క్వార్టర్స్‌లో సాకేత్, విష్ణు | Quarter-oriented, Vishnu | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్, విష్ణు

Published Thu, Mar 6 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

క్వార్టర్స్‌లో సాకేత్, విష్ణు

క్వార్టర్స్‌లో సాకేత్, విష్ణు


భీమవరం, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-2 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

కాస్మోపాలిటన్ క్లబ్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-2, 6-1తో మొహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్)పై, విష్ణువర్ధన్ 6-1, 6-1తో రోనక్ మనూజా (భారత్)పై గెలిచారు. మొహిత్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.

తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్); విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జోడిలు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్-సనమ్ ద్వయం 6-2, 6-4తో మొహిత్-అజయ్ సెల్వరాజ్ (భారత్) జోడిపై; విష్ణు-జీవన్ జంట 6-4, 7-5తో జతిన్ దహియా-విజయంత్ (భారత్) జోడిపై నెగ్గాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement