saketh maineni
-
60 ఏళ్ల తర్వాత తొలిసారి... పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
ఇస్లామాబాద్: లాంఛనం పూర్తి చేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టు డేవిస్‌కప్ టోర్నీలో మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. పాకిస్తాన్‌తో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు 2–0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో రోజు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. పురుషుల డబుల్స్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ ద్వయం 6–2, 7–6 (7/5)తో అకీల్ ఖాన్–ముజమ్మిల్ జంటను ఓడించడంతో భారత్‌కు 3–0తో విజయం ఖరారైంది. నామమాత్రమైన నాలుగో మ్యాచ్‌లో నికీ పునాచా 6–3, 6–4తో షోయబ్ మొహమ్మద్‌పై గెలవడంతో భారత్ ఆధిక్యం 4–0కు చేరింది. అప్పటికే ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. కాగా ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు భారత్ వెళ్లడం ఇదే తొలిసారి. VIDEO | Davis Cup 2024: Indian tennis team celebrate at Islamabad Sports Complex after taking unassailable 3-0 lead against Pakistan. #DavisCup pic.twitter.com/goVGIEKD59 — Press Trust of India (@PTI_News) February 4, 2024 -
సాకేత్ జోడికి డబుల్స్ టైటిల్
ఐటీఎఫ్ టోర్నమెంట్ భీమవరం, న్యూస్‌లైన్: టాప్ సీడింగ్ హోదాకు న్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్ (భారత్)తో కలిసి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 7-6 (7/5), 6-3తో రెండో సీడ్ శ్రీరామ్ బాలాజీ-రంజిత్ విరాళీ మురుగేశన్ (భారత్) జోడిని ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో సాకేత్ జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. తొలి సెట్ టైబ్రేక్‌లో 3-5తో వెనుకబడిన దశలో సాకేత్ జంట వరుసగా ఐదు పాయింట్లు నెగ్గింది. ఓవరాల్‌గా సాకేత్ కెరీర్లో ఇది 12వ ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ కాగా సనమ్ సింగ్‌తో కలిసి నాలుగో టైటిల్ కావడం విశేషం. కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన సాకేత్, సనమ్ సింగ్ సింగిల్స్ విభాగం అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. సెమీఫైనల్స్‌లో సాకేత్ 6-3, 6-1తో శ్రీరామ్ బాలాజీపై నెగ్గగా... సనమ్ సింగ్ 6-3, 6-3తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ విష్ణువర్ధన్‌ను ఓడించాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్, విష్ణు
భీమవరం, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-2 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. కాస్మోపాలిటన్ క్లబ్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-2, 6-1తో మొహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్)పై, విష్ణువర్ధన్ 6-1, 6-1తో రోనక్ మనూజా (భారత్)పై గెలిచారు. మొహిత్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్); విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జోడిలు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్-సనమ్ ద్వయం 6-2, 6-4తో మొహిత్-అజయ్ సెల్వరాజ్ (భారత్) జోడిపై; విష్ణు-జీవన్ జంట 6-4, 7-5తో జతిన్ దహియా-విజయంత్ (భారత్) జోడిపై నెగ్గాయి. -
సాకేత్ జోడి శుభారంభం
చెన్నై: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్‌లో తెలుగు తేజం సాకేత్ మైనేని జోడి శుభారంభం చేసింది. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్, కరేన్ కచనోవ్ (రష్యా) 6-1, 7(9)-6(7) తేడాతో స్పెయిన్ ద్వయం కారెనో బుస్టా, రామోస్‌ను ఓడించి క్వార్టర్ఫైనల్స్కు చేరారు. తొలి సెట్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన సాకేత్ జోడికి రెండో సెట్లో మాత్రం ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా సాగినప్పటికీ చివరి వరకు ఒత్తిడికి లోనుకాకుండా సమన్వయంతో ఆడి గెలిచారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించిన భారత ఆటగాడు జీవన్ నెడుంజెళియన్ సింగిల్స్ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. సెంటర్ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌లో చెక్ ఆటగాడు జిరి వెస్లీ చేతిలో 5-7, 2-6 తేడాతో తనకు పరాజయం ఎదురైంది. 25 ఏళ్ల జీవన్ తొలి సెట్లో ఓదశలో 4-1 ఆధిక్యంలో దసుకెళ్లాడు. అయితే అనవసర తప్పిదాలతో తగిన మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు స్థానిక ఆటగాడు రాంకుమార్ రామనాథన్ చెన్నై ఓపెన్ ప్రధాన డ్రాకు అర్హత సాధించాడు. 526వ ర్యాంకులో ఉన్న రాంకుమార్ 197వ ర్యాంకర్ అయిన స్లొవేకియా ఆటగాడు నార్బెట్ గొంబోస్ను క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్లో 7-6(3), 3-6, 6-3 తేడాతో ఓడించాడు. ప్రధాన టోర్నీ తొలి రౌండ్లో తను భారత స్టార్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌ను ఎదుర్కొనబోతున్నాడు.