సాకేత్ జోడి శుభారంభం | saketh dobles won the match | Sakshi
Sakshi News home page

సాకేత్ జోడి శుభారంభం

Published Tue, Dec 31 2013 1:53 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

సాకేత్ జోడి శుభారంభం - Sakshi

సాకేత్ జోడి శుభారంభం

 చెన్నై: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్‌లో తెలుగు తేజం సాకేత్ మైనేని జోడి శుభారంభం చేసింది. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్, కరేన్ కచనోవ్ (రష్యా) 6-1, 7(9)-6(7) తేడాతో స్పెయిన్ ద్వయం కారెనో బుస్టా, రామోస్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరారు. తొలి సెట్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన సాకేత్ జోడికి రెండో సెట్‌లో మాత్రం ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా సాగినప్పటికీ చివరి వరకు ఒత్తిడికి లోనుకాకుండా సమన్వయంతో ఆడి గెలిచారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించిన భారత ఆటగాడు జీవన్ నెడుంజెళియన్ సింగిల్స్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. సెంటర్ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌లో చెక్ ఆటగాడు జిరి వెస్లీ చేతిలో 5-7, 2-6 తేడాతో తనకు పరాజయం ఎదురైంది. 25 ఏళ్ల జీవన్ తొలి సెట్‌లో ఓదశలో 4-1 ఆధిక్యంలో దసుకెళ్లాడు. అయితే అనవసర తప్పిదాలతో తగిన మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు స్థానిక ఆటగాడు రాంకుమార్ రామనాథన్ చెన్నై ఓపెన్ ప్రధాన డ్రాకు అర్హత సాధించాడు.
 
  526వ ర్యాంకులో ఉన్న రాంకుమార్ 197వ ర్యాంకర్ అయిన స్లొవేకియా ఆటగాడు నార్బెట్ గొంబోస్‌ను క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్‌లో 7-6(3), 3-6, 6-3 తేడాతో ఓడించాడు. ప్రధాన టోర్నీ తొలి రౌండ్‌లో తను భారత స్టార్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌ను ఎదుర్కొనబోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement