సాక్షి, విజయవాడ: ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి తిరిగి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ, ట్రైబెల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ విద్యార్థుల బృందానికి మంత్రి అనందబాబు ఘన స్వాగతం పలికారు. ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్తిగా అధిరోహించిన ముగ్గురు సోషల్ వెల్ఫెర్, ఇద్దరు ట్రైబెల్ వెల్ఫెర్ విద్యార్థులను మంత్రి ఘనంగా సన్మానించారు.
శిఖరాన్ని పూర్తిగా అధిరోహించిన విద్యార్థులకు రూ.10లక్షలు, మధ్యలో వెనుతిరిగిన విద్యార్థులకు రూ.5లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరెస్ట్ శిఖరరోహణ ద్వారా విద్యార్థులు రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంపొందించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment