-5, 3-3తో రియా భాటియా (భారత్)పై అధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి వైదొలగింది. హైదరాబాద్‌కే చెందిన ఇస్కా అక్షర 3-6, 3-6తో నందిని శర్మ చేతిలో ఓడిపోగా... స్నేహ పడమట 3-6, 0-6తో ప్రేరణ బాంబ్రీ చేతిలో పరాజయం చవిచూశారు. శివిక బర్మన్ 6-2, 6-0 సాచి బెల్వాల్ (అమెరికా)పై నెగ్గింది. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-వన్షిక సాహ్ని (భారత్) 6-0, 2-6, 10-8తో అరంటా అండ్రడీ (భారత్)- కెరెన్ ష్లోమో (ఇజ్రాయెల్)పై గెలుపొందగా, సౌజన్య భవిషెట్టి-నిధి చిలుముల (హైదరాబాద్) 6-1, 2-6, 7-10తో ఇతీ మెహతా-రష్మీ (భారత్) చేతిలో ఓడింది. శ్వేత రాణా-వాసంతి షిండే 6-4, 3-3తో వరుణ్య-మౌళిక రామ్ (రిటైర్డ్‌హర్ట్)పై, రియా భాటియా-షరోన్ 6-0, 6-3తో శ్రీవైష్ణవి-తనీషా రోహిరాపై గెలిచారు. -
క్వార్టర్స్‌లో సాకేత్, విష్ణు
భీమవరం, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-2 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. కాస్మోపాలిటన్ క్లబ్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-2, 6-1తో మొహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్)పై, విష్ణువర్ధన్ 6-1, 6-1తో రోనక్ మనూజా (భారత్)పై గెలిచారు. మొహిత్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్); విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జోడిలు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్-సనమ్ ద్వయం 6-2, 6-4తో మొహిత్-అజయ్ సెల్వరాజ్ (భారత్) జోడిపై; విష్ణు-జీవన్ జంట 6-4, 7-5తో జతిన్ దహియా-విజయంత్ (భారత్) జోడిపై నెగ్గాయి.