దేవరపల్లిలో 40 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత | 40 bags pds rice caught | Sakshi
Sakshi News home page

దేవరపల్లిలో 40 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

Published Tue, Nov 8 2016 2:51 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

40 bags pds rice caught

దేవరపల్లి : కామవరపుకోట మండలం జలపావారిగూడెం నుంచి దేవరపల్లి రైస్‌ మిల్లుకు రవాణా అవుతున్న 40 బస్తాల రేషన్‌ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకుని పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించారు. ఉదయం 8 గంటలకు ట్రక్‌ ఆటోలో బియ్యం రవాణా అవుతున్నట్టు తెలుసుకున్న దేవరపల్లి ఎస్‌ఐ సి.హెచ్‌. ఆంజనేయులు ఆ ఆటోను అడ్డుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  భీమవరం ఏజీపీవో శేషగిరి, జీపీఐ ప్రసాద్, దేవరపల్లి సీఎస్‌ డీటీ ఎస్‌.పోతురాజు ఆటోలోని బియ్యం బస్తాలను పరిశీలించి రేషన్‌ బియ్యంగా గుర్తించారు. బియ్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేష¯ŒSకు తరలించారు. ఈ బియ్యాన్ని దేవరపల్లిలోని వరలక్ష్మి రైస్‌ మిల్లు యజమాని జలపావారిగూడెంలో కొని ఇక్కడికి తీసుకువస్తున్నట్టు గుర్తించారు. ఆ తరువాత వరలక్ష్మి రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. మిల్లులో రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ధాన్యం ఆడి బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉండగా, మిల్లు యజమాని ధాన్యం ఆడకుండా రేష¯ŒS బియ్యాన్ని కొని రీ సైక్లింగ్‌ చేస్తున్నట్టు కనుగొన్నారు. మిల్లు రికార్డుల నిర్వహణలో తేడాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రైస్‌మిల్లుపై 6 ఏ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement