ananda babu
-
‘ఎవరెస్ట్’విద్యార్థులకు ఘన స్వాగతం
సాక్షి, విజయవాడ: ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి తిరిగి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ, ట్రైబెల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ విద్యార్థుల బృందానికి మంత్రి అనందబాబు ఘన స్వాగతం పలికారు. ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్తిగా అధిరోహించిన ముగ్గురు సోషల్ వెల్ఫెర్, ఇద్దరు ట్రైబెల్ వెల్ఫెర్ విద్యార్థులను మంత్రి ఘనంగా సన్మానించారు. శిఖరాన్ని పూర్తిగా అధిరోహించిన విద్యార్థులకు రూ.10లక్షలు, మధ్యలో వెనుతిరిగిన విద్యార్థులకు రూ.5లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరెస్ట్ శిఖరరోహణ ద్వారా విద్యార్థులు రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంపొందించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి బయోమెట్రిక్
దేవరపల్లి : ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబ ర్ నాటికి బయోమెట్రిక్ విధానం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని సాంఘిక సంక్షే మ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అ న్నారు. దేవరపల్లిలోని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా ఎనిమిది పాఠశాలల నిర్మాణం పూర్తయిందన్నారు. ఒక్కో క్క పాఠశాలకు రూ.19 కోట్లు మంజూరు చేశామన్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరలో చేపడతామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖకు ఈ ఏడాది రూ.8,500 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. హాస్టళ్లకు రూ.200 కోట్లు, వెల్ఫేర్ వసతి గృహా లకు రూ.270 కోట్లు కేటాయించామన్నారు. హాస్టళ్లలో 1.60 లక్షల మంది, గిరిజన వసతి గృహాల్లో 80 వేల మంది విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. వీరి ఉపకారవేతనాలు విడుదల చేశామన్నారు. చిన్నాయిగూడెంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహానికి ప్రహారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పలేమని వచ్చినా టీడీపీకి ఇబ్బంది లేదని అన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిబంధనలను సడలించి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సబ్‌ప్లాన్ నిధులు నూరు శాతం నిధులు మంజూరు చేయాలని కోరారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల సమస్య అధికంగా ఉందని సబ్‌ప్లాన్ నిధుల నుంచి ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకట రమణ, పోలవరం ఏఎంసీ చైర్మన్ పాలేపల్లి రామారావు, టినర్సాపురం ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు, కొయ్యలగూడెం వైస్ ఎంపీపీ పారేపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు జిల్లాలకు డీటీసీపీఓలు
వరంగల్ అర్బన్ : కొత్త జిల్లాల ఆవిర్భావంతో జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు గురువారం విధుల్లో చేరారు. రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ ఆనంద్ బాబు ఆదేశాల మేరకు ఆయా జిల్లాల అధికారులు బాధ్యతలు స్వీకరించారు. గతంలో వరంగల్ జిల్లాకు టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి మాత్రమే ఉండేవారు. జిల్లా పునర్విభజనతో ఐదు జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా మినహా ఇతర జిల్లాలకు డీటీసీపీఓలను నియమించారు. వరంగల్ రూరల్ డీటీసీపీఓగా భిక్షపతి, భూపాలపల్లి ఇన్చార్జి డీటీసీపీఓగా ఖాలీల్, మహబూబాబాద్ ఇన్చార్జి డీటీసీపీఓగా ధరంసింగ్, జనగామ డీటీసీపీఓగా స్వామి నాయక్ బాధ్యతలు స్వీకరించారు. కాగా, వరంగల్ టీడీసీపీఓ, గ్రేటర్ వరంగల్ ఇన్చార్జి సిటీ ప్లానర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏ.కోదండ రామిరెడ్డిని సూర్యపేట జిల్లాకు బదిలీ చేశారు. సాంకేతిక ప్రజారోగ్య శాఖ ఇంజినీర్లు.. సాంకేతిక ప్రజారోగ్య శాఖలకు రెండు జిల్లాలకు ఇంజినీరింగ్ అధికారులను నియామించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు ప్రస్తుతం ఈఈగా పనిచేస్తున్న ఇన్చార్జి ఎస్ఈ రాజేశ్వర్ రావుకు ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా డీఈ శ్రీనాథ్ బాధ్యతలు చేపట్టారు.