దేవరపల్లి : ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబ ర్ నాటికి బయోమెట్రిక్ విధానం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని సాంఘిక సంక్షే మ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అ న్నారు. దేవరపల్లిలోని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా ఎనిమిది పాఠశాలల నిర్మాణం పూర్తయిందన్నారు. ఒక్కో క్క పాఠశాలకు రూ.19 కోట్లు మంజూరు చేశామన్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరలో చేపడతామని తెలిపారు.
సాంఘిక సంక్షేమ శాఖకు ఈ ఏడాది రూ.8,500 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. హాస్టళ్లకు రూ.200 కోట్లు, వెల్ఫేర్ వసతి గృహా లకు రూ.270 కోట్లు కేటాయించామన్నారు. హాస్టళ్లలో 1.60 లక్షల మంది, గిరిజన వసతి గృహాల్లో 80 వేల మంది విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. వీరి ఉపకారవేతనాలు విడుదల చేశామన్నారు. చిన్నాయిగూడెంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహానికి ప్రహారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పలేమని వచ్చినా టీడీపీకి ఇబ్బంది లేదని అన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిబంధనలను సడలించి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సబ్‌ప్లాన్ నిధులు నూరు శాతం నిధులు మంజూరు చేయాలని కోరారు.
పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల సమస్య అధికంగా ఉందని సబ్‌ప్లాన్ నిధుల నుంచి ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకట రమణ, పోలవరం ఏఎంసీ చైర్మన్ పాలేపల్లి రామారావు, టినర్సాపురం ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు, కొయ్యలగూడెం వైస్ ఎంపీపీ పారేపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment