ఇస్లామాబాద్: లాంఛనం పూర్తి చేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టు డేవిస్‌కప్ టోర్నీలో మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. పాకిస్తాన్‌తో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు 2–0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో రోజు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.
పురుషుల డబుల్స్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ ద్వయం 6–2, 7–6 (7/5)తో అకీల్ ఖాన్–ముజమ్మిల్ జంటను ఓడించడంతో భారత్‌కు 3–0తో విజయం ఖరారైంది. నామమాత్రమైన నాలుగో మ్యాచ్‌లో నికీ పునాచా 6–3, 6–4తో షోయబ్ మొహమ్మద్‌పై గెలవడంతో భారత్ ఆధిక్యం 4–0కు చేరింది. అప్పటికే ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. కాగా ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు భారత్ వెళ్లడం ఇదే తొలిసారి.
VIDEO | Davis Cup 2024: Indian tennis team celebrate at Islamabad Sports Complex after taking unassailable 3-0 lead against Pakistan. #DavisCup pic.twitter.com/goVGIEKD59
— Press Trust of India (@PTI_News) February 4, 2024
Comments
Please login to add a commentAdd a comment