గ్యాస్ సిలిండర్లపై ‘నగరం’ దెబ్బ
దేవరపల్లి:వంటగ్యాస్ సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడి గ్యాస్ రిఫైనరీ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. సిలిండర్లలోకి గ్యాస్‌ను నింపే కేంద్రాలకు సరఫరా లేకపోవడంతో జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని గ్యాస్
ఏజెన్సీలకు తూర్పుగోదావరి జిల్లా గుమ్మందొడ్డి వద్ద గల రిఫైనరీ నుంచి గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రెండు జిల్లాల పరిధిలో సుమారు 50 గ్యాస్ ఏజెన్సీలు నిత్యం దాదాపు 30 వేల సిలిండర్లను ఇస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలో 21 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, రోజుకు సుమారు 12 వేల సిలిండర్లు అవసరం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఏజెన్సీలకు రోజుకు 600 సిలిండర్లు, పట్టణ ప్రాంతంలోని ఏజెన్సీలకు 900 సిలిండర్లు చొప్పున అవసరం ఉంటుంది. పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా నిలుపుదల చేయటంతో బుల్లెట్ (పెద్ద ట్యాం కర్ల) ద్వారా రిఫైనరీకి తీసుకువచ్చి ఏజెన్సీలకు సరఫరా చేస్తున్నారు.
ఈ విధంగా రోజుకు 9వేల సిలిం డర్లు మాత్రమే రావడంతో జిల్లా అవసరాలకు సరి పోవటం లేదు. రోజుకు 600 సిలిండర్లు అవసరమైన ఏజెన్సీలకు 300, పట్టణ ప్రాంతంలోని ఏజెన్సీలకు 600 సిలిండర్ల చొప్పున మాత్రమే వస్తున్నాయి. దీంతో కొరత ఏర్పడి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్లను ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి తెచ్చుకునేందుకు సొంత లారీలను వినియోగిస్తున్న ఏజెన్సీలలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ కంపెనీ లారీల ద్వారా తెచ్చుకునే ఏజెన్సీలకు సిలిండర్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెల కొంది. గ్యాస్ పైపులైన్ తనిఖీ పూర్తరుుతే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు.