విశాఖ : విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విషమంగా ఉన్న కుమార్తెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.