ఇస్లామాబాద్: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్స్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నేడు, రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే పోటీల్లో విజయమే లక్ష్యంగా భారత్ ఆటకు సిద్ధమైంది. డేవిస్ కప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్‌ది అజేయమైన రికార్డు. దాయాది జట్టుపై ఆడిన ఏడు సార్లు కూడా భారత్ విజయం సాధించింది. ఇప్పుడు పాక్ గడ్డపై కూడా జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది.
అయితే సొంతగడ్డపై ఈ డేవిస్ టై జరగడం, తురుపు ముక్క ఐజాముల్ హక్ ఖురేషి బరిలో ఉండటంతో పాక్ గంపెడాశలు పెట్టుకుంది. గ్రాస్ కోర్టులో ఖురే విశేష అనుభవముంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఏమైన కఠిన సవాల్ అంటూ ఉంటే మాత్రం అది ఖురేషి నుంచే ఎదురు కావచ్చు. ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మొదటి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్... ఐజాముల్ హక్ ఖురేషితో తలపడతాడు. అనంతరం జరిగే రెండో సింగిల్స్‌లో శ్రీరామ్ బాలాజీ... అఖిల్ ఖాన్‌ను ఎదుర్కొంటాడు. శ్రీరామ్ బాలాజీ చాన్నాళ్లుగా డబుల్స్‌కే పరిమితమయ్యాడు. అయితే భారత సింగిల్స్ స్పెషలిస్టు అయిన సుమిత్ నగాల్... గ్రాస్‌కోర్టు కావడంతో పాక్ వెళ్లేందుకు విముఖత చూపాడు. దీంతో శ్రీరామ్‌ను సింగిల్స్ బరిలో దించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment