devarapalli
-
దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతులను నిడదవోలు మండలం తాడిమళ్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 10 మంది ఉన్నారు. -
దేవరపల్లిలో జన జాతర
సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమం, చేసిన మేలును వివరించేందుకు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైంది. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల నుంచి అశేష సంఖ్యలో తరలి వచ్చిన జన ప్రవాహంతో దేవరపల్లి పరిసర ప్రాంతాలు, సభా ప్రాంగణం పోటెత్తాయి. తొలుత కృష్ణంపాలెం హైవే నుంచి సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలతో 6 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆరు వేల మందికి పైగా యువత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. దేవరపల్లి బస్టాండ్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకూ ప్రజలు నేతల ప్రసంగాలు శ్రద్ధగా విన్నారు. సీఎం జగన్ తమకు చేసిన మంచిని గుర్తుకు చేసుకుని ‘జై జగన్.. 2024 జగన్ వన్స్‌మోర్’ అంటూ నినదించారు. సంఘ సంస్కర్త సీఎం జగన్: మంత్రి చెల్లుబోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ సంఘ సంస్కర్త అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. నాలుగన్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.60 లక్షల కోట్లు జమ చేశారని, ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయని తెలిపారు. పేదలకు అంతర్జాతీయస్థాయి విద్య, వైద్య సౌకర్యాలను చేరువ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ తలెత్తుకొని తిరుగుతున్నారని వివరించారు. వృద్ధి రేటు పెంచిన సీఎం జగన్: మంత్రి కారుమూరి సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలతో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధిస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పేదల ఆరి్థక స్థితిగతులు మార్చారని అన్నారు. దీంతో రాష్ట్ర వృద్ధి రేటు 11.5 శాతానికి పెరిగిందని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కొని రైతులకు 72 గంటల్లోనే నగదు చెల్లించామన్నారు. సామాజిక సాధికారత సాధ్యం చేశారు : మంత్రి తానేటి వనిత దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న సామాజిక సాధికారతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధ్యం చేసి చూపించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు సంక్షేమంలో, పదవుల్లో పెద్ద వాటా ఇచ్చి, వారిని అభివృద్ధి పథంలోకి తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ట్యాబ్‌లు ఇస్తున్నారని, వారికి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే వాటి ద్వారా అందిస్తున్నారని చెప్పారు. దీనిని కూడా కొందరు తప్పుపడుతున్నారని, పెత్తందార్ల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవవచ్చు కానీ, పేద పిల్లలు చదివితే భరించలేరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పేదలకు భూములిచ్చారు: ఎంపీ సురేష్ వైఎస్ జగన్ అధికారం చేపట్టాక అసైన్డ్, అన్యాక్రాంతమైన భూములను పేదలకు అందించారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. మహిళా సాధికారతకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేత జగనేనన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి: ఎంపీ మార్గాని భరత్‌రామ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. రూ.10 వేల కోట్లు వెచ్చిస్తే మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: ఎమ్మెల్యే తలారి ఈ నాలుగున్నరేళ్లలో గోపాలపురం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి సీఎం జగన్ రూ.3 వేల కోట్లు వెచ్చించారని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. ఇందులో రూ.1,200 కోట్లు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. -
వద్దంటున్నా పెళ్లి సంబంధాలు.. సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, అనకాపల్లి: దేవరాపల్లికి చెందిన సచివాలయ ఉద్యోగి గొర్లె వరుణ్‌కుమార్(31) ఆత్మహత్య చేసుకున్నాడు. తాను వద్దని వారించినా కుటుంబీకులు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపంతో వరుణ్‌కుమార్ దేవరాపల్లిలోని తన ఇంట్లో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలివి. దేవరాపల్లికి చెందిన గొర్లె వరుణ్‌కుమార్ (31) ఇదే మండలంలోని వేచలం గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మేన్‌గా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన కుమారుడికి వివాహం చేయాలన్న ఆలోచనతో తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు కరువునాయుడు, బంధువులు వరుణ్‌కుమార్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే కొంతకాలం పెళ్లి సంబంధాలు చూడొద్దని వరుణ్‌కుమార్ నిరాకరించాడు. అయినా కుటుంబసభ్యులు తనకు సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం స్నానం చేసి వస్తానని చెప్పి ఇంటి రెండో అంతస్తులో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. వరుణ్‌కుమార్ ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే అతను ఫోన్ ఎంతకీ తీయకపోవడంతో గది తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి శ్లాబ్ హుక్కుకి తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. చదవండి: (Bhimavaram: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్) ఊపిరి ఉందేమోనన్న ఆశతో తాడు తొలగించి కిందికి దించారు. అప్పటికే వరుణ్‌కుమార్ మృతి చెందాడని నిర్ధారించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ తాతారావు, ఎ.కోడూరు ఎస్ఐ లోకేశ్వరరావు మృతుడి ఇంటికి చేరుకొని విచారణ చేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో తల్లితో పాటు కుటుంబ సభ్యులు పుట్టెడు దుఖంలో మునిగిపోయారు. తోటి సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామస్తులు వరుణ్‌కుమార్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పరామర్శ వరుణ్ కుమార్ మృతి చెందాడన్న విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లికి చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు నాయుడు తదితర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతదేహానికి అనకాపల్లిలో పోస్టుమార్టం నిర్వహించి త్వరగా పంపించాలని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్లో డిప్యూటీ సీఎం ఆదేశించారు. -
భార్యను హత్య చేసి.. ఆపై చెరువులో పడేసి..
సాక్షి, దేవరపల్లి (తూర్పుగోదావరి): కట్టుకున్న భార్యను పథకం ప్రకారంహతమార్చి, గుట్టు చప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని ఊర చెరువులో పడేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, హతురాలి తల్లి అమరావతి కథనం ప్రకారం.. యాదవోలుకు చెందిన సూరే వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మికి, అదే గ్రామానికి చెందిన ముమ్మిడి నాగరాజుకు మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలతో పాటు కొంత సామగ్రిని ముట్టజెప్పారు. వివాహం జరిగిన కొన్నాళ్లకు భార్య నాగలక్ష్మిని నాగరాజు సూటిపోటి మాటలతో వేధించడంతో పాటు శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడం ఆరంభించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. ఇద్దరికీ పెద్దలు సయోధ్య కుదిర్చేవారు. గతంలో ఒకసారి భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. పెద్దల సమక్షంలో సర్దుబాటు చేసి, తిరిగి కాపురానికి పంపించారు. అయినప్పటికీ నాగరాజులో మార్పు రాకపోవడంతో దంపతుల మధ్య తిరిగి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నాగలక్ష్మి (19) కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు ఆమెను ఈ నెల 27న భర్త వద్దకు పంపించారు. తెల్లవారేసరికి తన భార్య నాగలక్ష్మి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులకు నాగరాజు చెప్పాడు. ఆమె కోసం తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో, అల్లుడిపై అనుమానం ఉందంటూ శుక్రవారం రాత్రి దేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా, భార్య నాగలక్ష్మిని తానే హత్య చేసి ఊరి చెరువులో పడేసినట్టు అంగీకరించాడు. చెరువులో నాగలక్ష్మి మృతదేహం శనివారం ఉదయం లభ్యమైందని ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. సంఘటన స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్, ఇన్చార్జి సీఐ కె.లక్ష్మణరెడ్డి పరిశీలించారు. నిందితులు నాగరాజును, అతడికి సహకరించిన మేనల్లుడు గన్నూరి సూరిబాబు, నాగరాజు తల్లి ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీహరిరావు తెలిపారు. -
బాలిక వైద్యానికి రూ.15 లక్షల సాయం.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
దేవరపల్లి: కాలిన గాయాలతో విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక అన్వికను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన గొల్లపల్లి రాకేష్ నాలుగేళ్ల కుమార్తె ఇంటి వద్ద ఆటలాడుకుంటూ వేడి సాంబారు గిన్నెలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఎమ్మెల్యే తలారి వెంకట్రావును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే వెంకట్రావు కోరారు. ఈ మేరకు సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంకు, ఎమ్మెల్యేకు బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవరపల్లి మండలం గొల్లగూడెం దివ్యాంగుల, వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు కాగిత భాస్కరరావు బాలిక వైద్యఖర్చులకు రూ.5,116 సాయం అందజేశారు. చదవండి: (గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!) -
గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
దేవరాపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇతర రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల విలువ చేసే 556 కేజీల గంజాయిని దేవరాపల్లి పోలీసులు బుధవారం శ్రీరాంపురం వై.జంక్షన్ వద్ద పట్టుకున్నారు. వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎస్ఐ పి.సింహాచలంతో కలిసి చోడవరం సీఐ సయ్యద్ ఇలియాస్ మహ్మద్ వెల్లడించారు. జీనబాడు చెక్‌పోస్టు దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా సంచరిస్తున్నట్టు ఎస్ఐ పి.సింహాచలంకు పక్కా సామాచారం రావడంతో తన సిబ్బందితో వెళ్లి అక్కడ పాడేరు మండలం బొడ్డాపూట్‌కు చెందిన రేగం గోవింద, కొర్రా నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న విషయం బయటపడింది. తక్షణమే పోలీసులు సమీపంలో మాటు వేసి గంజాయితో వస్తున్న బొలెరో వ్యాన్‌ను అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో వ్యాన్ డ్రైవర్, యజమానితో పాటు ద్విచక్ర వాహనంపై వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 40 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు బొలెరో వ్యాన్‌ను, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నలుగురు వ్యక్తుల కోసం గాలిస్తున్నామన్నారు. గంజాయి తరలింపులో కచ్చితమైన సమాచారాన్ని ముందస్తుగా సేకరించిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 501 కిలోల గంజాయి పట్టివేత పెదబయలు : మండలంలోని సీతగుంట జంక్షన్లో బుధవారం తెల్లవారు జామున పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా 501 కిలోల గంజాయి, లారీని స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్థానిక ఎస్ఐ పులి మనోజ్‌కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తున్నట్టు గమనించిన లారీ డ్రైవర్ లారీని నిలిపివేసి పరారయ్యాడని, లారీలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లారీని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. లారీ విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రాంతానికి చెందినదిగా గుర్తించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మోతుగూడెంలో ఐదుగురు అరెస్టు మోతుగూడెం: మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయితో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోతుగూడెం ఎస్ఐ వి.సత్తిబాబు తన సిబ్బందితో సాయంత్రం తనిఖీలు చేస్తుండగా మోటార్ బైక్ వస్తున్న ఇద్దరు యువకుల్ని ఆపారు. దీంతో కారులో ఉన్న నలుగురిలో ఒకరు కారు దిగి పారిపోయాడు. దీంతో పోలీసులు కారులో ఉన్న ముగ్గురిని, బైక్ వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా 20 కేజీల గంజాయి లభించింది. మధ్యవర్తుల రిపోర్టులో గంజాయిని, ఒక బైక్, కారు, ఐదు సెల్ఫోన్లు, నగదును సీజ్ చేసినట్టు ఎస్ఐ తెలిపారు. డొంకరాయి సమీప అటవీ ప్రాంతం నుంచి గంజాయిని ఖమ్మం జిల్లా ఎల్లందుకు తీసువెళ్తుండగా పట్టుబడినట్టు తెలిపారు. పట్టుబడిన వారిలో కొత్తగూడెం జిల్లా ఎల్లందు చెందిన ముక్కు శ్రీవ్యాస్, సిరిమల్ల రాజేష్, గర సాంధల లింగారెడ్డి, మల్కన్‌గిరి జిల్లా చెందిన తుమ్మా చరణ్, పలాస ఇంద్రలను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఒడిశాకు చెందిన పలాస పాపారావు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. -
ఘాటెక్కిన మిర్చి
దేవరపల్లి: మిర్చి అ‘ధర’హో అనిపిస్తోంది. గతంలో ఎన్నడూలేని ధర పలుకుతోంది. అయితే దిగుబడులు దారుణంగా తగ్గడంతో రైతులు నిట్టూరుస్తు్తన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎండుమిర్చిని సాగుచేస్తున్నా దేవరపల్లి మండలంలోని పల్లంట్ల, కురుకూరు పంట ప్రత్యేకం. ఇక్కడ మిరపకాయలు దేశవాళీ కావడం వల్ల నాణ్యత, రుచి ఉంటుందని ప్రజల నమ్మకం. ఇక్కడ కాయలతో పచ్చళ్లు పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెబుతున్నారు. దీంతో గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చిన పల్లంట్ల మిరపకాయలు కొనుగోలు చేస్తుంటారు. 639 హెక్టార్లలో.. జిల్లాలో 639 హెక్టార్లలో ఎండుమిర్చి సాగు ఉంది. దీనిలో దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం, దేవరపల్లి గ్రామాల్లో పండిస్తుండగా పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లోనే సుమారు 150 ఎకరాల్లో పంట ఉంది. గతంలో దేవరపల్లి మండలంలో 300 ఎకరాల్లో మిరప సాగు ఉండేది అయితే చీడపీడలు, దిగుబడులు తగ్గడం వంటి కారణాలతో నాలుగేళ్లుగా రైతులు సాగు తగ్గించారు. సగానికి తగ్గిన దిగుబడి ఈ ఏడాది ఎండుమిర్చి దిగుబడులు దారుణంగా పడిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు సుమారు 6 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని అంటున్నారు. ఎకరాకు సుమారు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండటంతో రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు. దిగుబడులు మరింత తగ్గిన రైతులకు నష్టాలు తప్పని పరిస్థితి. ప్రస్తుతం ధర వీసె (1400 గ్రాములు) రూ.650 నుంచి రూ.700, గుల్లకాయలు రూ.450 నుంచి రూ.500 పలుకుతోంది. తెల్లదోమతో నష్టం ఈ ఏడాది మిరప తోటలకు తెల్లదోమ వ్యాపించింది. కాయ తయారు కాకుండానే పిందె దశలోనే పండిపోయి రాలిపోయిందని రైతులు అంటున్నారు. దీంతో కాపులు లేక తోటలు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర పెరిగే అవకాశాలు నేను మూడు ఎకరాల్లో మిరప పంట వేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాను. ఎకరాకు 3 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. మూడు ఎకరాల్లో దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వీసె ధర రూ.700 ఉంది. వారం రోజుల్లో రూ.1,000 దాటవచ్చు. ఈ ఏడాది మిరప తోటలు నల్లదోమ, ఆకుముడత తెగుళ్లతో ఎక్కువగా దెబ్బతిన్నాయి. – నలమాటి బాలకృష్ణ, రైతు, పల్లంట్ల -
7న దేవరపల్లికి సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి (దేవరపల్లి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 7న దేవరపల్లికి రానున్న దృష్ట్యా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలకు సీఎం జగన్ హాజరవుతున్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను బారికేడ్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఏర్పాట్లపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. చదవండి: (మహిళల రక్షణలో 'దిశ' మారదు) సీఎం పర్యటన రేపు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ అనంతరం పొగాకు వేలం కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ వేదిక, వీవీఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన వీఐపీల వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ వద్దకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు మరో 25 మందిని అనుమతిస్తామని, ఇద్దరు ఫొటోగ్రాఫర్లకు అనుమతి ఉంటుందన్నారు. పాత్రికేయులకు హెలీప్యాడ్, రిసెప్షన్ వేదిక వద్దకు అనుమతి ఉండదని చెప్పారు. రిసెప్షన్ వేదిక వద్దకు 150 మంది బంధువులు, నాయకులకు అనుమతి ఉంటుందన్నారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి, డీఎస్పీ శ్రీనాథ్, డీపీఓ రమేష్‌బాబు, ఇంటిలిజెన్స్ డీఎస్పీ జి.వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన భారీ గిరి నాగు హల్చల్
సాక్షి, విశాఖ: జిల్లాలోని దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ సెక్షన్ పరిధిలోని సమీప పంట పొలాల్లో ఆదివారం అరుదైన భారీ గిరి నాగు హల్చల్ చేసింది. ఇది సుమారు 20 అడుగుల పొడవు ఉండటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల ఆదేశాలతో విశాఖపట్నం తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సమితి ప్రతినిధి మూర్తి అక్కడకు చేరుకుని, సుమారు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టం మీద గిరినాగును పట్టుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. (నేడు గన్నవరం, విశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దు) -
కాటేసిన కరెంటు
విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన దేవరాపల్లి మండలం వేచలం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రైతు వేచలపు వెంకటరావు(60) తన పొలంలోని మోటా రుకు సమీపంలో గడ్డి కోస్తుండగా విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై కన్నుమూశాడు. సాక్షి, దేవరాపల్లి(మాడుగుల): వేచలం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వేచలపు వెంకటరావు(60)అనే రైతు తన పొలంలో గల వ్యవసాయ మోటారుకు సమీపంలో ఆదివారం సాయంత్రం గడ్డి కోస్తున్నాడు. అయితే వ్యవసాయ మోటారుకు విద్యుత్ సరఫరా చేసే వైరు గడ్డిలో ఉండడాన్ని గుర్తించని అతను గడ్డితో కలిపి వైర్లను కొడవలితో కోసేయడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో పది నిముషాల్లో త్రిఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపి వేసే సమయంలో విద్యుత్ షాక్‌కు గురై వెంకటరావు మృతిచెందడాన్ని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. గడ్డి కోసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలు దేరిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు వెంకటరావుకు భార్య నాగభూషణమ్మ, వివాహితులైన నలుగురు కుమార్తెలు, అవివాహితుడైన కుమారుడు నర్సింహనాయుడు ఉన్నారు. వెంకటరావు మృతితో వేచలం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని ట్రాన్స్‌కో ఏఈ కె. శంకరరావు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను స్థానిక వైఎస్సార్సీపీ నాయుకులు నాగిరెడ్డి శఠారినాయుడు, రెడ్డి బలరాం తదితరులు పరామర్శించారు. -
మరోసారి నాలుక మడతెట్టిన మంత్రి లోకేష్
దేవరాపల్లి (మాడుగుల) : ‘చినబాబు’ మళ్లీ నాలుక మడతెట్టేశారు. ప్రతి సభలో, సమావేశంలో ఏదో అంశంపై తప్పులు మాట్లాడుతూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్న మంత్రి నారా లోకేష్.. తనదైన శైలి ప్రసంగంలో మరో మారు తడబడి ‘పప్పు’లో కాలేశారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. విశాఖ ఎయిర్‌పోర్టుకు బదులుగా ‘వైకాపా ఎయిర్‌పోర్టు’గా ప్రస్తావిస్తూ ప్రసంగించడంతో సభకు హాజరైన టీడీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు నవ్వుకున్నారు. మాడుగుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి గవిరెడ్డి రామానాయుడు, అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి ఆడారి ఆనంద్‌కు మద్దతుగా చేపట్టిన ప్రచార సభలో టీడీపీ పాలనపై ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన లోకేష్.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్న ఘటనను హేళన చేస్తూ ప్రసంగించబోయి విశాఖ విమానాశ్రయాన్ని ‘వైకాపా ఎయిర్‌పోర్టు’గా పేర్కొనడంతో సదస్సుకు హాజరైన సొంత పార్టీ కార్యకర్తలే ఫక్కున నవ్వుకుంటూ కామెడీ చేశారు. కాగా, దేవరాపల్లిలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభకు కొద్దిపాటి జనాన్ని తరలించేందుకు తమ్ముళ్లు నానా అవస్థలు పడ్డారు. మహిళలకు రూ. 300, మగవారికి రూ.300 డబ్బు, మద్యం బాటిల్ ఇచ్చి బలవంతంగా సభకు తీసుకువచ్చారు. వెరసి తెలుగు తమ్ముళ్లతో దేవరాపల్లి మండలంలో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి.( చదవండి : లోకేశ్‌తో నెటిజన్ల హోలీ ఆట ) దేవరాపల్లి టీడీపీ సభకు వస్తూ మార్గ మధ్యంలో మద్యం సేవిస్తున్న టీడీపీ నాయకులు పాడేరులో జనం లేక లోకేష్ సభ వెలవెల పాడేరు : విశాఖపట్నం జిల్లా పాడేరులో సీఎం చంద్రబాబునాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్న టీడీపీ ఎన్నికల ప్రచార సభ జనం లేక వెలవెలబోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పాడేరులో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల ప్రచార సభను తలపెట్టారు. అయితే సభా ప్రాంగణం మొత్తం పచ్చ చొక్కాలతో వచ్చిన టీడీపీ శ్రేణులు తప్ప జనం కనిపించలేదు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లడుతూ.. పాడేరు అసెంబ్లీ అభ్యర్ధి గిడ్డి ఈశ్వరి, అరకు పార్లమెంట్ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరగా జనం నుంచి స్పందన రాలేదు. ( చదవండి : నోరు జారిన లోకేశ్.. ఆర్కే సెటైర్!) -
గోపాలపురం మే ‘కుల’ కుర్చీ
సాక్షి, దేవరపల్లి: జిల్లాలోని మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడి ఓటర్లు 35 ఏళ్ల నుంచి తమ విలక్షణతను ప్రదర్శిస్తున్నా.. వారి తలరాత మాత్రం మారడం లేదు. 1983 వరకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు అనంతరం టీడీపీ ఆవిర్భావంతో ఆపార్టీని ఆదరిస్తున్నారు. అయితే పాలకులు మాత్రం ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. కులదురహంకారంతో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2004 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఈ నియోజకవర్గంలో మార్పువచ్చినా.. మళ్లీ 2009 నుంచి పాతతీరే కొనసాగింది. ఈ సారైనా మళ్లీ మార్పు కనిపిస్తోందని ప్రజలు ఆశగా నిరీక్షిస్తున్నారు. అగ్రకుల ఏలుబడి నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయినప్పటికీ ఏలుబడి మాత్రం అగ్రకులాల పెద్దలదే. 2004 వరకు కొవ్వూరు జమీందార్లు పెండ్యాల కుటుంబం నాయకత్వంలో శాసనసభ్యులు పనిచేసేవారు. 2004 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలవడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అయితే మళ్లీ 2009 నుంచి పాతతీరే కొనసాగింది. 2014 ఎన్నికల నుంచి నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం ఆధిపత్యం కొనసాగిస్తోంది. 1962లో గోపాలపురం నియోజకవర్గం ఏర్పడింది. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్ధిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీపడగా అతితక్కువ ఓట్ల తేడాతో ముప్పిడి వెంకటేశ్వరరావు గెలిచారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన వారిలో తానేటి వీరరాఘవులు, కారుపాటి వివేకానంద మంత్రులుగా పనిచేశారు. వ్యవసాయం ప్రధాన జీవనాధారం నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ప్రధానంగా వాణిజ్య పంటలు వర్జీనియా పొగాకు, జీడిమామిడి, ఆయిల్‌పామ్, కొబ్బరి సాగవుతున్నాయి. వరి, మొక్కజొన్న సాగుపైనా ఇక్కడి రైతులు మొగ్గుచూపుతారు. వ్యవసాయరంగం పూర్తిగా బోరుబావులపై ఆధారపడి సాగుతోంది. మోటార్ల ద్వారా భూగర్భ జలాలను తోడి రైతులు పంటలు పండిస్తున్నారు. సుమారు 7,600 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగవుతోంది. మెట్ట ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించాలనే ఆలోచనతో 2005లో ఏర్పాటు చేసిన తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ ద్వారా 2.05 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం 60 వేల నుంచి 70 వేల ఎకరాలకు నీరు సరఫరా జరుగుతోంది. దాదాపు 7 వేల బోర్లు ఉన్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. ద్వారకాతిరుల చినవెంకన్న క్షేత్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ప్రముఖ క్రైస్తవ పుణ్య క్షేత్రం నిర్మలగిరి కూడా ఇక్కడే గౌరీపట్నంలో కొలువైంది. 120 ఎకరాల్లో నల్లరాతి క్వారీలు నియోజకవర్గంలో విస్తరించిన నల్లరాతి క్వారీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. దేవరపల్లి మండలంలో గౌరీపట్నం, కొండగూడెం, దుద్దుకూరు, బందపురం, లక్ష్మీపురం గ్రామాల్లో నల్లరాతి క్వారీలు విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయంతోపాటు దాదాపు 10వేల మంది కూలీలకు ఉపాధి లభిస్తోంది. 120 క్వారీలు, 100 క్రషర్లు ఉన్నాయి. భౌగోళిక స్వరూపం తూర్పున కొవ్వూరు, దక్షిణాన తాడేపల్లిగూడెం, ఉత్తరాన పోలవరం, పడమర చింతలపూడి నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. ముఖ్యమైన సమస్య ఇళ్లస్థలాల సమస్య ఎక్కువగా ఉంది. టీడీపీ పాలనలో ఎక్కడా ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వం గజం జాగా ఇవ్వలేదు. సుమారు 20 వేల కుటుంబాలు ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాలనలో అడిగిన ప్రతిపేదవాడికీ గృహాలు మంజూరు చేశారు. ఆయన హయాంలో సుమారు 25,000 గృహాల నిర్మాణం జరిగింది. గత ఐదేళ్లల్లో కనీసం నాలుగు వేల గృహాలు కూడా నిర్మాణం జరగలేదు. బలం పుంజుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలమైన శక్తిగా ఎదిగింది. ఐదేళ్లుగా ఆపార్టీ సమన్వయకర్త తలారి వెంకట్రావు ప్రజల్లో ఉంటూ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నారు. గడగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మూడునాలుగుసార్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. అధికార టీడీపీలో రెండు బలమైనవర్గాలు గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఆధిపత్యం కోసం కుమ్ములాడుతున్నాయి. ప్రజలు ఈసారి వైఎస్సార్‌సీపీవైపు మొగ్గుచూపుతున్నారు. మండలాలు: గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల ఓటర్లు పురుషులు స్త్రీలు ఇతరులు 2,22,223 1,11,092 1,11,115 16 -
దేవరపల్లిలో అగ్ని ప్రమాదం
తోట్లవల్లూరు (పామర్రు) : మండలంలోని దేవరపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన అగ్ని ప్రమాదం గ్రామస్తులను భయాందోళనలకు గురి చేసింది. గ్రామానికి చెందిన టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు భీమవరపు అంజిరెడ్డి ఇంటి ఆవరణలోని వరిగడ్డి వాములకు మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. ఇంటి ఆవరణలోని అంజిరెడ్డి, ఆయన బాబాయిలు అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు చెందిన నాలుగు భారీ గడ్డి వాములు (సుమారు 25 ఎకరాల గడ్డి) అగ్నికి ఆహుతైంది. రెండు పెద్ద పశువుల పాకలు కాలి బూడిదయ్యాయి. పశువుల పాకలో నిల్వ చేసిన 54 పుట్లు పసుపు, 60 పుట్లు కంద విత్తనం కూడా మంటల దాటికి ఎందుకు కొరగాకుండాపోయాయి. మొవ్వ ఫైర్ ఆఫీసర్ రాంబాబు తన సిబ్బందితో తరలివచ్చి మంటలను అదుపు చేశారు. తహసీల్దార్ పరిశీలన.. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ జీ. భద్రు, ఎస్ఐ మురళి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మంటల అదుపునకు తీసుకోవాల్సిన చర్యలను ఫైర్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. జేసీబీలను ఏర్పాటు చేయించి మంటల అదుపునకు కృషి చేశారు. పంచాయతీ కార్యదర్శి అశోక్, వీఆర్వో కిశోరకుమార్ పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు. -
దేవరపల్లిలో మరో దాచేపల్లి ఘటన
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో దారుణం జరిగింది. రాష్ట్రంలో కలకలం రేపిన దాచేపల్లి ఘటన మరవక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని దేవర పల్లిలో 55ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. గ్రామంలో గురుస్వామిగా చెలామణి అయ్యే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. -
దేవర పల్లి వద్ద లారీ దగ్ధం
-
దేవరపల్లిలో దొంగనోట్ల ముఠా హల్చల్
దేవరపల్లి: దేవరపల్లిలో దొంగనోట్లు మార్పిడి చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను బుధవారం సాయంత్రం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని టుబాకో బోర్డు సమీపంలో గల హోటల్ వద్ద దొంగనోట్లు మార్పిడి చేసే ముఠా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పి.వాసు సిబ్బందితో హోటల్ వద్దకు చేరుకుని ముఠా సభ్యులను చుట్టుముట్టారు. దీంతో ముఠా సభ్యులు ఎదురుదాడికి దిగి తప్పించుకొనే ప్రయత్నం చేయగా ఎస్సై గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.2,10,900 విలువైన రూ.2,000, 500, 200, 100 దొంగ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐ సి.శరత్‌రాజ్‌కుమార్ దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఇద్దరు ముఠా సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వీరు తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాకు చెందినవారిగా తెలిసింది. అయితే విజయవాడ కేంద్రంగా పెద్ద ముఠా దొంగనోట్లు చలామణి చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల యర్నగూడెంలో దొంగనోట్లతో ముఠా సభ్యులు కారులో ఏలూరు వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కారు ఆపి వివరాలు సేకరిస్తుండగా ముఠా సభ్యులు అతివేగంగా కారుతో ఉడాయించినట్టు తెలిసింది. దేవరపల్లి అడ్డాగా చేసుకుని కొన్నేళ్లుగా ఉభయగోదావరి, కృష్ణా, తెలంగాణకు చెందిన ముఠా దొంగనోట్లు చలామణి చేస్తున్నట్టు సమాచారం. -
డిసెంబర్ నాటికి బయోమెట్రిక్
దేవరపల్లి : ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబ ర్ నాటికి బయోమెట్రిక్ విధానం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని సాంఘిక సంక్షే మ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అ న్నారు. దేవరపల్లిలోని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా ఎనిమిది పాఠశాలల నిర్మాణం పూర్తయిందన్నారు. ఒక్కో క్క పాఠశాలకు రూ.19 కోట్లు మంజూరు చేశామన్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరలో చేపడతామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖకు ఈ ఏడాది రూ.8,500 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. హాస్టళ్లకు రూ.200 కోట్లు, వెల్ఫేర్ వసతి గృహా లకు రూ.270 కోట్లు కేటాయించామన్నారు. హాస్టళ్లలో 1.60 లక్షల మంది, గిరిజన వసతి గృహాల్లో 80 వేల మంది విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. వీరి ఉపకారవేతనాలు విడుదల చేశామన్నారు. చిన్నాయిగూడెంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహానికి ప్రహారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పలేమని వచ్చినా టీడీపీకి ఇబ్బంది లేదని అన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిబంధనలను సడలించి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సబ్‌ప్లాన్ నిధులు నూరు శాతం నిధులు మంజూరు చేయాలని కోరారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల సమస్య అధికంగా ఉందని సబ్‌ప్లాన్ నిధుల నుంచి ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకట రమణ, పోలవరం ఏఎంసీ చైర్మన్ పాలేపల్లి రామారావు, టినర్సాపురం ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు, కొయ్యలగూడెం వైస్ ఎంపీపీ పారేపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దూసుకుపోతున్న వర్జీనియా మార్కెట్
ఆశాజనకంగా పొగాకు ధరలు కిలో సగటు ధర రూ.173 సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు దేవరపల్లి: వర్జీనియా పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉంది. అధికారులు, రైతులు ఊహకు అందని విధంగా పొగాకు ధరలు పలుకుతున్నాయి. దాదాపు నెల రోజులుగా మార్కెట్ పుంజుకుంది. సోమవారం జిల్లాలోని వేలం కేంద్రాల్లో కిలో గరిష్ట ధర రూ.190, సగటు ధర రూ.173.70 లభించింది. ఈ ఏడాది మార్చి 15న ప్రారంభమైన కొనుగోళ్లు జూలై వరకు మందకొడిగా జరిగాయి. గిట్టుబాటు ధర రాక రైతులు పంటను అమ్ముకోవడానికి ఆసక్తిచూపలేదు. రోజుకు 200కు మించి బేళ్లు వేలానికి రాకపోవడంతో అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. కొంతకాలం టేడర్లు కూడా సిండికేట్‌గా మారి ధర విషయంలో సీలింగ్ వి«ధించడంతో రైతులు వేలాన్ని నిలుపుదల చేశారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం ఆగస్టు నుంచి మార్కెట్లో ధర పెరుగుతూ వచింది. అప్పటి వరకు కొనుగోలుకు ముందుకు రాని కంపెనీలు కూడా వేలంలో పాల్గొన్నాయి. పొగాకు అమ్మేందుకు రైతులు ముందుకు వచ్చారు. రోజుకు 1000 నుంచి 1300 బేళ్ల వరకూ రైతులు తీసుకొచ్చారు. 14 నుంచి కొనుగోళ్లు పునఃప్రారంభం జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 201617 సంవత్సరానికి పొగాకు బోర్డు 41 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతిచ్చింది. బ్యారన్‌కు 30 క్వింటాళ్లకు మించి పండించడానికి అవకాశం లేదని పేర్కొంది. బ్యారన్ రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు కొందరు రైతులు అనుమతికి మించి విస్తీర్ణంలో పంట వేశారు. దీంతో అదనంగా సుమారు 3 మిలియన్ కిలోల వరకు పండినట్లు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేశారు. 36 మిలియన్ కిలోలు కొనుగోలు చేసిన అనంతరం ఈ నెల ఒకటో తేదీ నుంచి 13 వరకు నిలిపివేశారు. అదనపు పొగాకు కొనుగోలుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బ్యారన్‌కు 300 కిలోలు వరకు, కిలోకు రూ.2 కమీషన్, 7.5 శాతం రుసుంతో కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 14 నుంచి ఐదు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే మీడియం గ్రేడులకు తక్కువ ధర పలుకుతుందని రైతులు వాపోతున్నారు. లెమన్, ఆరంజ్ కలర్ పొగాకుకు మంచి ధర లభిస్తుందని రైతులు వివరించారు. వేలం కేంద్రాల్లో పరిస్థితి ఇది దేవరపల్లి వేలం కేంద్రంలో 6.8 మిలియన్ కిలోలు ఉత్పత్తికి అనుమతివ్వగా ఇప్పటికి 6.5 మిలియన్ కిలోలు విక్రయించారు. మరో 4 లక్షల కిలోల పొగాకు రైతుల వద్ద ఉంది. గోపాలపురం వేలం కేంద్రంలో 7.1 మిలియన్ కిలోలు ఉత్పత్తికి అనుమతి ఉండగా ఇప్పటికి 6.7 మిలియన్ కిలోలు విక్రయించారు. మరో 5 లక్షల కిలోలు రైతులు వద్ద ఉంది. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 1.5 మిలియన్ కిలోలు, జంగారెడ్డిగూడెం1, 2 వేలం కేంద్రాల్లో సుమారు మూడు మిలియన్ కిలోలు రైతుల వద్ద ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో ఈ నెల 25న కొనుగోళ్లు ముగుస్తుండగా, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల్లో అక్టోబర్ 15 వరకు కొనుగోళ్లు జరగనున్నట్లు సమాచారం. 25న పొగాకు వేలం ముగింపు ఈ నెల 25న దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ముగుస్తుంది. రెండు వేలం కేంద్రాల్లో సుమారు 9 లక్షల కిలోలు రైతులు అమ్ముకోవాల్సి ఉంది. కిలో సగటు ధర రూ.173.70 లభించింది. రోజుకు లక్ష కిలోలు వరకు పొగాకు వేలం జరుగుతోంది. ఎం.హనుమంతరావు, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి టి.తల్పసాయి, వేలం నిర్వహణాధికారి, గోపాలపురం -
పాపం పద్మ!
వీడని అత్తింటి వివక్ష పోరాడుతున్నా కనికరించని వైనం తల్లీబిడ్డలను పట్టించుకోని కుటుంబం దేవరపల్లి : అమ్మాయి పుట్టిందన్న సాకుతో భర్త, అత్తమామలు చూపుతున్న వివక్షపై పోరాడుతున్న ఆ తల్లికి మోక్షం కలగడం లేదు. పోలీసు కేసు నమోదై బాధితురాలికి మహిళా సంఘాలు, న్యాయస్థానం అండగా నిలిచినా ఆ కుటుంబం మాత్రం కనికరం చూపడం లేదు. మూడు రోజులుగా వర్షం పసిబిడ్డతో తడుస్తూ వారి ఇంటి ముందే ఎదురుచూస్తున్న ఆమెను చూసి గ్రామస్తులు చలించిపోయారు. శనివారం సర్పంచ్ సాయంతో ఆమె అత్తింటి తలుపు తెరిచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. అయితే తానకు, బిడ్డకు పోషణ ఎలా అని ఆ తల్లి రోదిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. ద్వారకాతిరుమల మండలంలోని మలసానికుంటలో ఆడబిడ్డ పుట్టిందని గురజాల పద్మను భర్త సత్యనారాయణ, అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులు పట్టించుకోకుండా అదే గ్రామంలోని తమ పొలంలోని ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. పద్మ అత్తింటి ముందు ఈనెల 5 నుంచి మౌనపోరాటం చేస్తుండగా 9న విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా న్యాయమూర్తి గంధం సునీత సైతం స్పందించడంతో ఈనెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్టేషన్లో భర్త, అత్తమామలపై కేసు నమోదైంది. పద్మకు మహిళా సమాఖ్య, దళిత హక్కుల పోరాట సమితి, మహిళా ఛైతన్య సమాఖ్య సంఘాలు అండగా నిలిచాయి. భర్త, అత్తమామలకు కౌన్సెలింగ్ నిర్వహించి ఆమెను వారికి అప్పగించారు. ఇంత జరిగినా అయితే అత్తింటి వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. మళ్లీ పద్మను ఇంటిబయటే వదిలేసి, వారంతా పొలంలోని ఇంటికి వెళ్లిపోయారు. పద్మ మాత్రం తన బిడ్డతో ఇంటి బయటే మౌనపోరాటం చేస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆరుబయట పసిపాపతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పద్మను చూసి చలించిన స్థానికులు గ్రామ సర్పంచ్ బత్తుల విజయశేఖర్‌కు విషయాన్ని తెలిపారు. దీంతో ఆయన, పలువురు పెద్దలు వారి ఇంటికి చేరుకుని, ఇంటి తలుపులు తెరచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. తనకు, బిడ్డకు న్యాయం చేయాలని పద్మ వేడుకుంటోంది. -
అమ్మాయి పుట్టడం నేరమా..!
పట్టించుకోని భర్త, అత్తమామలు అత్తింటి నుంచి బయటకు గెంటేసిన వైనం ఐదురోజులుగా ఇంటి బయటే ఉంటున్న మహిళ దేవరపల్లి: ’కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిలా పెంచాలిరా..’ అంటారు. అయితే ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా మహిళను, ఆమె బిడ్డను కనీసం చూడకపోగా అత్తింటికి వస్తే బయటకు నెట్టివేశారు. దీంతో ఐదు రోజులుగా తిండీ తిప్పలు, నిద్రాహారాలు మాని అత్తింటి గుమ్మంలోనే చంటిబిడ్డతో ఓ తల్లి న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఆడపిల్లను కనడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నిస్తోంది. బాధితురాలు కథనం ప్రకారం. తడికలపూడి మండలంలోని గొల్లగూడెంకు చెందిన పద్మకు, ద్వారకాతిరుమల మండలంలోని మలసానికుంటకు చెందిన గురజాల సత్యనారాయణతో 2015 జులై 5న వివాహమైంది. పద్మకు గతేడాది ఆగస్టు 28న ఆడపిల్ల పుట్టింది. ఏడాది గడుస్తున్నా తల్లీబిడ్డలను అత్తింటికి తీసుకువెళ్లేందుకు భర్త సత్యనారాయణ, అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులు రావడం లేదు. అదిగో, ఇదిగో అంటూ కాలం వెళ్లదీయడంతో పాటు సత్యనారాయణ కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. ఆడపిల్ల పుట్టిందన్న నెపంతో తమను వదిలేశారని భావించిన పద్మ బిడ్డను తీసుకుని ఈనెల 5న మలసానికుంటలో అత్తింటికి వచ్చింది. అయితే ఆమెను ఇంట్లోకి రాన్వికుండా భర్త, అత్తమామలు, భర్త అన్న కృష్ణ అడ్డుకుని బయటకు నెట్టేశారు. దీంతో ఇంటి గుమ్మం వద్దే బిడ్డతో కలిసి పద్మ భీష్మించింది. దీంతో అత్తింటి కుటుంబం అంతా ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో వారికున్న పొలంలోని పాకలో ఉంటున్నారు. భర్త సత్యనారాయణ గ్రామంలో ఉండటం లేదని బాధితురాలు చెబుతోంది. ఐదు రోజులుగా అత్తింటి వద్ద ఆరుబయట పద్మ చంటి పాపతో న్యాయం కోసం ఎదురుచూస్తోంది. విషయం తెలిసిన ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు బాధితురాలు పద్మతో మాట్లాడారు. తనకు కేసు వద్దని, కాపురం నిలబడేలా చూడాలని పద్మ ఆయన్ను కోరింది. కేసులు, కోర్టులకు వెళితే కాపురం చెడిపోతుందని ఆమె ఆందోళన చెందుతోంది. ఫిర్యాదు చేయకుంటే తాము ఎలా న్యాయం చేయగలమని, ముందు ఫిర్యాదు ఇవ్వమని ఎస్సై ఆమెకు సూచించారు. -
పెద్ద దిక్కు మౌన ముద్ర
ఒంగోలు : దేవరపల్లిలో భూ వివాదంలో సాక్షాత్తు జిల్లా రెవెన్యూ అధికారి, తహశీల్దార్ దళితుల భూముల స్వాధీనంలో కీలకపాత్ర పోషించారని దేవరపల్లె దళితులు నెత్తినోరు బాదుకున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రితో పాటు జిల్లాకు చెందిన ఎస్సీ కమిషన్ చైర్మన్ సైతం దేవరపల్లె విషయంలో ప్రభుత్వం, అధికారులు తప్పు చేశారని బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇది జిల్లా పాలనాధికారికి మచ్చ తెచ్చే విషయమే అయినా మౌనముద్ర వీడలేదు. ఈ అంశం ఒకటే కాదు జిల్లాలోని ఇతర ప్రధాన సమస్యలపైనా ఆయన స్పందన అంతంత మాత్రమేనన్న ప్రచారం ఉంది. ►రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థుల కోర్సు పూర్తయి చాలా కాలం అయింది. కళాశాలకు ఎంసీఐ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు నెత్తినోరు బాదుకున్నారు. ప్రజాప్రతినిధుల గడప తొక్కి విన్నవించారు. ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాత్రమే స్పందించి వారి సమస్యను కేంద్రం దృష్టికి తెచ్చారు. సకాలంలో ఎంసీఐ రాకపోవడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు జిల్లా కలెక్టర్ బంగ్లాను ముట్టడించారు. వైద్య విద్యార్థులకు బాసటగా నిలిచి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన పాలనాధికారి ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ► రైతుల సమస్యలపైనా ఆయన స్పందించింది లేదు. సుబాబుల్, జామాయిల్ కర్రకు గిట్టుబాటు ధర లేక రైతులు నిత్యం ఆందోళనలకు దిగుతున్నారు. సుజాతశర్మ కలెక్టర్‌గా ఉన్న సమయంలో రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, మంత్రి శిద్దా రాఘవరావుతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. రైతులకు న్యాయం చేసేందుకు చొరవ చూపారు. కానీ కలెక్టర్ వినయ్‌చంద్ ఆ స్థాయి చొరవ చూపించ లేకున్నారు. ► జిల్లాలో తాగునీటి సమస్య పతాకస్థాయికి చేరింది. గతంలో వదిలిన సాగర్ జలాలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుతం జిల్లాకు సాగర్ జలాలను తీసుకురావాల్సి ఉంది. మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు పెట్టి నీటి విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ కలెక్టర్ అందుకు పెద్దగా స్పందించినట్లు కనిపించటం లేదు. ► ఈ–ఆఫీస్ పైన కలెక్టర్ పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కానరావడం లేదు. ఈ–ఆఫీస్ వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. జిల్లాలో ఆ ప్రయత్నం వేగం పుంజుకోలేదు. గత కలెక్టర్ హయాంలో ఈ–ఆఫీస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండింది. నేడు జిల్లా 5వ స్థానానికి పడిపోయింది. ►గ్రీవెన్స్ డే వినతుల పరిష్కారానికి కలెక్టరేట్లో పెద్దగా కసరత్తు జరగడం లేదు. ప్రజాలిచ్చిన వినతులు ఎంత మేర పరిష్కారమయ్యాయన్న విషయంపై వారం వారం రివ్యూ సమావేశాలు నిర్వహిస్తే అధికారులు త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉండేది. కానీ కలెక్టర్ ఈ విషయంలో మొక్కుబడి సమావేశాలకు పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ► నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి తీసుకోవాలన్న అధికార పార్టీ నేత ప్రయత్నాలను ఇరిగేషన్ ఎస్ఈ అడ్డుకున్నా జిల్లా పాలనాధికారి స్పందించినట్లు కనిపించలేదు. విలువైన ప్రభుత్వ స్థలాలు పార్టీ కార్యాలయాలకు అప్పగిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేకుండాపోయే ప్రమాదం ఉంది. అధికార పార్టీ నేత పట్టుపట్టి ఇరిగేషన్ ఎస్ఈని బదిలీ చేయించారు. అధికార పార్టీ నేత జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయిస్తే ప్రధాన అధికారి పట్టించుకోకపోతే మిగిలిన అధికారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు వాపోతున్నారు. ►జిల్లాలో అభివృద్ధి పనుల టెండర్ల వ్యవహారం రచ్చకెక్కింది. పేరుకు ఈ–టెండర్లు అయినా అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు. కొందరు అధికారులు వాటాలు తీసుకొని పనులను అబౌ రేట్లకు కేటాయించి ప్రజాధనానికి గండి కొడుతున్నారు. వెలిగొండ, గుండ్లకమ్మ పునరావాస పనుల టెండర్లలో ఇదే జరిగింది. ►కార్పొరేషన్ టెండర్ల వ్యవహారం ఇంతకు మించి అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. వేరే కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా అధికారులే అడ్డుకుంటున్నారు. ఇష్టానుసారంగా అబౌ రేట్లకు పనులు అప్పగిస్తున్నారు. జిల్లా పాలనాధికారి ప్రత్యేకాధికారిగా ఉన్నా.. ఇక్కడి అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధికార పార్టీ ఒత్తిడులతో జిల్లాలో కొందరు కింది స్థాయి అధికారులు ఇబ్బందులు పడుతుండగా వారికి పెద్ద దిక్కుగా భరోసా కల్పించాల్సిన పాలనాధికారి మౌనంగా ఉన్నారని, కొందరు అధికారులు పార్టీ నేతల అండ చూసుకొని చెలరేగిపోతున్నా వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని అధికార వర్గాలే విమర్శిస్తుండటం గమనార్హం. -
‘గో’ మాఫియా
ఎట్టకేలకు పోలీసుల్లో కదలిక ’గోమాఫియాపై దృష్టి ఆవుల మృతితో కళ్లుతెరిచిన వైనం గోసంరక్షణ సమితిపై కేసు దర్యాప్తు ప్రారంభం చిత్రహింసలు పెట్టారని సమితి నిర్వాహకుని ఆవేదన సాక్షి ప్రతినిధి, ఏలూరు, దేవరపల్లి : అక్రమంగా తరలి వెళ్తున్న గోవులు అత్యంత హృదయవిదారక పరిస్థితిలో మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు పోలీసులు నిద్రమత్తు వీడారు. గో మాఫియాపై దృష్టి పెట్టారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తూ చెరేగిపోతున్న మాఫియా ఆగడాలపై రెండు నెలల క్రితమే ’సాక్షి’ కథనం ఇచ్చింది. ఈ మాఫియాకు రాష్ట్రంలోని అధికార పార్టీలోని కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలూ సహకరిస్తున్న విషయాన్ని బయటపెట్టింది. అయినా స్పందించని పోలీసులు తాజా ఘటనతో కళ్లుతెరిచారు. తమదాకా వచ్చేసరికి... బుధ, గురువారాల్లో అక్రమంగా తరలిపోతున్న గోవులను పోలీసులు పట్టుకున్నారు. వీటిల్లో 40 వరకూ మృత్యువాత పడటంతో ఆ శాఖలో కదలిక వచ్చింది.. 72 గోవులతో వెళుతున్న కంటెయినర్‌ను బుధవారం మ«ధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద త్యాజంపూడికి చెందిన గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నల్లజర్ల మండలం ఆవపాడు వద్ద గల గోసంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాసుకు సమాచారం వచ్చారు. అతను తమవద్ద ఖాళీ లేదని.. దేవరపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కంటెయినర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి రాత్రి 9 గంటల సమయంలో కాకినాడ ప్రభుత్వ గోసంరక్షణ సమితికి పంపించారు. అప్పటికే కంటెయినర్లో ఉన్న 30 గోవులు మృతి చెందినప్పటికీ దానిని కాకినాడ పంపించారు. అక్కడ నిర్వాహకులు గోవులను దించుకోవడానికి నిరాకరించారు. అక్కడి నుంచి గురువారం ఉదయం కంటెయినర్‌ను దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో మళ్లీ ఆవపాడు వద్ద గల గోసంరక్షణ సమితికి పంపించారు. అయితే మృతి చెందిన గోవులను దించుకోవడానికి నిర్వాహకుడు శ్రీనివాస్ నిరాకరించాడు. బతికున్న వాటిని మాత్రమే తీసుకున్నాడు. మృతి చెందిన గోవులను లారీ డ్రెవర్ నల్లజర్లతాడేపల్లిగూడెం రోడ్డులో రోడ్డు పక్కన దింపుతుండగా.. పరిసర ప్రజలు అడ్డుకున్నారు. రాత్రి 11 గంటల సయంలో మృతి చెందిన 32 గోవుల కళేబరాలను దేవరపల్లి, నల్లజర్ల ఎస్సైలు కంటెయినర్‌తో తీసుకువచ్చి యర్నగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టున గొయ్యితీసి పాతిపెట్టారు. మిగిలిన వాటిని గోసంరక్షణ సమితికి అప్పగించారు. చిత్రహింసలు పెట్టారు. ఇదిలా ఉంటే గోవులను దించుకోవడానికి నిరాకరించడంతోపాటు కంటెయినర్ డ్రైవర్‌ను డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలతో గోసంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాస్, సహాయకుడు రాఘవేంద్రరావును దేవరపల్లి ఎస్సై వాసు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ముందుగా నల్లజర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అక్కడ శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన అనంతరం రాత్రి 12 గంటల సమయంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి దారుణంగా కొట్టినట్టు శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు. పోలీసులు బాగా కొట్టడంతో అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు. మంత్రుల దృష్టికి వివాదం పోలీసుల చిత్రహింసలపై నిర్వాహకుడు హోంమంత్రి చినరాజప్ప, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రుల జోక్యంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గతంలో జిల్లాలోని ఏయే పోలీస్ స్టేషన్ల పరిధిలో గోవులను స్వాధీనం చేసుకున్నారు. ఆవపాడు గోసంరక్షణ సమితికి ఎన్ని గోవులను అప్పగించారు అనే దానిపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అప్పగించిన గోవులన్నీ సమితిలో ఉన్నాయా, లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. గో సంరక్షణ సమితి వెనుక మాఫియా! : ఎస్సై గోసంరక్షణ సమితి నిర్వాహకుడిపై వచ్చిన ఫిర్యాదులపై శ్రీనివాసు, మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్టు దేవరపల్లి ఎస్సై పి.వాసు తెలిపారు. కేసు నుంచి బయటపడడానికి తాము కొట్టినట్టు శ్రీనివాస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, కొట్టడం వాస్తవం కాదన్నారు. కంటెయినర్ దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే టప్పటికే 30 గోవులు మృతి చెందినట్టు ఆయన తెలిపారు. గోసంరక్షణ సమితి వెనుక పెద్ద మాఫియా ఉందని వివరించారు. విచారణ తర్వాత వివరాలను చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఒడిశా నుంచి రవాణా ఒడిశా, శ్రీకాకుళం నుంచి, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రతిఏటా వేలాది పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కే కాక, బంగ్లాదేశ్‌కూ పశువుల రవాణా యథేచ్ఛగా జరుగుతోందని సమాచారం. దీనికి పశ్చిమ గోదావరి జిల్లా అడ్డాగా మారింది. జిల్లాలో పదుల సంఖ్యలో దళారులు తయారై పశువుల రవాణా చేస్తున్న వాహనాలను సరిహద్దు దాటించడం పనిగా పెట్టుకున్నారు. వివిధ జిల్లాల నుంచి పశువులను ఆయా మార్కెట్లలో కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా కంటెయినర్లలో పశువులను సామర్థ్యానికి మించి లోడ్ చేసి పైన్ టార్పాలిన్ కప్పి అనుమానం రాకుండా రవాణా చేసేస్తున్నారు. ఈ విషయాలను రెండు నెలల క్రితమే సాక్షి వెలుగులోకి తీసుకువచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు తమదాకా వచ్చే సరికి హైరానా పడుతున్నారు. -
దళితనేతలను పరామర్శించిన YSRCP నేతలు
-
రాజ్‌నాథ్‌కు ‘దేవరపల్లి’ ఘటనపై ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా దేవరపల్లి గ్రామంలోని దళితుల భూముల్లో ప్రభుత్వం అక్రమాలపై ఆయన ఈ సందర్భంగా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి ...ఎస్సీ కమిషన్ చైర్మన్ కఠారియాను కలిశారు. దేవరపల్లిలోని దళితులు సాగు చేసుకుంటున్న భూములపై ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. దళితుల భూములకు రక్షణ కల్పించి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని కఠారియాకు విజ్ఞప్తి చేశారు. దళితులు, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా భూములు లాక్కోవడం అన్యాయమని, వందల సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి, దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే దళితుల భూములకు రక్షణ కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. కాగా ప్రకాశం జిల్లాలో పర్చూరు మండలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా వివాదస్పద భూముల్లో చెరువు తవ్వుతుండటంతో దళితులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసుల సిబ్బంది పహారా మధ్య ప్రొక్లెయిన్లతో చెరువును తవ్వుతున్నారు. దీనిపై గ్రామస్తులు తీవ్ర నిరసన తెలిపారు. -
పోలీసు పహారాలో దేవరపల్లి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో పర్చూరు మండలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా వివాదస్పద భూముల్లో చెరువు తవ్వుతుండటంతో దళితులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసుల సిబ్బంది పహారా మధ్య ప్రొక్లెయిన్లతో చెరువును తవ్వుతున్నారు. తమపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోందని దళితులు వాపోయారు. 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని ఎక్కడకు తీసుకెళ్లారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నామని తమ గోడును ‘సాక్షి’ టీవీ ప్రతినిధితో వెళ్లబోసుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెత్తందారులందరూ ఒక్కటై తమకు ప్రత్యామ్నాయం చూపకుండా చెరువు తవ్వుతున్నారని తెలిపారు. ఎందుకు తవ్వుతున్నారని అడిగితే పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయమని అడిగితే ఉన్నతాధికారులు స్పందించలేదని వాపోయారు. తమకు ఎవరూ మాకు సాయం చేయలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు దేవరపల్లిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. గ్రామంలో చెక్‌పోస్టులు పెట్టారు. మీడియా ప్రతినిధులను గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో టీవీ ప్రసారాలు కూడా నిలిపివేశారు. దళితులంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపేనని, వారి భూములు లాక్కోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్ విమర్శించారు. దళితులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. దేవరపల్లిలో ఆంక్షలు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
దేవరపల్లి దళిత భూముల్లో పోలిస్ పహారా
-
ప్రియురాలి పెళ్లి అని తెలిసి యువకుడు..
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో ఆ ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని గుండుగొలనుకుంటలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న తరుణంలో యువతికి వేరొకరితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి వివాహం జరగనుండటంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పాలు తెస్తానని తన పొలానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు పొలానికి వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే దీనిపై ఎటువంటి పోలీస్ కేసు నమోదు కాలేదు. -
ఇంటి సరిహద్దు సమస్య ..చంపేసింది
(దేవరపల్లి)తూర్పుగోదావరి: ఇంటి సరిహద్దు సమస్య నిండు ప్రాణాన్ని బలిగొంది. మండలంలోని కురుకూరు దళితవాడలో రెండు కుటుంబాల మధ్య ఇంటి సరిహద్దు సమస్య గత కొంత కాలంగా జరుగుతోంది. పత్తిపాటి శ్రీను(53), యంగల సత్యనారాయణ పక్కపక్క ఇళ్లు కలిగి ఉన్నారు. రెండు ఇళ్లు మధ్య సరిహద్దు వివాదం జరుగుతోంది. వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. కొవ్వూరు సీఐ ఎం. సుబ్బారావు వివరాల ప్రకారం పత్తిపాటి శ్రీను, యంగల సత్యనారాయణ గత రెండు సంవత్సరాలుగా ఇంటి సరిహద్దు విషయంలో గొడవలు పడుతున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయాక ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీనితో సత్యనారాయణ కత్తితో శ్రీనుపై దాడిచేసి మెడపై బలంగా నరికాడు. మెడ భాగంపై బలమైన గాయం కావడంతో శ్రీను అక్కడక్కడే మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సీఐ ఎం. సుబ్బారావు, ఎస్సై పి. వాసు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పెళ్లికి ‘పెద్ద’ కష్టం...
వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న పెళ్లి కుమార్తె ‘రూ.2.5 లక్షల’పై ఎలాంటి ఆదేశాలు లేవని బ్యాంకు స్పష్టీకరణ దేవరాపల్లి: సందడిగా ఉండాల్సిన పెళ్లి ఇంట్లో పెద్ద నోట్ల రద్దుతో బిక్కచచ్చిపోతున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన రొంగలి నారాయణమూర్తి, అచ్చియ్యమ్మ దంపతులు తమ కుమార్తె రొంగలి రాముకు డిసెంబర్ 21న వివాహం నిశ్చయించారు. బ్యాంకులో ఉన్న తమ రూ. 1.80 లక్షల డబ్బును తీసుకునేందుకు వారు వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. పెళ్లి పనులను శుక్రవారం నుంచి చేపట్టాలని పురోహితులు నిర్ణయించడంతో వారు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. గురువారం పెళ్లి కుమార్తె స్వయంగా వెళ్లి వేడుకున్నా వారానికి రూ.24 వేలే ఇవ్వగలమని అధికారులు చెప్పారు. అదైనా తీసుకుందామంటే గురువారం సాయంత్రం వరకు బ్యాంక్‌కు నగదే రాలేదు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పెళ్లిళ్లు ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు తీసుకునే వీలు కల్పించినా బ్యాంక్‌లు నిరాకరించడం అన్యాయమని వాపోయింది. ఈ విషయమై దేవరాపల్లి యూకో బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. పెళ్లిళ్ల వారికి నగదు డ్రాలో వెసులుబాటు కల్పిస్తున్నట్లు తమకు ఆదేశాలు రాలేదన్నారు. -
దేవరపల్లిలో 40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
దేవరపల్లి : కామవరపుకోట మండలం జలపావారిగూడెం నుంచి దేవరపల్లి రైస్ మిల్లుకు రవాణా అవుతున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకుని పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించారు. ఉదయం 8 గంటలకు ట్రక్ ఆటోలో బియ్యం రవాణా అవుతున్నట్టు తెలుసుకున్న దేవరపల్లి ఎస్ఐ సి.హెచ్. ఆంజనేయులు ఆ ఆటోను అడ్డుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భీమవరం ఏజీపీవో శేషగిరి, జీపీఐ ప్రసాద్, దేవరపల్లి సీఎస్ డీటీ ఎస్.పోతురాజు ఆటోలోని బియ్యం బస్తాలను పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించారు. బియ్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేష¯ŒSకు తరలించారు. ఈ బియ్యాన్ని దేవరపల్లిలోని వరలక్ష్మి రైస్ మిల్లు యజమాని జలపావారిగూడెంలో కొని ఇక్కడికి తీసుకువస్తున్నట్టు గుర్తించారు. ఆ తరువాత వరలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ధాన్యం ఆడి బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉండగా, మిల్లు యజమాని ధాన్యం ఆడకుండా రేష¯ŒS బియ్యాన్ని కొని రీ సైక్లింగ్ చేస్తున్నట్టు కనుగొన్నారు. మిల్లు రికార్డుల నిర్వహణలో తేడాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రైస్‌మిల్లుపై 6 ఏ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
వడివడిగా వర్జీనియా నాట్లు
– జిల్లాలో 60 వేల ఎకరాల్లో సాగుకు శ్రీకారం – లాభసాటిగా నారు వ్యాపారం – ట్రే నారుకు మొగ్గుచూపుతున్న రైతులు దేవరపల్లి : మెట్ట ప్రాంతంలో వర్జీనియా పొగాకు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వారం రోజుల నుంచి నాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 10 నుంచి రైతులు పొగాకు నాట్లు ప్రారంభించినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఆలస్యం చేశారు. ప్రస్తుతం రైతులంతా పొలాల్లో ఉండి పొగాకు నాట్లు వేసే పనిలో పడ్డారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో దాదాపు 10 మండలాల్లో సుమారు 60 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో మాత్రమే వర్జీనియా పొగాకు పండుతుంది. ఉత్తర ప్రాంత తేలిక నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పండించే పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో పండించే పొగాకుకు ఇక్కడ పండించే పొగాకు పోటీ ఇస్తుంది. ప్రధాన వాణిజ్యపంటగా సాగు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పొగాకును సాగు చేస్తున్నారు. సుమారు 50 సంవత్సరాలుగా ఈ పంట సాగులో ఉంది. అంచలంచెలుగా పంట విస్తీర్ణం పెరిగింది. రైతులకు పొగాకు సాగు మొన్నటి వరకు లాభసాటిగా ఉండేది. రెండు సంవత్సరాలుగా పంటకు గిట్టుబాటు ధర పలకకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో సాగు విస్తీర్ణం తగ్గించారు. ఏటా సుమారు 12 వేల మంది రైతులు, సుమారు లక్షమంది కార్మికులు పొగాకు పంట ద్వారా ఉపాధి పొందుతున్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు పొగాకు నాట్లు వేస్తారు. జనవరిలో ఆకు రెలుపులు మొదలై మార్చి వరకు క్యూరింగ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరిలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై సెప్టెంబర్ వరకు జరుగుతాయి. ఈ–వేలం విధానంలో పొగాకు కొనుగోళ్లు నిర్వహిస్తారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల్లో రైతులు పండించిన పొగాకును అమ్మకాలు జరుపుతారు. పొగాకు సాగుకు బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నాయి. బ్యారన్‌కు (3.5 ఎకరాలు) రూ.5 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇచ్చిన రుణాలకు బోర్డు గ్యారంటీ ఇస్తుంది. అమ్మిన పొగాకు అమ్మకాల నుంచి రుణాలను బ్యాంకులు తీసుకుని మిగిలిన సొమ్మును రైతులకు చెల్లించడం జరుగుతుంది. ఏ పంటకు ఇవ్వని విధంగా బ్యాంకులు పొగాకుకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పొగాకు పంట ద్వారా ఏటా సుమారు రూ.6,000 కోట్లు ఆదాయం వస్తుంది. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో సుమారు రూ.900 కోట్ల వరకు పొగాకు విక్రయాలు జరుగుతాయి. లాభసాటిగా నారు వ్యాపారం పొగాకు నాట్లు ఊపందుకోవడంతో నారుకు గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం పొగాకు నారు వ్యాపారం లాభసాటిగా ఉంది. ఎకరానికి సరిపడిన నారు (6,500) మొక్కలు రూ. 3,000 నుంచి రూ. 3,500 ధర పలుకుతోంది. ట్రేలలో పెంచిన నారు రూ. 6,000 వరకు పలుకుతుంది. ట్రే నారు ధడంగా ఉండడంతో పాటు చీడపీడలను తట్టుకుని దిగుబడులు పెరగడంతో రైతులు ఎక్కువగా ట్రే నారుకు మొగ్గుచూపుతున్నారు. ఎకరానికి 100 ట్రేలు నారు పడుతుందని బోర్డు అధికారులు తెలిపారు. పొగాకు నర్సరీల్లోని నారును అధికారులు పరిశీలించి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దేవరపల్లి మండలం పలంట్లలో పొగాకు నారుమడులను వేలం నిర్వహణాధికారి వైవీ ప్రసాద్, బోర్డు సిబ్బంది పరిశీలించారు. గోపాలపురంలో వేసిన తోటలను వేలం నిర్వహణాధికారి టి.తల్పసాయి పరిశీలించారు. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటివరకు సుమారు 12,000 ఎకరాల్లో పొగాకు నాట్లు వేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు 80 శాతం నాట్లు పూర్తవుతాయని బోర్డు అధికారులు తెలిపారు. -
హత్యకేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
దేవరపల్లి : అత్త, భార్యను కత్తితో నరికి చంపిన కేసులో నిందితుడికి న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఎస్సై సీహెచ్ ఆంజనేయులు కథనం ప్రకారం.. 2013 జూన్ 22న దేవరపల్లిలో మానేపల్లి రవి తన భార్య పోశమ్మ, అత్త కల్లేపల్లి లక్ష్మిని కత్తితో నరికి చంపాడు. దీనిపై అప్పటి ఎస్సై ఎంవీ సుభాష్ కేసు నమోదు చేశారు. సీఐ ఎం.బాలకృష్ణ దర్యాప్తు చేశారు. వాదనల అనంతరం గురువారం నిందితుడు రవికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కొవ్వూరు తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి తీర్పుచెప్పారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా ఏడాదిపాటు కారాగార శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. అలాగే అత్త లక్ష్మిని చంపినందుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
వర్జీనియాకు వేళాయె..
–పొగాకు సాగుకు మెట్ట రైతుల సన్నద్ధం –పలు చోట్ల నాట్లు ప్రారంభం –ఈ నెల 20 నుంచి ఊపందుకోనున్న నాట్లు –నారుకు డిమాండ్ దేవరపల్లి : పొగాకు సాగుకు మెట్ట రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ వారం నుంచి అక్కడక్కడా నాట్లు వేయడం ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి పూర్తిస్థాయిలో నాట్లు ఊపందుకోనున్నాయి. నారు పెరిగినా వాతావరణంలో తరచూ మార్పులు చోటుచేసుకుంటుండడంతో రైతులు కాస్త వెనక్కుతగ్గుతున్నారు. భారీవర్షాలు, తుపానులు వస్తే కొట్టుకుపోతాయని ఆందోళన కారణంగా కొందరు రైతులు నాట్లను కావాలని ఆలస్యం చేస్తున్నారు. జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల పరిధిలో వాణì జ్య పంటగా రైతులు వర్జీనియాను సాగు చేస్తున్నారు. పొగాకు సాగుకు తేలికపాటి ఎర్ర నేలలు అనుకూలం కావడంతో మెట్ట ప్రాంతంలోని భూములు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దాదాపు 50 ఏళ్లుగా జిల్లాలో మెట్ట ప్రాంతంలోని 8 మండలాల్లో రైతులు సుమారు లక్ష ఎకరాల్లో పొగాకు పండించే వారు. గత రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ సంక్షో¿¶ ంలో ఉండడం, కేంద్ర ప్రభుత్వం పంటపై నిబంధనలు వి«ధించి సాగు విస్తీర్ణాన్ని తగ్గించడంతో రైతులు పొగాకు పంటను తగ్గించారు. 40 మిలియన్ కిలోలకు అనుమతి జిల్లాలో 2014 వరకు 60 నుంచి 62 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగే పొగాకును గత ఏడాది కేంద్ర ప్రభుత్వం 35 మిలియన్ కిలోలకు తగ్గించింది. బ్యారన్‌కు 2.5 ఎకరాల విస్తీర్ణంలో పండించడానికి అనుమతి ఇచ్చారు. అయితే రైతులు సుమారు 40 మిలియన్ కిలోల పొగాకు పండించారు. ఈ ఏడాది బ్యారన్‌కు 3.5 ఎకరాల విస్తీర్ణం రిజిస్ట్రేషన్ చేసి 40 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చారు. గతేడాది బ్యార్కు 25 కింటాళ్లు పండించి అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఇవ్వగా ఈ ఏడాది 30 క్వింటాళ్లకు పెంచారు. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 13,925 బ్యారన్లు ఉండగా సుమారు 49,000 ఎకరాల్లో పంటకు అనుమతి ఇచ్చారు. సుమారు 12,000 మంది రైతులు పొగాకు పంటను సాగు చేస్తున్నారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో 2276 బ్యారన్లు, గోపాలపురం వేలం కేంద్రం పరి«ధిలో 2380 బ్యారన్లు, కొయ్యలగూడెం వేలం కేంద్రం పరిధిలో 2941 బ్యారన్లు, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రం పరిధిలో 3154 బ్యారన్లు, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రం పరిధిలో 3174 బ్యారన్లు ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు జరిగాయి. నారుకు గిరాకీ పొగాకు నారుకు మంచి గిరాకీ ఏర్పడింది. జిల్లాలో సుమారు 1200 ఎకరాల్లో పొగాకు నారుమడులు వేశారు. ఎల్.వి–7, ఎన్ఎల్ఎస్–4 వంగడాలను ఎక్కువగా నారు వేశారు. పెద్ద రైతులు ట్రేలలో నారు పెంచి నాటడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు నారును మడి నుంచి తీసి ట్రేలలో రీసెట్టింగ్ చేస్తున్నారు. రీసెట్టింగ్ నారు ఎకరం నారు రూ.1500 ధర పలుకుంది. రీసెట్టింగ్ నారుకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నారుమడులు కట్టిన రైతులు లాభాలు పొందుతున్నారు. ట్రేలలో పెంచిన నారు ఎకరం (6,500 మొక్కలు) రూ.6,000 పలుకుతుండగా, మడిలో పెంచిన నారు రూ.3,000 నుంచి 3,500 ధర పలుకుతోంది. ఎకరం విస్తీర్ణంలోని నారుమడులను రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు రైతులు కొనుగోలు చేస్తున్నారు. దేవరపల్లి, పల్లంట్ల, బందపురం, లక్ష్మీపురం, యర్నగూడెం, సంగాయిగూడెం, చిన్నాయగూడెం గ్రామాల్లో నారుమడులు ఉన్నాయి. అనుమతికి మించి పంట వేయవద్దు బోర్డు అనుమతించిన విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంట సాగు చేయాలి. గతేడాది కంటే ఈ ఏడాది బోర్డు ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 5 మిలియన్ కిలోల పొగాకు అదనంగా పండించడానికి అనుమతి ఇచ్చింది. బ్యారన్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించడానికి రైతులు కృషిచేయాలి. – వైవీ ప్రసాద్, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి -
200 సినిమాల్లో నటించా
దేవరాపల్లి: టాలీవుడ్లో సుమారు 200 సినిమాల్లో ఇప్పటి వరకు నటించానని క్యారెక్టర్ ఆర్టిస్టు ఐనవోలు ప్రసన్నకుమార్ తెలిపారు. దేవరాపల్లి 21 శిరస్సుల భారీ మట్టి వినాయకుని నిమజ్జనమహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1972లో తొలుత ‘పరీక్షలు లేవు’ నాటకంలో రంగ స్థలంపై ఆరంగ్రేటం చేసి, ఏయూ థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది మొదటగా ‘జోగి జాతర ’ నాటకంలో గవర్నర్ ప్రశంసలు అందుకున్నానన్నారు. చిత్ర పరిశ్రమలో వెనుకకు తిరిగి చూడకుండా పలు చిత్రాలలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షలకు అభిమానాన్ని చూరగొని దగ్గరయ్యానన్నారు. -
మహిళా ఫుట్‌బాల్ జట్టు ఇదే!
దేవరపల్లి: రాష్ట్రస్థాయి మహిళా ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టును సోమవారం దేవరపల్లి మండలం పల్లంట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఎంపిక చేశారు. జిల్లా మహిళా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలెక్షన్స్ జరిగాయి. జిల్లా జట్టుకు పి.పద్మజ (దేవరపల్లి), సీహెచ్ సుభద్ర (కొయ్యలగూడెం), జి.నిర్మల (కుమారదేవం), జె.భూమిక (పల్లంట్ల), ఎం.నవ్య (పల్లంట్ల), పి.ఆర్తీ (కొయ్యలగూడెం), ఎ.లక్ష్మి(పల్లంట్ల), బి.శ్రుతి (కన్నాపురం), పి.చంద్రకళ (దేవరపల్లి), ఎం.నీరజ(దేవరపల్లి), ఎం.రమ్య (కొయ్యలగూడెం), కె.మాధవిలత (కొయ్యలగూడెం), జె.కల్యాణి (పల్లంట్ల), డి.వసంత (జంగారెడ్డిగూడెం), ఎ.సత్యవతి(పల్లంట్ల), ఎస్జే లక్ష్మి (దేవరపల్లి), డి.జీవనజ్యోతి (కొయ్యలగూడెం), ఈ.వెంకటలక్ష్మి (దేవరపల్లి), ఎం.రేవతి (దేవరపల్లి), సీహెచ్ గంగారత్నం (పల్లంట్ల) ఎంపికయ్యారని పీఈటీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తలపడుతుందన్నారు. -
కంటైనర్‌లో పశువుల రవాణా
దేవరపల్లి : తుని నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్లను గో సంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. తుని నుంచి రెండు కంటైనర్ వాహనాల్లో సుమారు 90 పశువులను హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు మండలంలోని యాదవోలుకు చెందిన గో సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సభ్యులు ఆదివారం సాయంత్రం దేవరపల్లి వద్ద రెండు కంటైనర్ వాహనాలను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై సీహెచ్ ఆంజనేయులు వాహనాల్లోని పశువులను పరిశీలించారు. గో సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులకు అరెస్ట్ చేశామని ఎస్సై ఆంజనేయులు చెప్పారు. -
కంటైనర్‌లో పశువుల రవాణా
దేవరపల్లి : తుని నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్లను గో సంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. తుని నుంచి రెండు కంటైనర్ వాహనాల్లో సుమారు 90 పశువులను హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు మండలంలోని యాదవోలుకు చెందిన గో సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సభ్యులు ఆదివారం సాయంత్రం దేవరపల్లి వద్ద రెండు కంటైనర్ వాహనాలను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై సీహెచ్ ఆంజనేయులు వాహనాల్లోని పశువులను పరిశీలించారు. గో సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులకు అరెస్ట్ చేశామని ఎస్సై ఆంజనేయులు చెప్పారు. -
6న క్రీడా ఎంపిక పోటీలు
దేవరపల్లి : ఈ నెల 6న ఇంటర్ కళాశాలల జోనల్ మీట్, జిల్లా క్రీడా కారుల ఎంపిక పోటీలు స్థానిక అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూలు క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు పీడీ కె.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు. దేవరపల్లి బీహెచ్ఎస్సార్ వీఎల్‌ఎం డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో అండర్–19 పురుషులు, మహిళల ఫుడ్‌బాల్, మహిళా క్రికెట్, సపక్‌తక్రా పోటీలు నిర్వహించి జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఉదయం 8 గంటలకు క్రీడాకారులు ఒరిజినల్ పదో తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచిం చారు. వివరాలకు సెల్ : 9052127200లో సంప్రదించాలని కోరారు. -
సినీఫక్కీలో గంజాయి పట్టివేత
దేవరపల్లి: విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.25 లక్షల విలువ గల 524 కిలోల గంజాయిని దేవరపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు రూ.4.17 లక్షల నగదు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఎస్సై ఆంజనేయులు, సిబ్బందిపై సదరు వ్యక్తులు కర్రతో దాడికి యత్నించగా ఎస్సై గాలికిలోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం రాత్రి పోలీస్‌స్టేçÙన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు వివరించారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు ఐషర్ వ్యాన్ సీక్రెట్ బాక్సులో 500 కిలోల గంజాయిని రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో దేవరపల్లి వద్ద గస్తీకాసి పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ వెనుక గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయగా కారులోని వ్యక్తులు ఎస్సై ఆంజనేయులు, సిబ్బం దిపై కర్రతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎస్సై ఆంజనేయులు గాలిలోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని కారును తనిఖీ చేయగా 24 కిలోల గంజాయి, రూ. 4.17 లక్షల నగదు ఉన్నాయి. నిందితుల నుంచి గంజాయి, నగదు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. ఇద్దరు పాత నేరస్తులు వరంగల్ జిల్లా ఓబులాపురానికి చెందిన బో నోతు యాకోబ్, విశాఖ జిల్లా జానకీరామ్పురానికి చెందిన అమ్మిరెడ్డి రమణ, ఓబులాపురానికి చెందిన బోనోతు సునీల్, రంగారెడ్డి జిల్లా చర్లపల్లికి చెందిన వ్యాన్ డ్రైవర్ కర్రి శ్రీశైలం, గుంటూరు జిల్లా హున్నాబాద్కు చెందిన తేజోవత్ సుకేందర్, కెతోవత్ శంఖర్ను అరెస్ట్ చేసినట్టు సీఐ సుబ్బారావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నిందితుడు అమ్మిరెడ్డి రమణపై విశాఖ జిల్లా కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో గతంలో నాలుగు గంజాయి కేసులు, ఆయుధాల సరఫరా కేసు నమోదయ్యాయన్నారు. రెండు ఫిస్టల్స్‌ను కూడా అక్కడ పోలీసులు రమణ నుంచి స్వాధీనం చేసుకుని రౌడీషీట్ ఓపెన్ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులకు చిక్కకుండా రమణ తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. బోనాల యాకోబ్‌పై కూడా రెండు గంజాయి రవాణా కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది నాగేశ్వరరావు, బాలా జీ, గంగరాజు, శ్రీనును సీఐ అభినందించారు. -
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
దేవరపల్లి : దేవరపల్లి–కొవ్వూరు రోడ్డులో దేవరపల్లి శివారున అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలోని పోలవరం కుడి కాలువ వంతెన వద్ద శనివారం రాత్రి సుమారు 45 ఏళ్ల వయసుగల ఓ గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలై రోడ్డుపై పడి ఉన్న అతడ్ని ఎస్సై సీహెచ్ ఆంజనేయులు 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతడు మృతిచెందాడు. మృతుని ఆచూకీ తెలియాల్సి ఉందని, మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచామని ఎస్సై తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
దేవరపల్లి : స్థానిక కరుటూరి ఫంక్షన్‌హాలు వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బందపురానికి చెందిన కాకరపర్తి వేములియ్య(60) కరుటూరి ఫంక్షన్ హాలులో ఆదివారం రాత్రి జరిగిన పెళ్లికి హాజరై సోమవారం తెల్లవారుజామున బయటకు వచ్చారు. రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో వేములియ్య అక్కడకక్కడే మృతి చెందాడు. -
కానుక ఇచ్చి.. రేషన్ ఎగ్గొట్టారు
దేవరపల్లి : జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. గురువారం ఉదయానికి ఈ పోస్ యంత్రాల్లో డేటాను అధికారులు పూర్తిగా తొలగించారు. ఉదయం రేషన్ దుకాణాలు తెరిచిన డీలర్లు సరుకులు పంపిణీ చేసేందుకు సమాయత్తం కాగా, యంత్రాల్లో కార్డుదారుల వివరాలు, సరుకుల వివరాలు క నిపించలేదు. ‘సరుకుల పంపిణీ నిలుపుదల చేయబడింది. వివరాలకు జిల్లా పౌర సరఫరాల అధికారిని సంప్రదించండి’ అని ఈ పోస్ యంత్రాల్లో కనిపించడంతో కంగుతినడం డీలర్ల వంతయ్యింది. విషయాన్ని మండల, జిల్లా అధికారుల దృష్టికి డీలర్లు తీసుకెళ్లగా.. తాము చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేశారు. ఫలితంగా సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా ప్రయోజనం లేకపోయింది. జిల్లాలో 11 లక్షల 25 వేల పాత కార్డుదారులు ఉండగా, 25 శాతం సరుకులు పంపిణీకి నోచుకోలేదు. కొన్ని మండలాల్లో 60 శాతం మంది కార్డుదారులకు మాత్రమే సరుకులు పంపిణీ అయ్యాయి. డీలర్ల నుంచి అందిన సమాచారం ప్రకా రం కనీసం 2.81 లక్షల కార్డుదారులకు సరుకుల సరఫరా నిలిచిపోయింది. 25వ తేదీ వరకు గడువున్నా.. : ఈ నెలలో రేషన్ డిపోలకు గోదాముల నుంచి సకాలంలో సరుకులు అందలేదు. 10వ తేదీ వరకు బియ్యం, పంచదార డిపోలకు సరఫరా చేస్తూ వచ్చారు. 7వ తేదీ నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేయాలని ఆదేశించటంతో డీలర్లు 13 వరకు ఆ పనిలో నిమగ్న మయ్యారు. ఈనెల 14న బియ్యం, పంచదార, కిరోసిన్ పంపిణీ ప్రారంభించారు. 15, 16 తేదీలు సంక్రాంతి సెలవులు కావటంతో సరుకుల పంపిణీ జరగలేదు. 17వ తేదీ నుంచి బియ్యం, పంచదార, కిరోసిన్ పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకుల పంపిణీకి 25వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ, గురువారం నుంచి ఈ పోస్ యంత్రాల్లో డేటాను తొలగించడంతో సరుకులు ఉన్నా కార్డుదారులకు పంపిణీ చేయలేని పరిస్థితి తలెత్తింది. ఈ నెలకు సంబంధించిన సరుకుల పంపిణీ నిలిచిపోయినట్టేనని అధికారులు చెప్పడంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. మరో 5 రోజులు గడువున్నా, ముందుగానే ఈ పోస్ యంత్రాల్లో సమాచారాన్ని నిలుపుదల చేయడమేమిటని కార్డుదారులు నిలదీస్తున్నారు. డీలర్ల నిల్వలున్నా.. : జిల్లాలో ఇంకా 25 శాతానికి పైగా కార్డుదారులకు బియ్యం, పంచదార, కిరోసిన్ వంటి సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రేషన్ డీలర్ల వద్ద సరుకులు నిల్వ ఉన్నాయి. అయినా, కార్డుదారులకు పంపిణీ చేయలేని దుస్థితి తలెత్తింది. ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులపైనే ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల వారికి అవి అందకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. చంద్రన్న సంక్రాంతి పేరిట కానుకలు ఇచ్చి రేషన్ ఎగ్గొట్టారని విమర్శిస్తున్నారు. వినియోగదారులకు పూర్తి స్థాయిలో సరుకులు పంపిణీ కాకపోవటంతో రేషన్ డిపోల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. మిగిలిపోయిన సరుకుల ఆధారంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయాల్సిన సరుకుల్లో తగ్గించి అలాట్మెంట్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో సరుకులు ఇచ్చే అవకాశం లేదంటున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. రేషన్ సరుకుల కోసం వారం రోజులుగా తిరుగుతున్నాను. మెషిన్లు పనిచేయడం లేదని ఇవ్వలేదు. పండగకు కానుకలు ఇచ్చినప్పుడు బియ్యం, పంచదార ఇవ్వలేదు. కానుకలు ఇచ్చి బియ్యం, పంచదార ఇవ్వకపోతే మేం ఏం తినాలి. - మస్తాన్‌బీ, గోపాలపురం ఎలా బతకాలి బియ్యం. పంచదార ఇవ్వకపోతే నెల రోజులు ఎలా బతకాలి. నాలుగు రోజులుగా సరుకుల కోసం తిరుగుతున్నాను. మెషిన్లు పనిచేయటం లేదని సరుకులు ఇవ్వలేదు. ఇప్పుడు వస్తే సరుకుల పంపిణీ మెషిన్లో ఆగిపోయిందని చెబుతున్నారు. సరుకులు ఇవ్వకపోతే పస్తు ఉండాల్సిందే. - కె. లక్ష్మమ్మ, గోపాలపురం -
100 కిలోల గంజాయి పట్టివేత
దేవరాపల్లి: విశాఖ జిల్లా పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం దేవరాపల్లి ఎస్సై అప్పన్న ఆధ్వర్యంలో పోలీసులు అనంతగిరి మండలం కివర్ల గ్రామం నుంచి వస్తున్న కారులో సోదాలు జరిపారు. అందులో తనిఖీ చేయగా బస్తాల్లో ఉన్న వందకిలోల గంజాయి పట్టు బడింది. ఇందుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. -
అపహరణకు గురైన దివ్య దారుణ హత్య
-
అపహరణకు గురైన దివ్య దారుణ హత్య
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో అదృశ్యమైన చిన్నారి దివ్య (7) దారుణ హత్యకు గురైంది. దివ్యకు మేనమామ వరుసయ్యే శేఖర్ అనే వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... దేవరాపల్లికి చెందిన వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులకు దివ్య, గణేష్ అనే పాప, బాబు ఉన్నారు. అయితే మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లిన దివ్య సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కుటుంబసభ్యులు, పరిచయస్తులు వద్ద వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దివ్యను మేనమామ వరుసయ్యే శేఖర్ రాళ్ల క్వారీవైపు తీసుకెళ్తుండగా తాము చూశామని స్థానికులు తెలిపారు. దాంతో పోలీసులు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతడు హత్య చేసినట్లు తన నేరాన్ని ఒప్పుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రైవాడ రిజర్వాయర్ వెనుక వైపు ముళ్లపొదల్లో దివ్య మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. స్థానిక ఉషోదయ కాన్వెంట్ లో దివ్య యూకేజీ చదువుతోంది. -
మావోయిస్టుల కదలికలపై నిఘా: చినరాజప్ప
దేవరపల్లి (పశ్చిమ గోదావరి) : రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో మావోల కదలికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. చోరీలు, దోపిడీల నియంత్రణకు పట్టణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతోపాటు నైట్ బీట్, హై క్లిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటి నుంచే నెట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. పోలీస్ వ్యవస్థలో ఆక్టోపస్‌ను విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇసుక సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయిందని, ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐదు లక్షల హెక్టార్లలో ఎర్రచందనం ఉందని, 90 శాతం అక్రమ రవాణాను నిలువరించగలిగామని చెప్పారు. ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నకిలీ కరెన్సీ చలామణీపై నిఘా పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. సమావేశంలో గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
వేగంగా తాడిపూడి మళ్లింపు పనులు
దేవరపల్లి:గోదావరి జలాలను కృష్ణాజిల్లాకు తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు. అధికారులు రేయింబవళ్లు కాలువ పనులు పర్యవేక్షిస్తున్నప్పటికీ అడ్డంకులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్యాయ ఏర్పాట్లను చేపట్టింది. ఆగస్టు 15 నాటికి ఏదేమైనా గోదావరి జలాలను కృష్ణాకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తోంది. గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద తాడిపూడి కాలువను పోలవరం కుడి కాలువకు అనుసంధానం చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు పంపుల వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోసి నీటిని గుడ్డిగూడెం వద్ద పోలవరం కాలువకు అనుసంధానం చేసి ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకువెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని కోసం గుడ్డిగూడెం 14.806 కిలోమీటరు వద్ద రూ.25లక్షల వ్యయంతో 7 పైపులు ఏర్పాటు చేసి పైపు కల్వర్టు నిర్మాణం చేస్తున్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి జలాలను ఎత్తిపోయటానికి ఎనిమిది పంపులు ఏర్పాటు చేశారు. అయితే తాడిపూడి కాలువ పనులు పూర్తికాకపోవటం, పంటకాలువలు ఏర్పాటు చేయకపోవటంతో మూడు పంపులను మాత్రమే ఉపయోగించి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. మిగిలిన ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి పోలవరం కాలువకు అనుసంధానం చేసి తాత్కాలికంగా కృష్ణా జిల్లాకు గోదావరి నీటిని తీసుకువెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోంది. దాదాపు కల్వర్టు పనులు పూర్తిగావచ్చాయి. దీనికి ఎగువ భాగంలో 1.5కిలోమీటర్ వద్ద పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసే నీటిని పోలవరం కాలువలో అనుసంధానం చేయడానికి భారీ పైపులతో కల్వర్టు ఏర్పాటు చేశారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు 24పంపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఈ నెల 15న మూడు పంపులను వినియోగంలోకి తీసుకువచ్చి నీటిని పోలవరం కుడి కాలువకు అనుసంధానం చేయనున్నారు. పట్టిసీమ వద్ద పంపులను ప్రారంభోత్సవం చేసిన అనంతరం సీఎం చంద్రబాబునాయుడు గుడ్డిగూడెం వద్ద ఏర్పాటు చేస్తున్న తాడిపూడి నీరు పోలవరం కుడికాలువకు అనుసంధానం చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. భూములు ఇక ఎడారులే తాడిపూడి నీరు పోలవరం కాలువకు అనుసంధానం జరిగితే దిగువ ప్రాంతంలోని ఆయకట్టు భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయకట్టు భూములలో వరినాట్లు ఎండిపోతుండగా ఉన్న నీటిని పోలవరంలోకి మళ్లిస్తే ఈ ప్రాంత రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేసినట్టవుతుందని రైతులు వాపోతున్నారు. 3 పంపుల ద్వారా తాడిపూడి వద్ద ఎత్తిపోస్తున్న నీరు ప్రవహించడానికి కాలువగట్లకు పలుచోట్ల గండ్లు పడుతుండగా 8పంపులు ఒకేసారి వినియోగంలోకి తీసుకువస్తే గట్లు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్టప్రాంత రైతాంగానికి ద్రోహం చేసే పనికి పూనుకున్నారని రైతులు విమర్శిస్తున్నారు. పట్టిసీమ నాలుగు పంపులతో పాటు తాడిపూడికి సంబంధించిన ఐదు పంపులను ఉపయోగించి 1800 క్యూసెక్కుల నీటిని తాడిపూడి కాలువ ద్వారా పోలవరానికి మళ్లించి కృష్ణాకు తీసుకువె ళ్లటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తాడిపూడి కాలువ ద్వారా సుమారు 2.06 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయవలసి ఉండగా 60 నుంచి 70 వేల ఎకరాలకే సరఫరా చేస్తున్నారు. అన్ని పంపులను వినియోగించి తాడిపూడి ఆయకట్టు భూములకు నీరు సరఫరా చేయకుండా పోలవరానికి అనుసంధానం చేయటంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వం మెడలు వంచైనా న్యాయం చేస్తాం
దేవరపల్లి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా న్యాయం చేస్తామని చెప్పారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడకు వచ్చారన్నారు. ఎన్నికల ముందు పొగాకు రైతుల రుణాలు రూ.600 కోట్లు మాఫీ చేస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు ఆరు పైసలు కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ మోసపూరితమైన హమీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించమని రైతులు చంద్రబాబును కలిసి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. మండల పార్టీ కన్వీనర్ గడా జగదీష్ మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబునాయుడు నిలువునా ముంచారన్నారు. రైతు సంఘం ప్రతినిధి చవల సూర్యచంద్రం మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుని 2005-06లో ధరను రూ.172కు పెంచారని గుర్తుచేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్.రాజేంద్రబాబు మాట్లాడుతూ గతేడాది జూలై 4 నాటికి 35 మిలియన్ కిలోల పొగాకు విక్రయూలు జరగ్గా ఈ ఏడాది 18 మిలియన్ కిలోలకే పరిమితమైపోరుుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ పరిస్థితి ఇలానే ఉందన్నారు. తీవ్ర సంక్షోభంలో రైతులు కొయ్యలగూడేనికి చెందిన రైతు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా పొగాకు సాగు చేస్తున్నానని, ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ చూడలేదన్నారు. జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలిసి శుక్రవారం మార్కెట్లో కిలోకు అదనంగా రూ.10, శనివారం మరో రూ.10 ధర పెరిగిందన్నారు. రైతు మధ్యాహ్నపు ఈశ్వరుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు పొగాకు ధర కిలో రూ.199 ఉండగా అనంతరం రూ.100కు పడిపోయిందన్నారు. సహకార రుణాలపై 6 శాతం రాయితీని ఎత్తివేసి సీఎం చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతు కోసం ఎందాకైనా
గిట్టుబాటు ధర దక్కక ఆందోళన బాటపట్టిన పొగాకు రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. ‘మీ కోసం ఎందాకైనా వస్తా.. రైతుల కష్టాలు, నష్టాలు తీర్చేందుకు దేనికైనా సిద్ధమే’నని ప్రకటించారు. కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కక.. పొగాకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక.. పాలకులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితుల్లో అల్లాడిపోతున్న రైతులకు వైఎస్ జగన్ పర్యటన స్థైర్యాన్నిచ్చింది. ‘ప్రభుత్వం మెడలు వంచైనా గిట్టుబాటు ధర తెచ్చుకునేందుకు పోరాడదాం.. పదో తేదీ నాటికి సర్కారు దిగిరావాలని అల్టిమేటం జారీ చేస్తున్నాం.. లేదంటే వేలం కేంద్రాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టి శంఖారావం మోగిద్దాం’ అని రైతుల హర్షధ్వానాల మధ్య వైఎస్ జగన్ ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు :పొగాకు రైతుల కష్టాలను తెలుసుకునేందుకు శనివారం మధ్యాహ్నం 12గంటల తర్వాత వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు కేంద్రానికి విచ్చేశారు. అప్పటికే అక్కడున్న వేలాది మంది రైతులకు అభివాదం చేసిన ఆయన పొగాకు బేళ్లను, కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు వేలం కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ రైతులు, కొనుగోలుదారులు, వేలం నిర్వహణ అధికారులతో ఆయన మాట్లాడారు. దేవరపల్లి గ్రామానికి చెందిన రైతు మాగంటి సాయిబాబు మాట్లాడుతూ గతేడాది ఇదే సమయానికి కిలో రూ.175 ఉన్న కిలో పొగాకు ధర ఈ ఏడాది రూ.130కి తగ్గిపోయిందని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గత ఏడాది జూలై నెల ప్రారంభానికి దాదాపు 50 మిలియన్ల కిలోల పొగాకును వివిధ కంపెనీలు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 17 మిలి యన్ కేజీలు మాత్రమే కొన్నాయని చెప్పారు. గత పరిస్థితికి ఇప్పటికి ఎందుకు తేడా వచ్చిందని ఐటీసీ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్‌ను వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇందుకు ఆయన వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం పొగాకు ఎగుమతులకు అనుమతులను నిలిపివేసిందని తెలిపారు. కంపెనీల నుంచి డిమాండ్ కూడా తగ్గిందని చెప్పారు. బ్యాంకర్లు ముష్టివాళ్లుగా చూస్తున్నారు : రైతు ఆవేదన వేలం కేంద్రం ప్రాంగణంలోనే వైఎస్ జగన్ తొలుత రైతులతో మాట్లాడించారు. మధ్యాహ్నపు ఏసు అనే రైతు మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో పొగా కు రైతులను బ్యాంకు అధికారులు ముష్టివాళ్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడవటి నాగేశ్వరరావు అనే రైతు మాట్లాడుతూ చంద్రబాబు పొగాకు కంపెనీల వద్ద కోట్లాది రూపాయల లంచాలు తీసుకుని పొగాకు రైతులను గాలికి వదిలేశారని విమర్శించారు. జగన్ రాకతో పాపప్రక్షాళన ఎన్నికల ప్రచారంలో భాగంగా పొగాకు బోర్డుకు చంద్రబాబు రావడంతో రైతులకు దరిద్రం పట్టుకుందని, వైఎస్ జగన్ అడుగుపెట్టడంతో ఇప్పుడు పాపప్రక్షాళన జరిగిందని రైతు కొడవటి నాగేశ్వరరావు ఆవేశంగా మాట్లాడగా, మిగిలిన రైతులు పెద్దపెట్టున చప్పట్లు కొట్టారు. ‘మీరు వస్తున్నారని తెలిసే రెండు రోజులుగా కేజీకి రూ.20 రేటు పెంచారు’ అని రైతులు చెప్పారు. సిగ్గు లేదా బాబూ..నిప్పులు చెరిగిన జగన్ రైతులు, వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పొగాకు రైతుల కోసం ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ) ద్వారా కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర రావడం లేదని చెబుతుంటే బాబు సిగ్గులేకుండా అది తన పరిధిలోనిది కాదని తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితమంతా బొంకటమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. పొగాకు రైతులకు ఎంతమందికి రుణమాఫీ జరిగిం దో చేతులెత్తాలని కోరగా, రైతులంతా తమలో ఎవరికీ రుణమాఫీ కాలేదని నినదించారు. పొగాకుకు గిట్టుబాటు ధరలపై 10వ తేదీలోపు సర్కారు దిగిరాకుంటే రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని జగన్ హెచ్చరించారు. అడుగడుగునా ఘన స్వాగతం శనివారం ఉదయం 10.05 గంటలకు తూర్పుగోదావరి జిల్లానుంచి కొవ్వూరు బ్రిడ్జి వద్దకు చేరుకున్న వైఎస్ జగన్‌కు జిల్లా నేతలు, కొవ్వూరు పట్టణ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉదయం 10.20 గంటలకు దొమ్మేరు చేరుకున్న జగన్ అల్లూరి సీతారామరాజు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు. దొమ్మేరులో సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) ఇంటికి వెళ్లి అల్పాహారం స్వీకరించారు. అక్కడి నుంచి దేవరపల్లి బయలుదేరారు. దారి పొడవునా గ్రామాల వద్ద తనకోసం వేచి ఉన్న ప్రజలను చూసి వాహనం ఆపి పలకరించి ముందుకు సాగారు. ఎడ్లబండిపై వెళ్లిన జగన్ మధ్యాహ్నం 12.20 గంటలకు దేవరపల్లి చేరుకుని అక్కడ ప్రధాన కూడలి నుంచి ఎడ్లబండిపై ప్రదర్శనగా పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. రైతులతో మాట్లాడిన అనంతరం నల్లజర్ల, భీమడోలు, ఏలూరు మీదుగా విజయవాడ వెళ్లారు. -
కూరగాయలకు C/o దేవరాపల్లి..
- వేలాది ఎకరాల్లో సాగు - రోజూ 40 టన్నులు ఎగుమతి - ఏటా రూ.కోట్లలో లావాదేవీలు దేవరాపల్లి: కాయగూరల సాగుకు దేవరాపల్లి పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది. వందలాది కుటుంబాలకు కూరగాయల పంటలే ఆధారం. హోల్ సేల్ వ్యాపారులు ఇక్కడికి నేరుగా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి జిల్లా నలుమూలలతోపాటు ఇతర జిల్లాలకు తరలిస్తుంటారు. సోమవారం మినహా రోజూ ఇక్కడ లావాదేవీలు సాగుతాయి. రైతులు పండించిన దొండ, బెండ, బీరకాయలు, ఆనబ, వంగ, కాకర,అరటి కాయలు, బరబాటి, టమాటా, పచ్చి మిరప, గోంగూర, తోటకూర, పాల కూర వంటివి స్వయంగా అమ్మకానికి తెస్తారు. దేవరాపల్లి మండలంతో సమీపంలోని అనంతగిరి మండలం, విజయగరం జిల్లాకు చెందిన వేపాడ మండలంలోని పలు గ్రామాల రైతులు ఇక్కడి మార్కెట్‌కు కూరగాయలు తీసుకువస్తారు. ఈ మండల రైతులు వరి, చెరకుకు దీటుగా కూరగాయల పంటలు చేపడతారు. సుమారు 8 వేలు ఎకరాల్లో చేపడుతున్నట్టు అధికారుల వివరాలే చెబుతున్నాయి. రోజూ సుమారు 30 నుంచి 40 టన్నుల వరకు కూరగాయలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, వ్యాన్లు, ఆటోల్లో తరలిస్తున్నారు. రోజూ రూ. లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. ఆది, మంగళవారాల్లో క్రయ విక్రయాలు ఎక్కువగా సాగుతాయి. ఏటా సుమారు రూ.3 కోట్లలో లావాదేవీలు సాగుతున్నట్టు అంచనా. ఇక్కడి మార్కెట్ ప్రదేశం మధ్యాహ్నం వరకు కూరగాయలు ఎగుమతి చేసే వాహనాలతో సందడిగా ఉంటుంది. -
విడుదలైన రుణమాఫీ రెండో జాబితా
దేవరపల్లి: రైతుల రుణమాఫీ కి సంబంధించిన రెండవ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాను ప్రభుత్వం ఆన్లైన్లో ఉంచింది. రుణవూఫీ జరగని రైతుల వివరాలను, కారణాలను రెండవ జాబితాలో పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు. రుణవూఫీకి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉండటం వల్ల రైతులు నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నెట్ సెంటర్లు ఉదయుం నుంచి రాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి. రుణవూఫీ జరిగిందా?లేదా?అని తెలుసుకోవాలంటే నెట్ సెంటర్లో రూ. 10, ప్రింట్ కావాలంటే రూ. 20 చెల్లించవలసి వస్తోందని రైతులు అంటున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్ సెంటర్లు, మీ-సేవ కేంద్రాల్లో సర్వర్లు సరిగా పనిచేయుకపోవటంతో ఇబ్బందులు తప్పటంలేదు. దేవరపల్లి వుండలంలో సువూరు 17,265 వుంది రైతులను అర్హులుగా గుర్తించి రెవెన్యూ అధికారులు బ్యాంకులకు జాబితాలను పంపారు. అరుుతే 5,665 వుందికి వూత్రమే రుణవూఫీ జరగటంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వూర్గదర్శకాలు బ్యాంకులకు చేరకపోవటంతో అధికారులు రైతులకు పూర్తిస్థాయి సవూచారం చెప్పలేకపోతున్నారు. రుణవూఫీ వూత్రమే జరిగిందని, రైతుల ఖాతాలకు సొవుు్మ జవు కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
కలెక్టర్ సుడిగాలి పర్యటన
దేవరాపల్లి పీహెచ్సీ తనిఖీ తహశీల్దార్ కార్యాలయంలో వినతుల స్వీకరణ రైవాడ జలాశయం పరిశీలన దేవరాపల్లి : మండల కేంద్రం దేవరాపల్లిలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆకస్మికంగా వచ్చిన ఆయన సుమారు మూడున్నర గంటలపాటు మండలంలో పర్యటించారు. తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్సీ సిబ్బంది పనితీరును ఎస్పీహెచ్వో శాంతిప్రభ, వైద్యాధికారి పి.బిందుమాధవిలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ప్రతి గదిని తనిఖీ చేశారు. ఓపీ చీట్లు, సిబ్బంది హాజరు పట్టిక, ల్యాబ్ టెక్నీషియన్ రూములో పరీక్షల రికార్డులను పరిశీలించారు. ల్యాబ్ టెక్నీషియన్ విధులకు హాజరైనప్పటికీ హాజరుపట్టికలో ఆమె సంతకం చేయకపోవడంతో కలెక్టర్ స్వయంగా ఆప్సంట్ మార్క్ చేశారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రోగుల వార్డును పరిశీలించి,అక్కడివారి బాగోగులు, వైద్యసేవల గురించి ఆరా తీశారు. అనంతరం కొత్తగా నిర్మించిన మండల మహిళా సమాఖ్య భవనం, హౌసింగ్ కార్యాలయాల భవనాలను పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో కొద్దిసేపు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అంబేద్కర్ కాలనీలో సనాసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న మినరల్ వాటర్‌ప్లాంట్, బయోమెట్రిక్ మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. అక్కడి సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. రైవాడ జలాశయాన్ని పరిశీలించిన ఆయన తెనుగుపూడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడి వసతులను, మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వసతి సమస్యను కళాశాల ప్రిన్సిపాల్ బి.సుధాకర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నిధులు దుర్వినియోగంపై విచారణకు డిమాండ్ : పీహెచ్సీ అభివృద్ధి నిధులు దుర్వినియోగమయ్యాయని,దీనిపై తక్షణం విచారణ చేపట్టాలని సీపీఎం నాయకుడు డి.వెంకన్న కలెక్టర్ యువరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నెలరోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వచ్చి నామమాత్రంగా విచారణ చేపట్టారన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆయన డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను కలెక్టర్‌కు అందజేశారు. అంతకుముందు పీహెచ్సీ వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కాకుండా వేరొకశాఖ అధికారులతో విచారణ చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట తహశీల్దార్ వై.ఎస్.వి.వి.ప్రసాద్, ఎంపీడీవో ఆర్.పూర్ణిమాదేవి ఉన్నారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోండి
దేవరపల్లి: స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ సూచించారు. దేవరపల్లి స్టేట్ బ్యాంకు ద్వారా డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాల మంజూరు పత్రాలను బుధవారం ఆయన మహిళలకు అందజేశారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బ్రాంచి చీఫ్ మేనేజర్ బి.శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 2019 నాటికి జిల్లాలోని ప్రతి డ్వాక్రా సంఘం కనీసం రూ.10 లక్షలు రుణం తీసుకోవాలని, దీనిద్వారా ప్రతి సంఘం రూ.లక్ష ఆదాయం పొందాలన్నారు. జిల్లాలోని ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇవ్వనున్నట్టు కలెక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక ఎస్బీఐ బ్రాంచిని జిల్లాలోని ఇతర బ్యాంకులు నాందిగా తీసుకుని రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. డీఆర్డీఏ పీడీ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.1,100 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రతి సంఘానికి రూ.లక్ష పొదుపు ఖాతాలో జమచేస్తుందన్నారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరుపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ కె.సుధారాణి. సర్పంచ్ సుంకర యామినినిసన్మానించారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ హేనా నళిని, చీఫ్ మేనేజర్ బి.వంకరరావు, ఎంపీపీ ఎస్వీ నరసింహరావు, తహసిల్దార్ ఎండీ అక్బర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు
దేవరపల్లి: రుణమాఫీ ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను, డ్వాక్రా మహిళలను నట్టేటముంచారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ గడా జగదీష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రుణమాఫీపై పొంతనలేని ప్రకటనలు చేస్తూ రైతులను, మహిళలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. టీడీపీ కర్యకర్తలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రౌడీయిజం చేస్తూ దాడులు చేస్తున్నారని తలారి ఆరోపించారు. టీడీపీ గూండాయిజం, రౌడీయిజాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మండల పార్టీ కన్వీనర్ గడా గదీష్ మాట్లాడుతూ గౌరీపట్నం పార్టీ నాయకుడు ఆండ్రు రమేష్‌బాబు టీడీపీ డబ్బుకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. మండలంలో 12 మంది ఎంపీటీసీలను ప్రజలు గెలిపించి ఎంపీపీ అధికారం కట్టబెట్టగా ధనబలంతో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను కొనుగోలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కేవీకే దర్గారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్.రాజేంద్రబాబు, మండల యూత్ కన్వీనర్ కొఠారు ధృవకాంత్, పార్టీ నేతలు పల్లి వెంకట రత్నారెడ్డి, కవల సుబ్బారావు, కె.వీరభద్రరావు, కాండ్రు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీని నమ్ముకుని..
దేవరపల్లి : రుణమాఫీ పథకాన్ని నమ్ముకున్న వర్జీనియా పొగాకు రైతులు నిండా మునిగిపోయారు. రుణమాఫీ పథకంతో తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయని భావించి పొగాకు ధర బాగున్నప్పుడు విక్రయించుకోలేకపోయారు. తీరా రుణమాఫీ పొగాకు రైతులకు లేదని ప్రభుత్వం ప్రకటించడంతో పొగాకు బేళ్లను విక్రయాలకు పెట్టినా ధర పతనం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. వర్జీనియా పొగాకు మార్కెట్ రైతులను తీవ్రంగా నిరాశపర్చింది. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా ధరలు పుంజుకోకపోవడంతో రైతులకు నష్టాలు తప్పలేదు. మూడు నెలలుగా పొగాకు మార్కెట్ సంక్షోభంలో నడుస్తోంది. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో సుమారు నెలరోజులు పొగాకు విక్రయాలను నెమ్మదిగా జరిపారు. సమయంలో పొగాకును విక్రయిస్తే వచ్చే మొత్తం బ్యాంకులకు జమైపోతుందని, రుణమాఫీ చేస్తే తమకు లభించేది ఏమీ ఉండదని రైతులు భావించి తమ పొగాకు బేళ్లను విక్రయానికి పెట్టలేదు. తీరా రుణమాఫీ పొగాకు రైతులకు వర్తించదని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు జూలై 15 నుంచి అమ్మకాలను వేగం పెంచారు. పొగాకు అమ్మకాలు ఊపందుకున్నప్పుడు మార్కెట్లో ధరలు పతనమవడం ప్రారంభమయ్యాయి. రుణమాఫీని నమ్ముకుని అన్ని విధాలుగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. పతనమైన ధరలు ఈ ఏడాది పొగాకు పండించిన రైతులకు కోలుకోని దెబ్బతగిలింది. జూన్‌లో కిలో గరిష్ట ధర రూ.177, సగటు ధర రూ.159 పలికింది. జూలైలో ఈ ధరలు పతనమయ్యాయి. గరిష్ట ధర రూ.154 నుంచి 168 మాత్రమే పలకగా సగటు ధర రూ.149 మాత్రమే నమోదైంది. ఆగస్టులో మార్కెట్ పూర్తిగా సంక్షోభంలో పడింది. ఎక్కువ కంపెనీలు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో ధర అంతంతమాత్రంగానే పలుకుతోంది. చిన్న కంపెనీలు కొనుగోళ్లకు పూర్తిగా దూరం అయ్యాయి. పెద్ద కంపెనీలైన ఐటీసీ, జీపీఐ మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. వీటికి పోటీలేకపోవడంతో వారు చెప్పిందే ధర అయ్యింది. శనివారం కిలో గరిష్ట ధర దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.166, కనిష్ట ధర రూ.10, సగటు ధర రూ.111.65 పలికింది. -
గ్యాస్ సిలిండర్లపై ‘నగరం’ దెబ్బ
దేవరపల్లి:వంటగ్యాస్ సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడి గ్యాస్ రిఫైనరీ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. సిలిండర్లలోకి గ్యాస్‌ను నింపే కేంద్రాలకు సరఫరా లేకపోవడంతో జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని గ్యాస్ ఏజెన్సీలకు తూర్పుగోదావరి జిల్లా గుమ్మందొడ్డి వద్ద గల రిఫైనరీ నుంచి గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రెండు జిల్లాల పరిధిలో సుమారు 50 గ్యాస్ ఏజెన్సీలు నిత్యం దాదాపు 30 వేల సిలిండర్లను ఇస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలో 21 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, రోజుకు సుమారు 12 వేల సిలిండర్లు అవసరం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఏజెన్సీలకు రోజుకు 600 సిలిండర్లు, పట్టణ ప్రాంతంలోని ఏజెన్సీలకు 900 సిలిండర్లు చొప్పున అవసరం ఉంటుంది. పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా నిలుపుదల చేయటంతో బుల్లెట్ (పెద్ద ట్యాం కర్ల) ద్వారా రిఫైనరీకి తీసుకువచ్చి ఏజెన్సీలకు సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా రోజుకు 9వేల సిలిం డర్లు మాత్రమే రావడంతో జిల్లా అవసరాలకు సరి పోవటం లేదు. రోజుకు 600 సిలిండర్లు అవసరమైన ఏజెన్సీలకు 300, పట్టణ ప్రాంతంలోని ఏజెన్సీలకు 600 సిలిండర్ల చొప్పున మాత్రమే వస్తున్నాయి. దీంతో కొరత ఏర్పడి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్లను ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి తెచ్చుకునేందుకు సొంత లారీలను వినియోగిస్తున్న ఏజెన్సీలలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ కంపెనీ లారీల ద్వారా తెచ్చుకునే ఏజెన్సీలకు సిలిండర్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెల కొంది. గ్యాస్ పైపులైన్ తనిఖీ పూర్తరుుతే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. -
ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలు అరెస్టు
దేవరపల్లి(ప.గో): దేవరపల్లి ఎంపీపీ పీఠానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో అధికారులపై దాడికి దిగిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలను ఎట్టకేలకు శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన అనంతరం రిమాండ్ కు తరలించారు. ఎలాగైనా ఆ మండలంలో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ ఘర్షణ వాతావరణాన్ని తిరిగి సృష్టించాలని యత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉద్రిక్తతలు సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేసిన ఆ పార్టీ నేతలు ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లోనూ శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. దేవరపల్లి మండల పరిషత్‌లో 22 ఎంపీటీసీ స్థానాలకుగాను 12 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన పెనుబోతుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీపీ పదవికి గన్నమని జనార్దనరావు పోటీకి దిగారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల్ని భయపెట్టో, ప్రలోభపెట్టో తమవైపు తిప్పుకొని ఎంపీపీ పదవి దక్కించుకోవాలని టీడీపీ పథకాలు రచిస్తోంది. -
ఎక్కండయ్యా బాబూ.. ఎక్కండి
దేవరపల్లి, న్యూస్‌లైన్ : ఎక్కండయ్యా బాబూ.. ఎక్కండయ్యా బండి.. ఎక్కండయ్యా.. అంటూ సమైక్యాంధ్ర పార్టీ నేతలు ప్రజలను బతిమాలుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నూతనంగా పెట్టిన సమైక్యాంధ్ర పార్టీ రాజమండ్రిలో బుధవారం నిర్వహించే సదస్సుకు ప్రజల తరలింపునకు ఆ పార్టీ నేతలు అష్టకష్టాలు పడ్డారు. గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 50 బస్సులను ఏర్పాటు చేశారు. సదస్సుకు వెళ్లడానికి ప్రజలు బస్సు ఎక్కేందుకు రాకపోవడంతో కనిపించిన వారిని బతిమిలాడి మొహమాటపెడుతూ బస్సులు ఎక్కించారు. అంతేకాక బస్సు ఎక్కిన వారికి రూ. 200 ఇస్తామని చెప్పడంతో కొంతమంది ఇష్టం లేకపోయినా డబ్బులు కోసం సదస్సుకు వెళ్లారు. ఒక్కొక్క బస్సులో పట్టుమని 10 మంది కూడా లేకపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్లాయి. సాయంత్రం ఆరు గంటల వరకూ బస్సులు వెళుతూనే ఉన్నాయి. -
‘ఆరోఖ్య’ ఆగ్రహం
గామీణులకు ప్రాణాధారమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, సేవలు సక్రమంగా కొనసాగాలని కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. దేవరాపల్లిమండలంలో సుడిగాలి పర్యటన జరిపిన ఆయన పీహెచ్‌సీని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది వ్యవహార శైలిపై ఆగ్రహించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించి పాఠశాలలను సైతం తనిఖీ చేశారు. బోధన సక్రమంగా సాగకపోవడంపై కన్నెర్ర చేశారు. దేవరాపల్లి, దేవరాపల్లి మండలంలో సుడిగాలి పర్యటన జరిపిన కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ముందు పీహెచ్‌సీని పరిశీలించారు. ఆస్పత్రిలో వివిధ విభాగాలను సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసి ప్రసూతి కేసులు తక్కువగా ఉండడంపై ప్రశ్నించారు. వైద్య సేవలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎందుకు తక్కువగా జరుగుతున్నాయని వైద్యాధికారి పి. పద్మజను ప్రశ్నించారు. గ్రామీణ మహిళలు ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రసూతి సేవలు పొందుతున్నారని ఆమె సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తంచేశారు. జననీ సుఖీభవ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెక్కుల పంపిణీలో జాప్యంపై సిబ్బందిని నిలదీశారు. వారి పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను డిప్యుటేషన్‌పై ఇక్కకు వచ్చానని వైద్యురాలు చెప్పడంతో కలెక్టర్ అక్కడ నుంచే జిల్లా ఆరోగ్య శాఖాధికారి శ్యామలతో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల్లో ఆ పోస్టును భర్తీ చేయాలని ఆదేశించారు. సత్వరం వంతెన పనులు తామరబ్బ-చింతలపూడి పంచాయతీల పరిధిలో శారదానదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణపనులు వేగవంతం చేయాలని ఆర్అండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చింతలపూడి గ్రామాన్ని సందర్శించిన ఆయన మార్గ మధ్యలో అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన నిర్మాణపనులను పరిశీలించారు. తామరబ్బ వంతెన నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంతో తాగునీటి సరఫరా పైపులు కొట్టుకుపోతున్నాయని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. స్కూళ్ల తీరుపై మండిపాటు తామరబ్బ నుంచి మోటారు సైకిల్‌పై చింతలపూడికి వెళ్లిన కలెక్టర్, సమ్మిద, చింతలపూడి పాఠశాలల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి ప్రాథమిక పాఠశాల తెరిచి ఉండి ఉపాధ్యాయుడు ఉన్నా పిల్లలు కానరాకవడంతో ఆయన మండిపడ్డారు. పిల్లలను ఎందుకు బడిలో చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. సమ్మెద ప్రాథమిక పాఠశాలలో టీచర్ లేకపోగా, స్కూలుకు తాళాలు వేసి ఉండటంతో ఆగ్రహించారు. చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. చింతలపూడిలో 2007లో ప్రారంభించిన పాఠశాల అదనపు భవన నిర్మాణం సగంలో నిలిచిపోవడంపై దృష్టిపెట్టిన ఆయన వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీఓను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, హౌసింగ్ ఏఈ సూర్యారావు ఉన్నారు. -
విశాఖలో కుటుంబం ఆత్మహత్యాయత్నం
విశాఖ : విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విషమంగా ఉన్న కుమార్తెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జల ఖడ్గానికి ఆరుగురు బలి
(న్యూస్‌లైన్ నెట్వర్క్) : భారీ వర్షాలు విశాఖ జిల్లాలో ఆరుగురి ప్రాణాలు బలిగొన్నాయి. కశింకోట, జి.మాడుగుల మండలాల్లో చెరో ఇద్దరు మృతి చెందారు. దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, పాడేరు మండలాల్లో చెరొకరు అసువులు బాశారు. మత్స్యగెడ్డలో ఒకరు గల్లంతయ్యారు. కశింకోట మండలం తాళ్లపాలెం సంత వద్ద మామిడివాక గెడ్డ ఉప్పొం గి కందుల మహేశ్వరరావు (70) ఇంటిని చుట్టు ముట్టింది. లఘుశంకకు వెళ్లిన మహేశ్వరరావు గెడ్డ నీటిలో జారిపడి కొట్టుకుపోయి మునిగి మృతి చెందాడు. తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన చలపాక నూకరత్నం (40) కొండ గె డ్డలో జారిపడి మృతిచెందింది. మహేశ్వరరావు చిల్లర దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, బుద్ధి మాంద్యం ఉన్న ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జి.మాడుగుల మండ లం సొలభం పంచాయతీ కొత్తకుండలు గ్రామంలో గోడ కూలి గంగపూజారి చిలకమ్మ (60) కన్నుమూసింది. ఇదే పంచాయతీలో ఎస్.కొత్తూరుకు చెందిన రొబ్బా గౌరమ్మ (50) కొండకు వంటచెరకు కోసం వెళ్లి బాగా తడిసిపోయిం ది. చలితో వణుకుతూ చనిపోయింది. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదికి చెందిన మోటూరి అప్పారావు (55) ఇంట్లో నిద్రిస్తూ ఉండగా, గోడ అతని పై కూలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దేవరాపల్లి మండలం ముషిడిపల్లికి చెందిన కర్రి అప్పారావు (45) గ్రామ సమీపంలోని ఎక్కన్నబంద వద్దకు ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశా త్తూ బందలోకి జారిపడ్డాడు. ఈత రాకపోవడంతో దుర్మరణం పాలయ్యాడు. మధ్యాహ్నానికి మృతదేహం తేలింది. మత్స్యగెడ్డలో గిరిజనుడి గల్లంతు పాడేరు మండలంలోని బొక్కెళ్లు కాజ్వే వద్ద మత్స్యగెడ్డలో ఓ గిరిజనుడు కొట్టుకు పోయాడు. గెడ్డ పొంగి ప్రవహిస్తున్నప్పటికీ దాటేందుకు ప్రయత్నించిన ఇరడాపల్లి కొత్తూరు గ్రామస్తుడు ముదిలి సూర్యనారాయణ(45) గల్లంతయ్యా డు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సంఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తులంతా మత్స్యగెడ్డ సమీప ప్రాంతాలన్నీ గాలించినప్పటికీ సూర్యనారాయణ ఆచూకీ కానరాలేదు. -
42 చోట్ల విద్యుత్ అంతరాయం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: వినియోగదారుడు: సార్ నేను అడ్డురోడ్డు దగ్గరున్న కొరుప్రోలు నుంచి అప్పలనాయుడ్ని మాట్లాడుతున్నాను. నిన్న అర్ధరాత్రి నుంచి మా ఊర్లో కరెంట్ లేదు. రాత్రి నుంచి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. ఉదయాన్నే కరెంట్ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ లేరు. కంట్రోల్ రూం సిబ్బంది: ఒక ఏఈ గార్ని మీ ఊరికి, దేవరాపల్లికి ప్రత్యేకంగా పంపించాం. ఈ ఊర్లోనే పెద్ద సమస్య తలెత్తింది. అందుకే ఈ ఊరు గుండా వెళ్లే లైన్ల ద్వారా సరఫరా నిలిచిపోయింది. కరెంట్ మాత్రం ఎప్పుడొస్తుందో చెప్పలేం గానీ త్వరలోనే ఇచ్చేస్తాం... ఇదీ జిల్లాలో కరెంట్ పరిస్థితి. పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి అంధకారం నెలకొంది. ఎప్పుడొస్తుందో తెలియని వినియోగదారులు కరెంట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 చోట్ల విద్యుత్ లైన్లు తెగిపోయాయి. విద్యు త్ ఉద్యోగుల సమ్మెతో కోటవురట్ల మండలంతోపాటు నర్సీపట్నం, నాతవరం మండలాల్లోని గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. కోట వురట్ల మండలం పాములవాకలో 33 కె.వి సబ్‌స్టేషన్ ఉంది. దీని పరిధిలోని ఆక్సాహేబుపేట, వేములపూడి ఫీడర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా నాతవరం మండల చెర్లోపాలెం, కోటవురట్ల మండలం రామన్నపాలెం, పి.కె.పల్లి, చినబొడ్డేపల్లి, ఆర్.కొత్తూరు, కె.కొత్తూరు, బోడపాలెం, నర్సీపట్నం మండ లం అమలాపురం, దుగ్గాడ, బంగారయ్యపేట, యరకన్నపాలం, వేములపూడి గ్రామాల్లో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇలా 13 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ సమస్య తో చినబొడ్డేపల్లి, కె.కొత్తూరు, ఆర్.కొత్తూరు, బోడపాలెం, పి.కె.పల్లి, రామన్నపాలెం తదితర గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పనిచేయక ఆయా గ్రామాల వారు ఇబ్బంది పడుతున్నారు. ఎస్.రాయవరం మండలం కొరుప్రో లు సబ్ స్టేషన్లో బ్రేక్‌డౌన్‌తో దాని పరిధిలోని18 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ప్రైవేటు వారితో శుక్రవారం పునరుద్ధరించడంతో కొందరు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సమ్మె కారణంగా నర్సీపట్నంలో గురువారం రాత్రి 7 గంటలకు సరఫరా నిలిచిపోయింది. ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో పునరుద్ధరణ కాలేదు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధి లో 148గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. మరో 150 గ్రామాల్లో తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఆయా ప్రాంతాల నుం చి తరచూ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న సమస్యలే..! జిల్లా వ్యాప్తంగా పలు ఫిర్యాదుల్లో వచ్చేవన్నీ చిన్నచిన్న సమస్యలే. ఫ్యూజ్‌ను సరి చేస్తే అనేక గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్ధరించవచ్చు. కానీ ఆ పని చేసేందుకు కూ డా సిబ్బంది లేకపోవడంతో గ్రామాలకు గ్రామాలు అం దకారంలోనే మగ్గుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిన సం ఘటనలు రెండు మూడు చోట్ల మాత్రమే ఉన్నాయి. వా టిని మార్పు చేసేందుకు కాస్త సమయం పడుతుంది. కానీ గ్రామాల్లో ఫ్యూజ్ ను సరి చేయడానికి కూడా ఉద్యోగు లు ముం దుకు రాకపోవడంతో సమస్య జఠిలంగా ఉం ది. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు ఆదివారం నుంచి విధుల్లో చేరనున్నారు. ఆ రోజు ఉదయం మొబైల్ సిమ్‌లను తిరిగి స్వాధీనం చేసుకుని విధుల్లో చేరతారు. -
సంపులో పడి చిన్నారి మృతి
యుర్నగూడెం (దేవరపల్లి), న్యూస్‌లైన్ : యుర్నగూడెంలో వుూడేళ్ల చిన్నారి పాండ్రాకుల నాగదేవిశ్రీ(లక్కీ) శుక్రవారం ఇంటి వద్దగల నీటి తొట్టె(సంపు)లో ప్రమాదవశాత్తు పడిపోయి వుృతి చెందింది. పాండ్రాకుల సత్యనారాయుణ, వివుల దంపతులకు ఐదేళ్ల వయసు కువూరుడు, మూడేళ్ల వయసు లక్కీ ఉన్నారు. ఆ బాలిక శుక్రవారం ఇంటి వద్ద ఆడుకొంటూ నీటి తొట్టెలో పడిపోయింది. వుధ్యాహ్నానికి కూడా కుమార్తె కనిపించకపోవటంతో వివుల చుట్టుపక్కల ఇళ్ల వద్ద వెతికింది. అరుునా కనిపించక పోవటంతో సంపు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే లక్కీ నిర్జీవంగా కనిపించింది. అల్లారు ముద్దుగా చేసుకుంటున్న లక్కీ వుృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వూజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆ ఇంటికి వెళ్లి బాలిక వుృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను ఓదార్చారు