pds
-
మంత్రి గారి బంధువు చెప్పారు.. వదిలేయండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆ ఓడ మనోళ్లదే.. వదిలేయండి. బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ బియ్యం ఎందుకు కలుస్తాయి? తనిఖీలు చేసి నిర్ధారించాల్సింది ఏముంటుంది? ఓడ పోర్టులో నిలిచిపోయి చాలా రోజులైంది. తక్షణం ఎగుమతికి అనుమతిచ్చి ఓడను వదిలేయండి’ అంటూ మూడు వారాలుగా కాకినాడ పోర్టులో నిలిపివేసిన నౌకకు కూటమి నేతలు ఆఘమేఘాలపై అనుమతిచ్చేశారు. మంత్రిగారి బంధువుకు చెందిన ఎక్స్‌పోర్టు కంపెనీ తరలిస్తున్న బియ్యం ఇందులో ఉందని, అందువల్లే బ్రోకెన్ రైస్ కాబట్టి అందులో పీడీఎస్ బియ్యం కలవలేదని ఎలా నిర్ధారిస్తారన్న మిగతా ఎగుమతిదారుల ప్రశ్నలకు సమాధానం రాకుండానే ఆ నౌక విదేశాలకు తరలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పిన మంత్రిమరోపక్క మంత్రి బంధువుల కన్సైన్మెంట్లు ఉండటంతో బ్రోకెన్ రైస్ అంటూ కాకినాడ నుంచే పున్నీ నౌకను పంపించేశారు. ఆఫ్రికా ఖండంలోని డక్కర్ దేశానికి కాకినాడ పోర్టు నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఇటీవల కేంద్రం అనుమతించింది. ఈ ఎగుమతి హక్కులను పట్టాభి ఆగ్రోస్, కేఎన్ రిసోర్సెస్, మురళీమోహన్, సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. డక్కర్‌కు బ్రోకెన్ రైస్ ఎగుమతి కోసం ఎంవీక్యూ పున్నీ నౌక గత నెల 28న కాకినాడ వచ్చింది. అదే సమయానికి కాకినాడ పోర్టులో ఉన్న స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యంపై రాద్ధాంతం మొదలైంది. ఈ నౌకను పోర్టులో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పున్నీ నౌకను కూడా పోర్టులో మూడు వారాలుగా నిలిపివేశారు. ఈ నౌకను పంపించేయడానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఒక ఎక్స్‌పోర్టర్ నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ ద్వారా లాబీయింగ్ చేశారని సమాచారం. ఇందుకోసం ఆయన తన బంధువైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కేబినెట్ మంత్రి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పినట్లు సమాచారం. సహజంగా రా రైస్ లేదా బ్రోకెన్ రైస్‌లో పోర్టిఫైడ్ రైస్‌లోని కేర్నల్స్ (పేదలకు పంపిణీ చేసే బియ్యంలో పౌష్టికాహారం కలిపే ప్రక్రియ) ఒక శాతం అనుమతిస్తారు. అంతకు మించి ఉంటే 6ఏ కేసు అవుతుంది. డక్కర్ దేశానికి ఎగుమతికి సిద్ధం చేసిన బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలిసి ఉండవచ్చుననే అనుమానంతో ఇన్ని రోజులూ నిలిపివేశారు. అయినా నౌకలో తనిఖీలు లేకుండా అనుమతివ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా, స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో గుర్తించిన పీడీఎస్ బియ్యం మొత్తం సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు ప్రైవేట్ లిమిటెడ్దేనని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్వయంగా ప్రకటించారు. పున్నీ నౌకలో బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఆర్డర్ పొందిన నాలుగు సంస్థలో సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు కూడా ఉంది. అటువంటప్పుడు బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలవలేదని ఎలా నిర్థారిస్తారని, కనీసం శాంపిళ్లు తీయకుండా, కెమికల్ టెస్ట్ చేయకుండా ఎగుమతికి ఎలా అనుమతిస్తారని ఎక్స్‌పోర్టర్లు ప్రశ్నిస్తున్నారు.కాకినాడ పోర్టుపై నానాయాగీకూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోతోందంటూ కాకినాడ పోర్టులో యాగీ ప్రారంభించారు. రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి నుంచి విదేశాలకు తరలించేసి కోట్లు కొల్లగొట్టేశారని గత ప్రభుత్వంపై విషం చిమ్మారు. ఆఫ్రికా ఖండానికి స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయని, సినిమా స్టైల్లో ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ పెద్ద బిల్డప్పే ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల విశాఖ పోర్టుకు వెళ్లి, అక్కడ కూడా పీడీఎస్ బియ్యం తరలిపోతోందంటూ హడావుడి చేశారు. అయితే, ఆ బియ్యం టీడీపీ నేతల అనుచరులదేనని తెలియడంతో మారు మాట్లాడలేదు. -
8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రైస్ కార్డుదారులందరికీ సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జనవరిలో ఎనిమిదివేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 23వ తేదీలోగా మండలస్థాయి నిల్వ కేంద్రాలకు (ఎంఎల్ఎస్ పాయింట్లకు) సరుకు తరలించనుంది. ప్రస్తుత నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది. గిరిజన ప్రాంతాల్లోని జీసీసీల ద్వారా కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు సాగించేలా ప్రోత్సహించనుంది. ఏడాదిగా మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రలో భారీవర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కందిపప్పునకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్తపంట వస్తుండటంతో రేటు నెమ్మదిగా దిగొస్తోంది. ఒకప్పుడు మార్కెట్లో కిలో కందిపప్పు రూ.115 ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేటు రూ.160–170కి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు. మధ్యలో మూడు, నాలుగునెలలు మార్కెట్లో లోటు ఉండటంతో పీడీఎస్‌లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గోధుమపిండికి డిమాండ్ పీడీఎస్ లబ్దిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టికాహార పదార్థాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫోరి్టఫైడ్ (విటమిన్లతో కూడిన) గోధుమపిండిని పరిచయం చేసింది. ప్రజల నుంచి స్పందన బాగుండటంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు మూడువేల టన్నుల గోధుమపిండి సరఫరా చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కిలో రూ.16కే అందిస్తుండటం గమనార్హం. లబ్ధిదారులకు దీన్ని మరింత తక్కువ రేటుకు ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపనుంది. రైస్ కార్డుదారుల ఇష్టం మేరకు కిలో బియ్యానికి బదులు కిలో గోధుమపిండి ఇవ్వనుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిమాణాన్ని తగ్గించుకుని దానికి బదులు గోధుమలను సరఫరా చేస్తుంది. వాటిని ప్రాసెసింగ్ చేసి ఫోరి్టఫైడ్ అనంతరం ప్యాకింగ్, రవాణాకు అయ్యే ఖర్చులను లెక్కించి పౌరసరఫరాలశాఖ ధర నిర్ణయించనుంది. ఈ విధంగా కిలో రూ.11–12కే గోధుమపిండి ఇవ్వొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే నెలకు 1,800 టన్నుల గోధుమలను కేంద్రం అందిస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొత్తం కార్డుదారులకు గోధుమపిండిని అందుబాటులో ఉంచేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు పంచదార, రాయలసీమలో చిరుధాన్యాల పంపిణీకి అవసరమైన నిల్వలను తరలిస్తోంది. నెలాఖరులోగా కందుల సేకరణ పౌరసరఫరాలసంస్థ ద్వారా స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందులు సేకరించడంతోపాటు వాటిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసి తిరిగి పీడీఎస్‌లోకి ప్రవేశపెట్టేలా పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ నెలాఖరులోగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. అవసరమైతే మార్కెట్ రేటును చెల్లించైనా రైతుల నుంచి 35 వేల టన్నులకుపైగా కందులను సేకరించాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగానే రవాణా, కూలీ, గోతాల ఖర్చులను సైతం రైతులకు ఇవ్వనుంది. కందులు సేకరించిన వారంలోగా రైతుల ఖాతాల్లో మద్దతు ధరను జమచేయనుంది. నాణ్యతలో రాజీలేకుండా ఇప్పటివరకు పీడీఎస్‌లో పంపిణీ చేస్తున్న కందిపప్పు బయట ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నదే. తొలిసారిగా ఏపీలో పండిన పంటను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి మర ఆడించి ప్రత్యేక ప్యాకింగ్‌లో రైస్ కార్డుదారులకు ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా అక్కడక్కడ కందిపప్పు నాణ్యతపై వస్తున్న విమర్శలను అధిగమించవచ్చు. ఏపీ అవసరాలకు తగినంత నిల్వలను ఇక్కడే సేకరిస్తాం. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇకపై జాప్యం లేని పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకేలోని క్షేత్రస్థాయి సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలసంస్థ సిబ్బంది సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించి కందులు కొనుగోలు చేస్తా – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ -
పీడీఎస్‌లోకి కొర్రలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతులు పండించిన చిరుధాన్యాలు (రాగులు, జొన్నలు) ఉత్పత్తులను మద్దతు ధరకు సేకరించి, తిరిగి వాటిని పీడీఎస్‌లోకి తీసుకొచ్చి లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది. తాజాగా కొర్రలను సైతం కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఖరీఫ్‌లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 750 కొనుగోలు కేంద్రాల్లో సుమారు 60వేల టన్నులకు పైగా చిరుధాన్యాల సేకరణకు సమాయత్తం అవుతోంది. ఫలించిన సీఎం జగన్ ప్రయత్నం రాష్ట్రంలోని రైతులను చిరుధాన్యాల సాగువైపు నడిపించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పండించే చిరుధాన్యాలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. గత రబీ సీజన్లో పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే కొర్రలకు కూడా మద్దతు ధర ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తోంది. కానీ, సీఎం జగన్ విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖరీఫ్ సన్నద్ధతపై జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో రాగులకు ఇచ్చే మద్దతు ధర క్వింటా రూ.3,846కే కొర్రలు కూడా కొనుగోలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇక జొన్నలను క్వింటా మద్దతు ధర రూ.3,225గా నిర్ణయించింది. 1.80 లక్షల టన్నుల చిరుధాన్యాలు అవసరం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీ ప్రారంభించింది. తాజాగా కొర్రలు కూడా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీలో పీడీఎస్ వినియోగానికి ఏడాదికి రూ.1.80 లక్షల టన్నుల చిరుధాన్యాలను సేకరించాల్సి ఉంది. వీటిలో రాగులు అత్యధికంగా ఏడాదికి 89,760 టన్నుల అవసరం కాగా, మిగిలినవి జొన్నలు, కొర్రలు పంపిణీ చేస్తారు. ఏపీలో రాగులు, జొన్నలు, కొర్రలు పంటల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఖరీఫ్‌లో రైతుల నుంచి సుమారు 60వేల టన్నుల వరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 1.20లక్షల టన్నులను ఎఫ్‌సీఐ నుంచి సేకరించనున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి కొర్రలు, అక్టోబర్ చివరి వారం నుంచి రాగులు, జొన్నలు సేకరించనున్నారు. చిరుధాన్యాలకు మద్దతు చిరుధాన్యాల పంపిణీని తొలి దశలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రారంభించాం. కార్డుదారుల ఇష్ట్రపకారం ఉచితంగానే బియ్యం బదులు రెండు కిలోల రాగులు, జొన్నలు అందిస్తున్నాం. రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలోనే ఈ పంటలు సాగవుతున్నాయి. ఫలితంగా తక్కువ ఉత్పత్తులు వస్తున్నాయి. అందుకే వెనుకబడిన జిల్లాలను ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నాం. ఇక ధాన్యం సేకరణ మాదిరిగానే చిరుధాన్యాలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ క్షేత్రం నుంచి గోడౌన్లకు తరలించే వరకు స్వయంగా ప్రక్రియను చేపడుతోంది. రైతే స్వయంగా తరలిస్తే మద్దతు ధరతోపాటు గోనె సంచులు, హమాలీ, రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తోంది. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
బియ్యం ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఓవైపు పాలకులు చెబుతుంటే.. మరోవైపు పక్క రాష్ట్రాలు తమ అవసరార్ధం కొనుగోలు చేస్తామన్న బియ్యం కూడా అందించలేక అధికార యంత్రాంగం సతమతమవుతోంది. కర్ణాటకలో ఎన్నికల హామీ అయిన ‘అన్న భాగ్య పథకం’కింద రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి అదనంగా 5 కిలోలు ఇచ్చేందుకు ఆ రాష్ట్రంలో బియ్యం అందుబాటులో లేవు. అలాగే తమిళనాడుకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇచ్చేందుకు బియ్యం అవసరమయ్యాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థలూ తెలంగాణను సంప్రదించాయి. దీంతో పౌరసరఫరాల సంస్థ గోడౌన్లలో మూలుగుతున్న బియ్యం ని ల్వలను, మిల్లులు బకాయి పడిన లక్షల టన్నుల బియ్యా న్ని సేకరించి ఈ రెండు రాష్ట్రాలకు పంపించాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్.. సంస్థ ఎండీ, కమిషనర్ అనిల్‌కుమార్‌కు సూచించారు. అయితే బియ్యం పంపడం సాధ్యం కాదంటూ కమిషనర్ చేతులెత్తేసినట్లు సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన పౌరసరఫరాల సంస్థ సమీక్ష సమావేశంలోనూ ఆయ న ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో మంత్రులు గంగుల, హరీశ్‌రావు, సీఎస్ సమావేశమై దీనిపై చర్చించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. 33 లక్షల మెట్రిక్ టన్నులు కావాలన్న రెండు రాష్ట్రాలు: కర్ణాటకకు నెలకు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) బియ్యం అవసరం ఉందంటూ ఆ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఈ నెల 3న అనిల్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈ లెక్కన సంవత్సరానికి 27 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. అలాగే తమిళనాడు నుంచి కూడా ఈ నెల 23న ఒక లేఖ అందింది. రాష్ట్ర పీడీఎస్ అవసరాల కోసం 4 ఎల్ఎంటీల బాయిల్డ్ రైస్, 2 ఎల్ఎంటీల ముడి బియ్యం అవసరం అని ఆ రాష్ట్రం కోరింది. రాష్ట్ర మిల్లర్ల నిర్వాకంతోనే వెనకడుగు? తెలంగాణలో ఏటా సగటున కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్‌కు వస్తోంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే 67 శాతం బియ్యం లెక్కన ఏటా సుమారు కోటి మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది. ఇందులో ఎఫ్‌సీఐకి 50 ఎల్ఎంటీ అప్పగించినా, మరో 50 ఎల్ఎంటీ వరకు స్టేట్ పూల్ కింద రాష్ట్రం వద్దనే ఉంటుంది. అయితే మిల్లర్లు నాణ్యమైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం, రోజుకు కనీసం 8 నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల మేర కూడా ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడం వంటి కారణాలతో ఒక సీజన్ ధాన్యం సీఎంఆర్‌గా ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరుకునేందుకు 18 నెలల వరకు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల మీద నమ్మకంతో పక్క రాష్ట్రాలకు విక్రయించే ఒప్పందాలు చేసుకుంటే ఇబ్బందులు తప్పవని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం. మిల్లర్లు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 4.5 ఎల్ఎంటీ బియ్యం ఇవ్వాల్సి ఉంది. 2019–20, 21 బాపతు బియ్యం 1.25 ఎల్ఎంటీలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బియ్యాన్ని 25 శాతం అదనపు జరిమానాతో వసూలు చేసినా, అది పౌరసరఫరాల సంస్థ ద్వారా పీడీఎస్‌కు తరలుతుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యంలో కోత పెట్టడం ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు అవకాశాలున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. అలాగే మిల్లర్లపై ఒత్తిడి పెంచి ఏ సీజన్ బియ్యం ఆ సీజన్లో మిల్లింగ్ చేయిస్తే పక్క రాష్ట్రాలకు విక్రయించడం కష్టం కాదని ఓ రిటైర్డ్ అధికారి వ్యాఖ్యానించారు. బియ్యానికి బదులు డబ్బులు అన్న భాగ్య పథకంపై కర్ణాటక నిర్ణయం బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హామీల్లో ఒకటైన అన్న భాగ్య పథకం అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం ప్రకారం దారిద్య్ర రేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు అయిదు కేజీలు అదనంగా బియ్యం ఇవ్వాల్సి ఉంది.జూలై 1 నుంచి ఈ పథకం అమలు చేయాల్సి ఉండగా బియ్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కర్ణాటక రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేజీ బియ్యానికి రూ.34 చొప్పున 5 కేజీలకయ్యే ధర మొత్తం వారి ఖాతాల్లో వేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి కె.హెచ్. మునియప్ప విలేకరులకు వెల్లడించారు.‘‘రాష్ట్ర అవసరాలకు సరిపడా బియ్యాన్ని ఇవ్వడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కేజీ బియ్యం ధర రూ.34. అవసరమైన బియ్యం ప్రభుత్వం సేకరించే వరకు అర్హులైన లబ్దిదారులందరికీ బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తాం’’ అని వివరించారు. ఒక కార్డులో ఒకే వ్యక్తి ఉంటే రూ.170, ఇద్దరు ఉంటే రూ.340, ఒకవేళ అయిదుగురు సభ్యులుంటే వారి ఖాతాలో రూ.850 వేస్తామని మంత్రి వివరించారు. -
పీడీఎస్ ద్వారా ఏపీలో జొన్నలు, రాగుల పంపిణీ
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో పీడీఎస్ ద్వారా జొన్నలు, రాగుల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు అవసరమైన రాగులు, జొన్నల సరఫరాకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంగీకరించినట్టు చెప్పారు. బియ్యంతో పాటు రేషన్ కార్డుదారులకు రెండు కిలోల గోధుమ పిండిని పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అందిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి తణుకు నియోజకవర్గంలోనూ ప్రారంభిస్తున్నామని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా గోధుమ పిండి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రమంతా బలవర్ధక ఆహారాన్ని అందించే ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్నిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని గిరిజనులకు అందించేందుకు లక్ష అంత్యోదయ రేషన్‌కార్డులను కోరగా.. కేంద్రమంత్రి పీయూ‹Ùగోయల్ అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరి రేషన్ కార్డునూ తొలగించట్లేదని, కేవలం అనర్హులవి మాత్రమే తొలగిస్తున్నట్టు చెప్పారు. 2012 నుంచి 2018కి మధ్య రాష్ట్రానికి రావాల్సిన రూ.1,702 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసే విషయంలో కేంద్ర మంత్రి, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శిలతో చర్చించామన్నారు. ఏపీలో స్మార్ట్ పీడీఎస్‌లో భాగంగా అమల్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును పీయూ‹Ùగోయల్ అభినందించి.. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. లోకేశ్, చంద్రబాబు, అయ్యన్నపాత్రుడే ఏపీలో గంజాయి మాఫియా నిర్వహిస్తున్నారని, జగన్ సీఎం అయ్యాక గంజాయిని పెద్ద ఎత్తున నియంత్రించినట్టు మంత్రి కారుమూరి వివరించారు. -
'ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు'
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జియో ట్యాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 'రైస్ మిల్లులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బియ్యం రీసైకిల్ కాకుండా చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు డబ్బులు మూడు రోజులలో రైతుల ఖాతాలలో వేస్తున్నాం. రూ.1,702 కోట్ల పాత బకాయిలు చెల్లింపునకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేరళ కోసం జయ బొండం బాయిల్డ్ రైస్‌కు కేంద్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది. ఒక లక్ష అంత్యోదయ కార్డుల మంజూరుకు కేంద్రం ఒప్పుకుంది. రైతులకు ధాన్యం డబ్బులు ఎప్పటికప్పడు ఇస్తున్నాం. కేంద్రం సకాలంలో చెల్లింపులు చేస్తోంది. రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్ కింద సరఫరా చేస్తాం. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా దాడులు చేస్తున్నాం. రేషన్ కార్డులు తొలగించం. పార్టీలు, కులాలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం.' అని కారుమూరి పేర్కొన్నారు. చదవండి: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై కేటీఆర్ ట్వీట్ -
డీలర్లకు ఓటీపీ.. లబ్ధిదారులకు టోపీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు సరఫరా చేస్తున్న రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. పేదల అవగాహనాలేమిని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారుల నుంచి ఓటీపీని తీసుకొని అరకొర బియ్యం పంపిణీ చేసి, మిగతా బియ్యాన్ని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓటీపీ నంబర్‌ను సేకరించి డీలర్లు చేస్తున్న దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’జరిపిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్‌షాపులున్నాయి. ఇందులో 2.85 కోట్లమంది లబ్ధిదారులు ఉన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నాయి. ప్రతినెలా 1.78 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రానికి సçరఫరా అవుతోంది. రేషన్ డీలర్లు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 లేదా 20వ తేదీ వరకు సరకులనున లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సరుకుల పంపిణీ వేళ రేషన్‌లబ్ధిదారుడు నుంచి ఓటీపీ లేదా ఐరిస్ తీసుకొని సరుకులు ఇస్తారు. బియ్యం కాజేసేది ఇలా...! ఒక రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే ఆ కుటుంబానికి 40 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. నిర్దేశిత సమయాల్లో రేషన్çషాపు వద్ద భారీగా లబ్ధిదారులు ఉంటే, అక్కడ వేచి చూసే ఓపికలేని లబ్ధిదారులు ఆ షాపు డీలర్‌కు ఫోన్ చేసి తమ రేషన్‌కార్డు నంబర్ చెబుతారు. మిషిన్‌లో సదరు నంబర్‌ను సంబంధిత డీలర్ ఎంటర్ చేయగానే లబ్ధిదారుల ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిందంటే ఆ లబ్ధిదారు సరుకులు తీసుకున్నట్లు లెక్క. ఆ తర్వాత డీలర్లు సూచించిన తేదీకి బియ్యం కోసం వెళ్తే కోటా అయిపోయిందని చెబుతున్నారు. లేదంటే, ‘ఇప్పుడు కొన్ని తీసుకెళ్లు.. మిగతావి తర్వాత కొన్ని ఇస్తాను’అని తిప్పి పంపుతున్నారు. ఇలా 15 తేదీ నుంచి 20 వరకు జాప్యం చేసి, తీరా ఆ నెల కోటా అయిపోయిందని చెప్పేస్తున్నారు. ఇలా కనీసం 5 లేక 10 కిలోలను లబ్ధిదారుల నుంచి డీలర్లు కాజేస్తున్నారు. కార్డుపోతుందనే భయంతోనే.. కొందరు లబ్ధిదారులు ప్రతినెలా రేషన్ తీసుకోరు. మరికొందరేమో రేషన్ బియ్యం ఎందుకులే అని తీసుకోవడంలేదు. రేషన్‌కార్డు ఉంటే చాలు అని ఇలాంటి వాళ్లు భావిస్తుంటారు. ప్రతినెలా ఆయా రేషన్ డీలర్లకు ఓటీపీ చెప్పి వదిలేస్తున్నారు. రేషన్‌డీలర్లు ఇలా కాజేసిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. టిఫిన్ సెంటర్లకు, బియ్యం వ్యాపారులకు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. సన్నబియ్యం రావడమే కారణం ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి రేషన్‌డీలర్లకు సన్న, దొడ్డు రకం బియ్యం సరఫరా చేస్తోంది. అయితే రేషన్ డీలర్లు ఒక్కో సంచిని పరిశీలించి సన్నబియ్యం బస్తాలను పక్కకు పెట్టేస్తున్నారు. సంబంధిత షాపునకు మొత్తంగా సన్నబియ్యం వస్తే అందులోంచి దాదాపు 20 శాతం మందికి కొంత కోటా ఆపి మిగతా బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అలా ఆపిన బియ్యాన్ని డీలర్లు ఇతరులకు అమ్ముకుంటున్నారు. చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్ -
అలర్ట్! భారీగా తమిళనాడు ప్రజల డేటా హ్యాక్
తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్) డేటా దొంగలించబడింది. దాదాపు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాను హ్యాకర్ ఫోరంలో అప్ లోడ్ చేసినట్లు బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ టెక్నిశాంక్ తెలిపింది. లీక్ చేయబడ్డ డేటాలో ఆధార్ నెంబర్లు అదేవిధంగా లబ్ధిదారుల సున్నితమైన వివరాలు, వారి కుటుంబ సమాచారం, మొబైల్ నెంబర్లతో సహా ఉన్నాయి. హ్యాకర్లు ఫిషింగ్ దాడుల కోసం ఈ లీక్ చేసిన డేటాను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలోని పెద్ద వ్యక్తుల నుంచి నిస్సహాయ ప్రజలను సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే, డేటా హ్యాక్ కావడంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బహిరంగంగా ధృవీకరించలేదు. డార్క్ వెబ్ లో లీక్ అయిన డేటాలో తమిళనాడులో మొత్తం 49,19,668 మంది సమాచారం ఉందని సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ తెలిపింది. దీనిలో 3,59,485 ఫోన్ నంబర్లతో ప్రభావిత వినియోగదారుల చిరునామాలు, ఆధార్ నంబర్ల కూడా ఉన్నట్లు ఉంది. లీక్ డ్ డేటా ఫీల్డ్ లలో నవజాత శిశువులతో సహా పౌరులందరి డేటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మక్కల్ నంబర్' కూడా ఉన్నట్లు పేర్కొంది. హ్యాక్ అయిన డేటాలో లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మొదట ది వీక్ నివేదించింది. తమిళనాడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వెబ్ సైట్ లేదా ఎక్కడి నుంచి డేటా హ్యాక్ అయ్యింది అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. తమిళనాడు పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ విభాగం పోర్టల్ లో డ్యాష్ బోర్డ్ పీడీఎస్ వ్యవస్థ కోసం 6.8 కోట్లకు పైగా రిజిస్టర్డ్ లబ్ధిదారులు ఉన్నట్లు చూపిస్తుంది. బెంగళూరుకు చెందిన టెక్నిశాంక్ట్ సీఈఓ నందకిశోర్ హరికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. లీక్ అయిన డేటాను జూన్ 28న అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ డేటాను కనుగొన్న కొద్దిసేపటికే ఈ హ్యాక్ అయిన డేటా గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు టెక్నిశాంక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. హ్యాక్ అయిన వివరాలకు సంబంధించి తమిళనాడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబర్ స్పందించి, నివేదికను దర్యాప్తు కోసం ఫార్వర్డ్ చేసినట్లు ధృవీకరించినట్లు హరికుమార్ చెప్పారు. తమిళనాడు పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ విభాగం (tnpds.gov.in) వెబ్ సైట్ సైబర్ దాడికి గురైనట్లు, "1945వీఎన్" అనే సైబర్ క్రిమినల్ గ్రూప్ హ్యాక్ చేసినట్లు టెక్నిశాంక్ట్ పేర్కొంది. గత డిసెంబర్ లో గాడ్జెట్స్ 360 తెలంగాణ ప్రభుత్వ సైట్ లో ఒక లోపం ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపం వల్ల ఉద్యోగుల, పెన్షనర్ల సున్నితమైన డేటాను బహిర్గతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై స్పందించిన ట్విటర్ -
రేషన్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పేదలకు సబ్సిడీ ధరలకు నిత్యావసరాలను సరఫరా చేసే "ప్రజాపంపిణీ వ్యవస్థ’’ (పీడీఎస్) ధరలను పెంచబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆహార ధాన్యాల ధరల పెంపు మరో ఏడాది పాటు ఉండదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ఆహార శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు ఇతర తృణధాన్యాల విక్రయ ధరలను ఒక సంవత్సరం వరకు పెంచమని రాం విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తద్వారా ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2013 లో ఆమోదం పొందిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద మూడు సంవత్సరాలకు ఆహారధాన్యాల ధరలను సమీక్షిస్తారు. PM Sh. Narendra Modi Ji has taken a historic decision to not to increase the issue prices of food-grains under NFSA for one more year. — Ram Vilas Paswan (@irvpaswan) June 28, 2017 -
పీడీఎస్ బియ్యం పట్టివేత
200 కింటాళ్లు స్వాధీనం మండపేట గోదాముకు తరలింపు దర్యాప్తు చేస్తున్న అధికారగణం సంఘటన వెనుక భారీ రాకెట్ ? ఆలమూరు : మడికి శివారు మల్లవానితోటలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం (పీడీఎస్) సీజ్ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం వెనుక భారీ రాకెట్ ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారులు సీజ్ చేసిన ఆ బియ్యాన్ని ఎక్కడి నుంచి ఎగుమతి చేశారో తెలుసుకునేందుకు స్థానిక అధికారులు రాత్రి పొద్దుపోయే వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాజమహేంద్రవరం నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి కేసు లోతును పరిశీలిస్తున్నారు. వివరాలల్లో కెళితే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో స్థానికులు లారీని స్థానిక కడియం మండలం వీరవరం జంక్షన్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయబోయారు. దీంతో భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ వేగంగా వెళ్లి మండల పరిధిలోని మల్లవాని తోట పరిధిలో ఒక నిర్జీవ ప్రదేశంలో లారీని నిలిపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఆలమూరు తహసీల్దార్ కె.పద్మావతి, మండపేట ఎంఎస్ఓ గాంధీ నేతృత్వంలో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బియ్యాన్ని పరిశీలించి పీడీఎస్‌గా గుర్తించారు. స్థానిక అధికారులు రాజమహేంద్రవరం జీపీఏ కార్యాలయానికి సమాచారం అందించగా ఏజీపీఏ పి.భాస్కర్, ఏఎస్ఓ కె.ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదుపులోకి తీసుకున్న లారీని మండపేట పౌరసరఫరాల గోదాము స్టాకు పాయింట్‌కు తీసుకువెళ్లి పీడీఎస్ బియాన్ని పరిశీలించారు. ఆ లారీలో సుమారు 200 క్వింటాళ్ల బియ్యం ఉండటంతో పాటు ఆ బస్తాలపై వివిధ ప్రాంతాలకు చెందిన ట్యాగ్లు ఉండటం అధికారులకు బియ్యం గుర్తింపు పక్రియ ఇబ్బందికరంగా మారింది. దీంతో కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి పౌరసరఫరాలశాఖ నిపుణులను రప్పించి ట్యాగ్ ఆధారంగా బియ్యం బస్తాలను విడగొడుతున్నట్లు తెలిసింది. రాత్రి పొద్దు పోయే వరకూ పౌరసరఫరాల శాఖ ఏవిధమైన సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే మల్లవానితోటకు వచ్చిన పలువురు పౌరసరఫరాల అధికారులు స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించి వివరాలను నమోదు చేసుకున్నారు. బియ్యం దిగుమతి ప్రయత్నం బెడసి కొట్టిందా? మల్లవానితోట–వీరవరం పరిసర ప్రాంతంలో ఉన్న ఒక రైసుమిల్లులో 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని దిగుమతి చేయాల్సి ఉంది. ముందస్తు సమాచారంతో గుట్టు రట్టవ్వడంతో రైసుమిల్లు సమీపం వరకూ వచ్చిన లారీని డ్రైవర్ మరో ప్రదేశానికి తీసుకువెళ్లిపోయాడు. ఆ రైసుమిల్లు పాత్రపై అనుమానాలున్నా ప్రస్తుతం ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పౌరసరఫరాల శాఖ «అధికారులు పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్టాకు పాయింట్లో దిగుమతి చేసి లారీని ఆలమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై సమగ్ర వివరాలను అందజేస్తే కాని తాము కేసుకు సంబంధించి ఏమీ చేయమలేమని ఎస్సై పి.దొరరాజు స్పష్టంచేశారు. పౌరసరఫరాలశాఖ అదుపులో డ్రైవర్, క్లీనర్ ! రాజమహేంద్రవరం పౌరసరఫరాలశాఖ అధికారుల అదుపులో లారీ డ్రైవర్, క్లీనర్ ఉన్నట్లు తెలుస్తొంది. బియ్యం బస్తాలపై ఉన్న ట్యాగ్ ఆధారంగా పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత డ్రైవర్, క్లీనర్లను విచారించేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించుకున్నట్లు తెలుస్తొంది. రాత్రి పొద్దు పోయే వరకూ గోదాముల వద్ద సమయం సరిపోవడంతో బుధవారం నిందితులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంంగా తెలిసింది. విచారణలో బియ్యం ఎన్ని ప్రదేశాల నుంచి ఎగుమతి జరిగింది? ఎవరు ఎగుమతి చేశారు ? ఎక్కడికి వెళ్లవలసి ఉంది ? ఈకథ వెనుక ఎవరున్నారు? అనే విషయాలు తేలవలసి ఉంది. -
కిరో‘సీన్’
ఏలూరు (మెట్రో) : వచ్చే నెల నుంచి రేషన్ కార్డులపై కిరోసిన్ పంపిణీని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అదునుగా డీలర్లు బరితెగించారు. మే నెల కోటాగా జిల్లాకు విడుదలైన కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. జిల్లాలోని 2,040 రేషన్ షాపుల ద్వారా మే నెలలో 1,243 కిలోలీటర్ల కిరోసిన్‌ను కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 759 కిలోలీటర్లు మాత్రమే విడుదల చేసింది. అందరికీ దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామంటూ ఈ నెల కిరోసిన్ కోటాలో 40 శాతం కోత విధించారు. 559 కిలోలీటర్లు బ్లాక్ మార్కెట్‌కు.. వచ్చే నెల నుంచి కిరోసిన్ పంపిణీ నిలిచిపోనుండటంతో ఇదే చివరి అవకాశంగా భావించిన డీలర్లు సుమారు 559 కిలోలీటర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. కార్డుదారుకు లీటర్ రూ.19కి ఇవ్వాల్సిన ఈ కిరోసిన్‌ను రూ.40 నుంచి రూ.50 చొప్పున ధర కట్టి నల్లబజారుకు తరలించారు. జిల్లాకు 759 కిలోలీటర్లు విడుదల కాగా.. ఇందులో 200 కిలో లీటర్లు కూడా వినియోగదారులకు చేరలేదు. కార్డుదారులు రేషన్ డిపోలకు వెళ్లి కిరోసిన్ అడిగితే.. మే నెల నుంచే పంపిణీ నిలిచిపోయిందని అడ్డంగా బొంకారు. బియ్యం, పంచదార తీసుకున్న సమయంలోనే కిరోసిన్ కూడా తీసుకున్నట్టు ఈపోస్ యంత్రాల్లో నమోదు చేసి దొడ్డిదారిన నల్లబజారుకు తరలించారు. వంతపాడిన పౌర సరఫరాల శాఖ ! రేషన్ డీలర్ల వద్ద నుంచి ప్రతినెలా కాసులకు కక్కుర్తి పడుతున్న పౌర సరఫరాల శాఖ ఈ నెలలో కనీసం రేషన్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కిరోసిన్ ఇవ్వడం లేదని కార్డుదారులు బహిరంగంగా చెబుతున్నా చెవికెక్కించుకున్న పాపాన పోలేదు. కిరోసిన్ కోటాకు సైతం పౌర సరఫరాల అధికారులకు ముడుపులు అందిన కారణంగానే మిన్నకుండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నాం కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే దానిపై ప్రతినెలా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎటువంటి అక్రమాలు లేవు. కిరోసిన్ నల్లబజారుకు తరలిందనేది అవాస్తవం. – సయ్యద్ యాసిన్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
రేషన్ బియ్యం.. అయోమాయం
‘రేషన్ బియ్యం తీసుకోవడం మానేయండి.. కిలోకు రూ.20 చొప్పున నేరుగా నగదు తీసుకోండి’ ఇకపై ప్రభుత్వం చేయబోయే ప్రచారమిది. ఆహార భద్రత పథకం కింద పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వారికి దూరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రేషన్ బియ్యం పంపిణీపై ఇప్పటికే సర్వే నిర్వహించామని.. చాలామంది ఈ బియ్యాన్ని తీసుకోకుండా డీలర్లకు అమ్మేస్తున్నారని చెబుతోంది. ఈ ముసుగులో బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. బియ్యానికి బదులు నగదు ఇచ్చే విధానాన్ని తొలుత మన జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. భీమవరం/పాలకోడేరు : జిల్లాలో అనేక నిరుపేద కుటుంబాలు రేషన్ బియ్యం అందుతుండటం వల్లే గుప్పెడు మెతుకులు తినగలుగుతున్నాయి. మనిషికి 5 కేజీల చొప్పున ఇస్తుండగా.. అవి 15 నుంచి 20 రోజులు మాత్రమే సరిపోతున్నాయి. మిగిలిన రోజుల్లో కడుపు నింపుకునేందుకు స్థోమత గలవారు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.40 చొప్పున వెచ్చించి బియ్యం కొనుగోలు చేస్తుంటే.. నిరుపేదలు పస్తులు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ బియ్యం తీసుకోవడం మానేస్తే కిలోకు రూ.20 చొప్పున ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేయడం పేదల పొట్టకొట్టడమే అవుతుందని ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. ఆహార భద్రత పథకానికి తూట్లు పొడిచే విధానాలను మానుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మనిషికి ఇచ్చే 5 కిలోల బియ్యం స్థానంలో కిలోకు రూ.20 చొప్పున రూ.100 మాత్రం ఇస్తారని.. ఆ సొమ్ముతో పేదలు ఏం తినగలరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చెబుతోందంటే.. జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా 17 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యాన్ని ప్రభుత్వం రూ.27కు కొనుగోలు చేస్తోంది. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి కిలో బియ్యం సుమారు రూ.35 అవుతోంది. జిల్లాలోని కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రూ.59.50 కోట్లు వెచ్చిస్తున్నాయి. కిలో బియ్యాన్ని రూపాయికే కార్డుదారులకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి రూ.1.70 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.57.80 కోట్ల భారం పడుతోంది. ఇంత సొమ్ము వెచ్చించినా ఆ బియ్యాన్ని వినియోగిస్తున్న వారు తక్కువగా ఉన్నారనేది ప్రభుత్వ వాదన. ఈ విషయం సర్వేలో వెల్లడైందని చెబుతోంది. చాలామంది కార్డుదారులు బియ్యాన్ని రేషన్ డీలర్లకు అమ్మేసుకుంటున్నారని.. ఈ కారణంగానే బియ్యానికి బదులు నగదు ఇవ్వాలనే ఆలోచన ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని మన జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి కలెక్టర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. బియ్యం బదులు నగదు కావాలనుకునే వారి ఖాతాల్లో కిలోకు రూ.20 చొప్పున జమ చేయాలని భావిస్తున్నారు. బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కనుక కిలోకు రూ.20 చొప్పున కార్డుదారులకు ఇస్తే నగదు రూపంలో రూ.7తోపాటు రవాణా చార్జీలు మిగులుతాయి. తద్వారా నెలకు రూ.25.50 కోట్ల వరకూ ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి 5 నుంచి 10 శాతం మంది మాత్రమే బియ్యాన్ని తీసుకోవడం లేదు. వారిలో కొందరు ఆ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం తినడానికి అనువుగా లేకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం తినేందుకు అనువుగా ఉంటే ఎవరూ అమ్ముకునే పరిస్థితి ఉండదని.. మంచి బియ్యాన్ని సరఫరా చేయడం మానేసి ప్రభుత్వం దొడ్డిదారులు వెతకడం ఏమిటనే వాదన వినిపిస్తోంది. -
నగదు రహిత కష్టాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత విధానం ఇటు కార్డుదారులు.. అటు రేషన్ డీలర్లకు చుక్కలు చూపిస్తోంది. గోపాలపురం మండలం పెద్దగూడెంలో ప్రజలు ఈ పోస్ యం త్రాలను ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. జిల్లాలో పలుచోట్ల రేషన్ డిపోల ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. పూర్తిస్థాయి కసరత్తు లేకుండా హడావుడిగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డుదారులందరికీ విధిగా బ్యాంక్ అకౌంట్లు ఉండాలనే నిబంధన విధించారు. గతంలోరేషన్ కార్డులో పేరు నమోదైన అందరి వ్యక్తుల వేలి ముద్రలు స్వీకరించారు. వారిలో ఎవరు రేష¯ŒS షాపునకు వెళ్లినా నిత్యావసర సరుకులు ఇచ్చేవారు. ఈ నెల నుంచి ఆన్లైన్ చెల్లింపు రావడంతో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయ్యింది. దీంతో కార్డులో పేరు నమోదైన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందేనని డీలర్లు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరికి బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోదని, నిత్యావసర సరుకుల కోసం ఎవరైతే వస్తారో వారి పేరిట కచ్చితంగా అకౌంట్ ఉండాలని, ఆ అకౌంట్ నుంచే నగదు బదిలీ అవుతుందని చెబుతున్నారు. అకౌంట్లో కనీసం రూ.500 నగదు నిల్వ ఉండాలని, లేకపోతే చార్జీలు చెల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అంత సొమ్మును బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉంచే పరిస్థితి పేదలకు ఉండదు. కొందరికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నా సరుకులు తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు వెళ్లేముందు బ్యాంక్‌కు వెళ్లి సొమ్ము జమ చేయాల్సి వస్తోంది. ఆ తరువాత సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. కొందరి ఖాతాల్లో సొమ్ములున్నా సాంకేతిక సమస్య కారణంగా సరుకులు తీసుకోలేని దుస్థితి దాపురిస్తోంది. కొన్నిచోట్ల కార్డుదారుల ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగినా డీలర్ ఖాతాలో జమ కావడం లేదు. దీంతో కార్డుదారులు నగదు కోల్పోవడమేకాక, సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాల సమస్య జిల్లాలోని రేషన్ దుకాణాల్లో విజన్‌టెక్, ఎనలాజిక్ ఈ పోస్ యంత్రాలు ఉన్నాయి. విజన్‌టెక్ యం త్రాల్లో 25 నుంచి 30 శాతం నగదు రహిత విధానంలో పనిచేస్తున్నాయి. ఎనలాజిక్ యంత్రాలను గత నెల 31న ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. కనీసం డీలర్లకు శిక్షణ ఇవ్వకుండా ఈ నెల 1 నుంచి నగదు రహిత విధానాన్ని అమల్లోకి తెచ్చారు. చాలాచోట్ల యంత్రాలు ఆన్‌లైన్‌తో అనుసంధానం కాలేదు. అందరూ ఒకేసారి ఈ యంత్రాలను అనుసంధానం చేయడంతో సర్వర్లు బిజీగా మారిపోయాయి. ఆచంట, భీమవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలకు డీలర్లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఏపీపీడీఎస్ సర్వర్, ఆధార్ సర్వర్, బ్యాంకింగ్ సర్వర్ ఏకకాలంలో పనిచేయడంతోపాటు లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో తగినంత సొమ్ము నిల్వ ఉంటేనే సరుకులు ఇవ్వడానికి వీలవుతోంది. ఏ సర్వర్ పని చేయకపోయినా, పదేపదే ప్రయత్నం చేయాల్సి వస్తోంది. మరోవైపు లబ్ధిదారులు తమ ఖాతాల్లో కనీస నగదు జమ చేసేందుకు, ఆధార్ అనుసంధానం చేసేందుకు పనులు మానుకుని బ్యాంకుల ఎదుట నిలబడుతున్నారు. డిసెంబర్ నెలలో సరుకులు అప్పుగా ఇచ్చారు. జనవరి నెలలో డీలర్లు రెండు నెలల డబ్బులు వసూలు చేశారు. డిసెంబర్లో తీసుకెళ్లిన సరుకులకు సొమ్ము చెల్లించలేనట్టు ఈ–పోస్ యంత్రాలు చూపిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతా నుంచి రెండు నెలల సొమ్ము డీలర్‌కు బదిలీ అవుతోంది. డీలర్ల ఆందోళన నగదు రహితం పేరుతో యూజర్ చార్జీలు వసూలు చేస్తుండటంతో డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక డీలర్ 400 కార్డులపై నగదు రహిత విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తే కార్డుకు రూ.3 చొప్పున రూ.1,200 యూజర్ చార్జీలు డీలర్ ఖాతా నుంచి కట్ అవుతున్నాయి. కొందరు కార్డుదారుల ఖాతాల నుంచి బదిలీ అయిన సొమ్ములు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఈ సొమ్ములు బ్యాంకుల్లోని సస్పెన్స్ అకౌంట్లలోకి చేరుతున్నాయి. దీంతో డీలర్లు ఆ సొమ్మును తమ ఖాతాలోకి మార్పించుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నగదు రహితం పూర్తిస్థాయిలో చేశామని చెప్పుకోవడానికి జిల్లా ఉన్నతాధికారులు తీసుకువస్తున్న ఒత్తిడి కారణంగా కార్డుదారులు, డీలర్లు నలిగిపోతున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు తమకు శాపంగా మారుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన తర్వాతే నగదు రహిత లావాదేవీలు చేయాలని.. లేనిపక్షంలో వచ్చే నెలలో షాపులు మూసివేసి నిరసన తెలుపుతామని డీలర్ల అసోసియేషన్ నేత గంగాధర్ ‘సాక్షి’కి తెలిపారు. -
దేవరపల్లిలో 40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
దేవరపల్లి : కామవరపుకోట మండలం జలపావారిగూడెం నుంచి దేవరపల్లి రైస్ మిల్లుకు రవాణా అవుతున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకుని పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించారు. ఉదయం 8 గంటలకు ట్రక్ ఆటోలో బియ్యం రవాణా అవుతున్నట్టు తెలుసుకున్న దేవరపల్లి ఎస్ఐ సి.హెచ్. ఆంజనేయులు ఆ ఆటోను అడ్డుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భీమవరం ఏజీపీవో శేషగిరి, జీపీఐ ప్రసాద్, దేవరపల్లి సీఎస్ డీటీ ఎస్.పోతురాజు ఆటోలోని బియ్యం బస్తాలను పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించారు. బియ్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేష¯ŒSకు తరలించారు. ఈ బియ్యాన్ని దేవరపల్లిలోని వరలక్ష్మి రైస్ మిల్లు యజమాని జలపావారిగూడెంలో కొని ఇక్కడికి తీసుకువస్తున్నట్టు గుర్తించారు. ఆ తరువాత వరలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ధాన్యం ఆడి బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉండగా, మిల్లు యజమాని ధాన్యం ఆడకుండా రేష¯ŒS బియ్యాన్ని కొని రీ సైక్లింగ్ చేస్తున్నట్టు కనుగొన్నారు. మిల్లు రికార్డుల నిర్వహణలో తేడాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రైస్‌మిల్లుపై 6 ఏ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ మిర్యాలగూడలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఓ దుకాణంలో సోమవారం సివిల్ సప్లయిస్ విజిలెన్స్ అధికారులు 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, నూకల మిక్సింగ్‌ను పట్టుకున్నారు. గత నెల 28వ తేదీన సాక్షిలో ‘ కొత్త దందా’ శీర్షికన రేషన్ బియ్యం దందాపై ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ బియ్యం– నూకల మిక్సింగ్, బియ్యం విక్రయాలు, నూకల నిల్వలపై దాడులు నిర్వహంచాలని సివిల్‌సప్లయిస్ అధికారులను ఆదేశించారు. కాగా నాటి నుంచి విజిలెన్స్ అధికారులు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న దుకాణంలో నూకలు – బియ్యం నిల్వ ఉన్న విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ భిక్షపతి దుకాణాన్ని సీజ్ చేశారు. కాగా సోమవారం సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ బియ్యం – నూకల మిక్సింగ్‌గా గుర్తించి 50 క్వింటాళ్లను సీజ్ చేశారు. అనంతరం సివిల్ సప్లయిస్ హుజూర్నగర్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ మహేశ్వరి ఎంటర్ప్రైజెస్ దుకాణంలో ఉన్న బియ్యం –నూకల మిక్సింగ్‌ను సీజ్ చేసి వ్యాపారి అమర్నాథ్పై సివిల్ సప్లయిస్ యాక్ట్ 6(ఎ) కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త చట్టం ప్రకారం రేషన్ బియ్యం కొనుగోలు చేసినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఆయన వెంట సివిల్ సప్లయిస్ పెద్దవూర డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మణ్, మిర్యాలగూడ ప్రొక్యూర్మెంట్ ఆర్ఐ దీపక్ ఉన్నారు. -
25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చిలుకూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను మండలంలోని బేతవోలు గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ టి. రాము తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని బేతవోలు గ్రామం శివారులో ∙రేషన్ బియ్యంతో వస్తున్న వ్యాన్‌ను పట్టుకున్నట్లుగా తెలిపారు. వ్యాన్‌లో అక్రమంగా 25 క్వింటాళ్ల బియ్యంను తరలిస్తున్నరని తెలిపారు. ఈ విషయంపై విచారణ చేసి పలువురిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం తరలించిన, కొనుగోలు చేసిన, అమ్మినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా ఏవరైనా రేషన్ బియ్యంను తరలిస్తే వెంటనే 94407 00058 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. -
పీడీయస్ బియ్యం పట్టివేత
చిట్యాల : మండలంలోని వట్టిమర్తి శివారులో పీడీయస్ బియ్యం లోడుతో వెళ్తున్న వాహనాన్ని శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్ఐ ఏ.శివకుమార్ తెలిపారు. వివిధ గ్రామాల నుంచి సేకరించిన 25 క్వింటాళ్ల పీడీయస్ బియ్యంను మండలంలోని పెద్దకాపర్తి శివారులోని కోళ్ల ఫారాలకు అందజేసేందుకు వెళ్తుండగా మండలంలోని వట్టిమర్తి శివారులో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పంచానామ నిర్వహించి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
మిల్లర్ల గిల్లుడు
* సర్కారుకు రూ.500 కోట్ల విలువైన బియ్యం బకాయి * ధాన్యం అట్టిపెట్టుకొని బయట అడ్డగోలు వ్యాపారం * రేషన్ బియ్యానికి ఏర్పడుతున్న కొరత * దాంతో మళ్లీ అదే మిల్లర్ల వద్దే కొంటున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్ల మాయాజాలానికి ప్రభుత్వం చిత్తవుతోంది. అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుతో పౌరసరఫరాల శాఖ కుదేలవుతోంది. చివరకు ప్రజా పంపిణీ (పీడీఎస్) ద్వారా అందించే రేషన్ బియ్యం కోసం అదనపు భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమ్ మిల్లింగ్ ద్వారా మిల్లర్ల నుంచి రావాల్సిన బియ్యాన్ని రాబట్టుకోలేక చేతులెత్తేసిన పౌరసరఫరాల శాఖ.. రేషన్ బియ్యానికి కొరత ఏర్పడితే మళ్లీ మిల్లర్ల దగ్గరే కొనుగోలు చేస్తోంది. ఈ శాఖలోని అధికారుల పుణ్యమాని మిల్లర్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. కొందరు అధికారులు.. కేసులున్న మిల్లర్లకు, డిఫాల్టర్లకు సీఎంఆర్ (క స్టమ్ మిల్లింగ్ రైస్) అప్పజెప్పారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం వల్ల మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యంతో బయట అడ్డగోలు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదీ కథ! 2015-16 సంవత్సరానికిగాను 23 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించింది. ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తై మరో ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా ఇప్పటి దాకా మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 14 లక్షల టన్నుల బియ్యమే అందింది. ఇంకా 1.81 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే పెండింగ్‌లో ఉంది. ఏళ్లకు ఏళ్లుగా శాఖలో పాతుకు పోయిన కొందరు అధికారులు, జిల్లా స్థాయిలో కొందరు డీఎస్వోలు, డీఎంలు మిల్లర్లకు సహకరిస్తున్నారన్న ఆరోపణ లు ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వానికి ఇంకా రూ.500 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి అందాల్సి ఉంది. మిల్లర్ల వద్ద ఇంత పెద్దమొత్తంలో బియ్యం ఆగిపోవడంతో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం తిరిగి అదే మిల్లర్లకు డబ్బులు చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఇలా 16 వేల టన్నుల బియ్యం కొనుగోలు చేసింది. వాస్తవానికి కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించే బియ్యం పీడీఎస్ అవసరాలకు సరిపోవు. కచ్చితంగా బియ్యం కొనుగోలు చేయాలి. కాకపోతే ప్రభుత్వానికి రావాల్సిన 1.81 లక్షల టన్నుల బియ్యం రాక పోవడంతో కొనుగోలు తప్పలేదంటున్నారు. పరిస్థితిని మార్చేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న అధికారులతో పూర్తిస్థాయిలో సమీక్ష జరపనున్నారు. బకాయిలే బకాయిలు.. హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాల్లోని మిల్లర్లకు ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ బాధ్యతను అప్పజెప్పింది. 2015-16 సంవత్సరానికి గాను ఖరీఫ్, రబీ సీజన్లలో వీరికి ధాన్యం అప్పజెప్పగా పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలను తమ వద్దే అట్టిపెట్టుకున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్ల నుంచి రూ.159 కోట్ల విలువైన 60 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.110 కోట్లు విలువ చేసే 41 వేల టన్నులకుపైగా బియ్యం అందా ల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.80.55 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.50 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.38 కోట్లు, రంగారెడ్డి, మెదక్‌లో ఒక్కో జిల్లాలో రూ.23 కోట్లు, నిజామాబాద్‌లో రూ.13.50 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.5.14 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉంది. ఇవిగో అక్రమాలు అర్హతలేని, పలు కేసుల్లో సీజ్ అయిన మిల్లులకు, చివరకు విద్యుత్ కనెక్షన్ కూడా లేని మిల్లుల కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం అప్పజెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కొద్ది రోజుల కిందటే బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి.ఆనంద్ సీఎంఆర్ బకాయిలపై దృష్టి పెట్టా రు. ఆయన నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో చేసిన దాడులు అక్రమాలు బయటపడ్డాయి. ఈ మిల్లులన్నీ కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో బయట వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడైంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్ మిల్లులో రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని సీజ్ చేశారు. శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ మిల్లులో రూ.2.80 కోట్ల విలువైన ధాన్యాన్ని పట్టుకున్నారు. గతేడాది కడ్తాల్‌లోని వరలక్ష్మీ రైస్ మిల్లును సీజ్ చేశారు. అయినా ఆ మిల్లుకు అధికారులు ధాన్యం అప్పగించారు. దేవరకద్రలో మహాలక్ష్మి మిల్లులో సైతం రూ.74 లక్షల విలువైన ధాన్యం పట్టుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు తమకు గడువు ఇచ్చిందని, ఈ నెలాఖరులోగా పెండింగులో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ ‘సాక్షి’కి చెప్పారు. -
750కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
దామరచర్ల దామరచర్ల మండలం వాడపల్లి లారీ యార్డు దగ్గర పోలీస్‌లు శనివారం 750 కిలోల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. దామరచర్ల మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఈ బియాన్ని ఆంధ్రాప్రాంతం వైపు ఆటోల్లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు వాడపల్లి ఎస్.ఐ చరమందరాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘పప్పు’లేని మెతుకు నూనెకు నోచుకోని బతుకు
♦ 5 నెలలుగా అందని కందిపప్పు ♦ ఏడాదిన్నరగా నిలిచిపోయిన పామాయిల్ ♦ నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ ♦ నెలల తరబడి అందని సరుకులు ♦ జిల్లాలో 7.79 లక్షల ఆహారభద్రత కార్డులు ♦ బహిరంగ మార్కెట్లో మండుతున్న ధరలు ♦ బియ్యం, చక్కెర, గోధుమలతోనే సరి జోగిపేట: బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు కొని తినలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీపై నిత్యావసర వస్తువులను అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. సరఫరాను బియ్యం, చక్కెర, గోధుమలకే పరిమితం చేసింది. నిల్వలు లేవని గతంలో పసుపు, ఉప్పు, కారం, పామాయిల్, గోధుమ పిండి, చింతపండు సరఫరాలను నిలిపివేసిన ప్రభుత్వం 5 నెలలుగా కందిపప్పును కూడా ఆపేసింది. దీంతో నిత్యావసర వస్తువులు మార్కెట్లో కొనలేక లబ్ధిదారులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. కరువుతో అల్లాడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై కనికరం చూపాల్సిన ప్రభుత్వం కనీసం పప్పు మెతుకులకు నోచుకోకుండా చేసిందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలలో 7.79 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా బియ్యంతో పాటు గోధుమలు పంపిణీ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఈ వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంతగా పెరిగిపోవడంత ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. కానీ నిల్వలు లేవని గడిచిన 5 నెలలుగా కందిపప్పు సరఫరా నిలిపేసింది. కొన్ని సార్లు కార్డుకు అరకిలో ఇచ్చే చక్కెరను కూడా పంపిణీ చేయలేకపోతున్నారు. తొమ్మిది వస్తువులకు మంగళం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.185కే 9 నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందించారు. రూ.40 కి పామాయిల్, రూ.50కి కందిపప్పు, రూ.10 పసుపు, రూ.7 గోధుమలు, రూ.5కు ఉప్పు, రూ.6.75కు చక్కెర, రూ.30కి చింతపండు, రూ.20కి కారం, రూ.16.50కి గోధుమ పిండిని పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బియ్యం కోటా లబ్దిదారుడికి రూ.4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచి సంతోషపెట్టారు. కానీ తొమ్మిది నిత్యావసర వస్తువుల సంఖ్యను తగ్గించారు. ఉప్పుకారం, గోధుమ పిండి, పసుపు, చింతపండు, పామాయిల్ సరఫరా గత ఏడాది నుంచి నిలిపివేశారు. ఐదు మాసాల క్రితం కంది పప్పును నిలిపివే సారు. కందిపప్పు, చక్కెర ధరలతో అవస్థలు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.120 నుంచి రూ.150కి పెరిగింది. చౌకధర దుకాణాలలో కిలో రూ.50కేల దొరికేది. చక్కెర కిలో రూ.40 పలుకుతుంది. చౌకధరల దుకాణంలో రూ.14కు వచ్చేది ఈ పరిస్థితిలో ఈ రెండు వస్తువులు చౌక ధరల దుకాణాల్లో లేకపోవడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. తొమ్మిది వస్తువులను పునరుద్ధరించాలి గతంలో చౌక ధరల దుకాణం ద్వారా రూ.185కే తొమ్మిది వస్తువులు ఇచ్చే వారు. ప్రస్తుతం బియ్యం, గోధుమలు, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కంది పప్పు నిలిచిపోవడంతో చాలా కష్టంగా ఉంది. గతంలో పామాయిల్, కందిపప్పులను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేవారు. తిరిగి నిలిపివేసిన వస్తువులన్నింటిని పంపిణీ చేసి ఆదుకోవాలి. పేద ప్రజలు పండుగలు చేసుకోవాలంటేనే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. - లక్ష్మి, రాంసానిపల్లి పామాయిల్, కందిపప్పు సరఫరా లేదు రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు తగ్గిన మాట వాస్తవమే. ప్రస్తుతం చక్కెర, బియ్యం, గోధుమలు, గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 7 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులున్నాయి. గత సంవత్సరం నుంచి పామాయిల్‌ను సరఫరా చేయడం లేదు. కొన్ని నెలలుగా కంది పప్పు కూడా రాకపోవడంతో దుకాణాలల్లో పంపిణీ చేయలేకపోతున్నాం. పామాయిల్‌కు బదులుగా వేరే ఆయిల్‌ను పంపిణీ చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. పేదలకు అవసరమయ్యే బియ్యం విషయంలో మాత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అనురాధ, డీఎస్ఓ సంగారెడ్డి -
వచ్చింది 'ఆధారం'.. మిగిల్చింది కోట్ల ఆదాయం!
ఆధార్ కార్డులను గుర్తింపు కార్డులుగా ఆమోదించడం మొదలయ్యాక వేల కోట్లలో ప్రభుత్వ నిధులు ఆదా అవుతున్నాయి. గతంలో ఆయా శాఖల కింద పెట్టిన ఖర్చులతో పోల్చితే గత చట్టాల్లోని డొల్లతనం బయటపడుతోంది. పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖకు చెందిన నిధుల్లో ఆధార్ అమలు తర్వాత రూ.14,672 కోట్ల మిగులు కనిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల్లోని ప్రజా పంపిణీ వ్యవస్థలో రూ.2,346కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్‌ల్లో స్కాలర్‌షిప్‌ల్లో రూ.276 కోట్లు, జాతీయ సామాజిక ప్రోత్సహం కింద జార్ఖండ్, చండీఘడ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు కేటాయించిన నిధుల్లో రూ. 66 కోట్లు మిగిలాయి. -
జీపీఎస్‌తో ప్రతీ బియ్యం గింజకూ లెక్క!
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరిపేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. సరుకుల రవాణా, పంపిణీలో అక్రమాలు, దారి మళ్లింపులకు ఇకపై అడ్డుకట్ట వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) వ్యవస్థను ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చి ఎక్కడా అవకతవకలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. కొత్త విధానం అమలు ద్వారా ప్రజాధనం సక్రమ నిర్వహణ సాధ్యమని పౌరసరఫరాల శాఖ స్పష్టంచేస్తోంది. ప్రతీ బియ్యం గింజా లబ్ధిదారునికి చేరేలా లెక్కతేలుతుందని చెప్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పీడీఎస్ వ్యవస్థ అంతా మ్యాన్యువల్‌గా జరుగుతుండటంతో కింది నుంచి పైస్థాయి వరకు అనేక అక్రమాలు జరుగుతున్నాయి. స్టాక్ పాయింట్ మొదలు, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ వరకు వివిధ స్థాయిల్లో అధికారులు, డీలర్లు చేతివాటం చూపడంతో రూ.కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం జరిగింది. దీనికి తోడు కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి మండల్ లెవల్ స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యం సహా ఇతర సరుకుల్లో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయి. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ల వరకు సరఫరా చేస్తున్న బియ్యంలో 10శాతం బియ్యం పక్కదారి పడుతుండగా, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు రవాణా చేసే సమయంలో మరో 15శాతం అక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు సరుకుల సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దీని ద్వారా వాహనం ఎక్కడ ఉన్నది, ఏ దారిలో ప్రయాణిస్తున్నది అధికారులు తెలుసుకోవచ్చు. ఎక్కడైనా వాహనాన్ని ఆపినా ఆ వివరాలు తెలిసిపోతాయి. సరుకు రవాణా చేసే వాహన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మార్వో స్థాయి మొదలు కింది స్థాయి అధికారి, చివరికి డీలర్, గ్రామ ఆహార సంఘం సభ్యుడు వరకు చేరేలా ఎస్ఎంఎస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం పక్కాగా ఉండి అక్రమాలకు చెక్‌పడుతుంది. ఈ వ్యవస్థ అమలుకు వీలుగా రాష్ట్రంలోని 177 మండల స్థాయి స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న కంప్యూటర్లకు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. జిల్లాల అధికారులకు సైతం దీనిపై అవగాహన కల్పిస్తారు. -
జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
240 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 240 బస్తాల రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బస్తాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పసిబిడ్డల బియ్యమూ మింగేశారు!
పక్కదారి పడుతున్న అంగన్వాడీ బియ్యం రెచ్చిపోతున్న కాంట్రాక్టర్లు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ పిల్లలు, గర్భిణులకు అందే పౌష్టికాహారంలో భారీ కోత సాక్షి ప్రతినిధి, తిరుపతి: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులు పక్కదారి పడుతున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు సరఫరా చేసే బియ్యంలో భారీగా నొక్కేస్తున్నారు. 50 కిలోల బస్తాకు సరాసరి 38 కిలోల నుంచి 40 కిలోలు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్నాయని కొంత మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అవినీతిలో ముఖ్యంగా రెవెన్యూ, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కందిపప్పు, నూనెలో సైతం అంగన్వాడీ కేంద్రాలకు చేరేసరికి పరిమాణం తగ్గిపోతున్నట్లు సమాచారం. దీంతో అంగవాడీ కార్యకర్తలు ఏమీ చేయలేక పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారంలో కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడంతోనే ప్రభుత్వం నిర్థేశించిన పరిమాణంలో పౌష్టికాహారం అందటం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. సరుకుల్లో కోత అంగన్వాడీలకు సరఫరా అయ్యే బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ, నూనెను ఏపీ ఆయిల్‌ఫెడ్, కందిపప్పును ట్రేడర్స్, కోడిగుడ్లు, పాలను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. కాగా కాంట్రాక్టర్లతో ఆయా ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కు కావడంతో సరుకుల సరఫరాలో తేడాలున్న పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బియ్యం సరఫరాలోనే భారీగా తూకాల్లో తేడా వస్తున్నట్లు అంగవాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు, నూనె సరఫరాలో సైతం అధికారులతో కుమ్మకై కొన్నిచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పర్సెంటేజీల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి అధికారులు దండుకుంటున్నట్లు కింది స్ధాయి సిబ్బందిలో సైతం చర్చ సాగుతోంది. మొత్తం మీద అంగన్వాడీ కేంద్రాలకే సరుకులు తక్కువ పరిమాణంలో చేరటంలో, కింది స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించడంలో విఫలమవుతున్నారు. మధ్యాహ్నాం బాలింతలు, గర్భిణులకు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనెతో అన్నం, ఆకుకూర పప్పు రోజువారీ వడ్డించాలి. 200 గ్రాముల పాలు, వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. పిల్లలకు 75 గ్రాముల బియ్యం, 16 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనెతో వంట చేసి వడ్డించాలి. సరుకుల్లో కోతతో వీటిని తక్కువ పరిమాణంలో అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చిన్న గొట్టిగల్లు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమైన ఆర్డీడీ శారద, పీడీ విజయలక్ష్మి సమక్షంలోనే సరుకుల్లో తగ్గుదలపై కొంత మంది కార్యకర్తలు నిలదీసినట్లు సమాచారం. ఆ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
సాక్షి,హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాయితీ రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అక్రమాలకు అలవాటుపడ్డ రేషన్ డీలర్లు, అధికారులు అర్హులకు దక్కాల్సిన బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల్లో 15 నుంచి 20శాతం వరకు పక్కదారి పడుతుండగా ఇందులో బియ్యం అక్రమాల విలువే రూ.150 కోట్ల వరకు ఉంటోంది. అందులోనూ ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏకంగా రూ.15 నుంచి రూ.20 కోట్ల బియాన్ని అక్రమార్కులు భోంచేస్తున్నట్లుగా ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అక్రమ వ్యాపారులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. బోగస్ డీలర్ల వద్ద కొనుగోలు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆహార భద్రతా పథకం కింద ప్రభుత్వం 2.83 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. మొత్తంగా ఏటా 18 లక్షల టన్నుల బియ్యాన్ని ఈ పథకం కింద సరఫరా చేస్తుండగా దీనికోసం రూ.2,200 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల నిర్వహణ అధికశాతం బోగస్ డీలర్ల చేతిలోకి వెళ్లడం, నకిలీకార్డులు భారీగా చెలామణిలో ఉండటంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న బియ్యంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పలువురు డీలర్లు రూ. 6 నుంచి రూ.10కి అక్రమ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. అక్రమ వ్యాపారులు దాన్ని రీసైక్లింగ్ చేసి రూ.15 నుంచి రూ.20కి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో కొందరు రైస్ మిల్లర్ల ప్రమేయం సైతం ఉందని అధికార వర్గాలు గుర్తించాయి. అక్రమ వ్యాపారం విలువ రూ.150 కోట్లు! ప్రస్తుతం నిఘా వర్గాలు చెబుతున్న మేరకు ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏటా 6వేల నుంచి 10వేల టన్నుల బియ్యం పక్కదారి పడుతోం దని, దాని విలువ సుమారు రూ.15 నుంచి రూ.20కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దందా విలువ రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అక్రమాల్లో డీలర్ల పాత్రే ఎక్కువగా ఉండటంతో ఇటీవల జంటనగరాల పరిధిలో విసృ్తత తనిఖీలు మొదలుపెట్టారు. ఒక్క రంగారెడ్డిలోనే మొత్తంగా 185 కేసులు 6(ఏ) కింద నమోదవగా, మరో 30 క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో మరింత కఠినం గా వ్యవహరించాలని, పోలీసులతో కలసి ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్లతో దాడులు నిర్వహించి పీడీ యాక్టు కేసులను మరింత మందిపై ప్రయోగించాలని ప్రభుత్వం భావి స్తోంది. దీంతో పాటే జీపీఎస్, ఈ-పాస్ వ్యవస్థను విసృ్తత పరచాలని యోచిస్తోంది. పీడీఎస్ పర్యవేక్షణకు విజిలెన్స్ కమిటీలు సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల పంపిణీ, ఆహార భద్రతాచట్టం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర స్థాయిలోని విజిలెన్స్ కమిటీకి సంబంధిత శాఖ మంత్రి చైర్మన్‌గా, కమిషనర్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, పంచాయతీరాజ్, వ్యవసాయ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు మరో పది విభాగాల నుంచి అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా కమిటీలకు కలెక్టర్, మండలస్థాయిలో ఆర్డీవో, గ్రామస్థాయిలో సర్పంచ్, మున్సిపల్ పరిధి లో జాయింట్ కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరుకుల లభ్యత, కేటాయింపు, పంపిణీ, ఫిర్యాదులు, కొత్త కార్డులజారీ, బోగస్ కార్డుల తొలగింపు అంశాలపై కమిటీలు పర్యవేక్షిస్తాయి. -
ఎఫ్‌సీఐ పునర్నిర్మాణంపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ప్రజా పంపిణీ పథకం(పీడీఎస్) అమలులో కీలకపాత్ర పోషించే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పునర్నిర్మాణంపై తగిన సూచనలు చేసేందుకు 8మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పనితీరు, వ్యయం పరంగా ఎఫ్‌సీఐలో ఉన్న లోపాలను తొలగించే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చే సినట్టు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. పార్లమెంటు సభ్యుడు శాంతకుమార్ అధ్యక్షుడిగా ఎఫ్‌సీఐ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సీ విశ్వనాథ్, వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ, ఎలెక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి రామ్ సేవక్ శర్మ, పంజాబ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, అహ్మదాబాద్ ఐఐఎంకు చెందిన జీ రఘురామ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన జీ నాంచారయ్య తదితరులు కమిటీ సభ్యులుగా ఉంటారు. కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీ, ఆహార భద్రత తదితర అంశాలపై ఎఫ్‌సీఐ మరింత క్రియాశీలకంగా నిర్వహించవలసిన పాత్రను గురించి ఈ కమిటీ సూచనలు చేస్తుంది. కమిటీ మూడు నెలల్లోగా తన నివేదిక సమర్పించవలసి ఉంటుంది. -
మిల్లింగ్ ‘కష్టం’
తాడేపల్లిగూడెం : బియ్యం సేకరణపై నెలకొన్న సందిగ్ధత వీడింది. లెవీ పేరిట ప్రభుత్వం సేకరిస్తున్న బియ్యూనికి సంబంధించి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్‌సీఐ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ముగిసేలోగా దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. పౌర సరఫరాల వ్యవస్థ (పీడీఎస్) అవసరాల కోసం సేకరించే బియ్యూన్ని ఇకపై ఎఫ్‌సీఐ నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకునే విధంగా నూతన లెవీ విధానం ఖరారైంది. రేషన్ కార్డులు, విపత్తుల సందర్భంలో ప్రజలకు సరఫరా చేసేందుకు అవసరమైన బియ్యూన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐపైనే ఆధారపడింది. పాత పద్ధతిలో రైస్‌మిల్లర్లు రైతులనుంచి ధాన్యాన్ని సేకరించేవారు. ఆ మొత్తం ధాన్యాన్ని ఆడగా వచ్చిన బియ్యంలో 75శాతాన్ని ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో విక్రయిం చేవారు. మిగిలిన 25శాతం బియ్యూన్ని బహిరంగ మార్కెట్లో విక్రరుుం చుకోవడం లేదా ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. నూతన లెవీ విధా నం ద్వారా ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి పలకబోతోంది. ఇకపై రైతుల నుంచి 75 శాతం ధాన్యం కొనే బాధ్యతను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ చేపడతారుు. ఇందుకోసం ఐకేపీ గ్రూపులు, వ్యవసాయ శాఖ, మరీ అవసరమైతే ఎఫ్‌సీఐ రంగంలోకి దిగుతాయి. సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడిస్తారు. బియ్యం ఆడినందుకు క్వింటాల్‌కు ఇంత అని మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తుంది. పౌర సరఫరాల వ్యవస్థ అవసరాలకు సరిపోగా మిగిలిన బియ్యూన్ని ఇతర ప్రాంతాలకు చేరేవేసే బాధ్యతను ప్రభుత్వమే చూస్తుంది. ఈ విధానం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అమలవుతోంది. మిల్లర్ల పాత్ర ఇక పరిమితమే ఇప్పటివరకూ ధాన్యం సేకరించి.. బియ్యం ఆడించే పని మిల్లర్ల ద్వారానే సాగుతోంది. కొత్త లెవీ విధానం అమల్లోకి వస్తే మిల్లర్ల పాత్ర పరిమితమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ పాత్ర పెరుగుతుంది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ కలిసి మొత్తం పంటలో 75శాతం ధాన్నాన్ని రైతుల నుంచి నేరుగా కొనాలి. మిగిలిన 25 శాతం ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనుగోలు చేయూల్సి ఉంటుంది. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తాము తప్పుకుంటే రైతులకు ఇబ్బందులు తప్పవనే వాదనలు మిల్లర్ల నుంచి వినిపిస్తున్నారుు. రైతులకు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నారుు. ఈ దృష్ట్యా 50 శాతం మిల్లర్లు, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సేకరించేలా అనుమతించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు. అక్టోబర్ 1నుంచి కొత్త ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ మొదలు కానుండగా, ఆలోగా కేంద్రం స్పందిస్తే మిల్లర్లు, ప్రభుత్వం 50 : 50 దామాషాలో ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉంటుందని, లేదంటే 75 : 25 శాతం దామాషాలో ధాన్యం సేకరణ ఉంటుందని చెబుతున్నారు. అంటే 75 శాతం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ సేకరిస్తే మిగిలిన 25 శాతం ధాన్యాన్ని మిల్లర్లు సేకరించుకునే వెసులుబాటు ఇస్తారు. -
మధ్యాహ్నం...అధ్వాన్నం
ఉడికీ ఉడకని బియ్యం....నాసిరకమైన కూరగాయలు వెరసి మధ్యాహ్నభోజనం అధ్వానంగా తయారవుతోంది. బుధవారం తాటికల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో భోజనం చేసిన 40మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. శనివారం నాటికి ఇలాంటి ఘటన మరో రెండు పాఠశాలల్లో చోటుచేసుకుంది. అయిటిపాముల, బీమారం పాఠశాలల్లో 74 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్కారు మధ్యా హ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా వ్యాప్తంగా 3,301 పాఠశాలల్లో 3.16లక్షల మంది విద్యార్థుల కోసం 6,400 మంది మహిళలు మధ్యాహ్న భోజనాన్ని వండిపెడుతున్నారు. అయి తే అధికారుల పర్యవేక్షణ సరిగ్గాలేక ఈ పథకం జిల్లా వ్యాప్తంగా అధ్వానంగా మారింది. జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి ఇటీవల తాటికల్, భీమారం, అయిటిపాములలో సుమారు 113 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆదేశాలు బేఖాతర్ మధ్యాహ్నభోజన పథకంలో మహిళా సంఘాల వారు మెనూ సక్రమంగా పాటించడం లేదు. వారంలో మూడు రోజుల పాటు పప్పు వండి పెట్టాలని ఆదేశాలున్నాయి. అయినా మార్కెట్లో పప్పులకు ఎక్కువ ధరలు ఉండటంతో ఒక్కరోజు పప్పు వండిపెట్టి మమ అనిపిస్తున్నారు. అదే విధంగా వారంలో రెండు కోడిగుడ్లు పెట్టాల్సి ఉన్నా కనీసం ఒక్కరోజు కూడా ఇవ్వడం లేదు. వర్షాల కాలంలో ఆకు కూరలు వండి పెట్టవద్దని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేసినా మహిళా సంఘాల వారు పట్టించుకోవడంలేదు. కొన్ని చోట్ల ఆకుకూరలతో భోజనం పెడుతున్నారు. దాంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. పీడీఎస్ బియ్యంతోనే వంట మధ్యాహ్న భోజనం కోసం రేషన్ డీలర్లకు ప్రత్యేకంగా ఎఫ్ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) బియ్యం అందిస్తున్నారు. కానీ వారు మాత్రం పాఠశాలల ఏజెన్సీలకు వాటిని సరఫరా చేయడంలేదు. దీంతో మహిళా సంఘాల వారు పీడీఎస్ బియ్యాన్నే మధ్యాహ్న భోజనం కోసం వినియోగిస్తున్నారు. ఈ బియ్యం ఉడికీఉడకక ముద్దగా మారుతోంది. ఇలాంటి భోజనాన్ని విద్యార్థులు తినలేకపోతున్నారు. భోజనాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పని సరిగా రుచి చూడాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారితో పాటు పాఠశాల విద్యా కమిటీలు సైతం రుచి చూడాల్సి ఉంది. కానీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీల చైర్మన్లు కూడా మధ్యాహ్నభోజనాన్ని రుచి చూడటం లేదు. దాంతో మధ్యాహ్నభోజనం వండే ఏజెన్సీలది ఇష్టారాజ్యంగా మారింది.