అలర్ట్! భారీగా తమిళనాడు ప్రజల డేటా హ్యాక్ | Tamil Nadu PDS Data of Nearly 50 Lakh Users Breached: Cybersecurity Firm | Sakshi
Sakshi News home page

50 లక్షల మంది తమిళనాడు ప్రజల డేటా హ్యాక్!

Published Wed, Jun 30 2021 9:17 PM | Last Updated on Wed, Jun 30 2021 9:53 PM

Tamil Nadu PDS Data of Nearly 50 Lakh Users Breached: Cybersecurity Firm - Sakshi

తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్) డేటా దొంగలించబడింది. దాదాపు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాను హ్యాకర్ ఫోరంలో అప్ లోడ్ చేసినట్లు బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ టెక్నిశాంక్ తెలిపింది. లీక్ చేయబడ్డ డేటాలో ఆధార్ నెంబర్లు అదేవిధంగా లబ్ధిదారుల సున్నితమైన వివరాలు, వారి కుటుంబ సమాచారం, మొబైల్ నెంబర్లతో సహా ఉన్నాయి. హ్యాకర్లు ఫిషింగ్ దాడుల కోసం ఈ లీక్ చేసిన డేటాను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలోని పెద్ద వ్యక్తుల నుంచి నిస్సహాయ ప్రజలను సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. 

అయితే, డేటా హ్యాక్ కావడంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బహిరంగంగా ధృవీకరించలేదు. డార్క్ వెబ్ లో లీక్ అయిన డేటాలో తమిళనాడులో మొత్తం 49,19,668 మంది సమాచారం ఉందని సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ తెలిపింది. దీనిలో 3,59,485 ఫోన్ నంబర్లతో ప్రభావిత వినియోగదారుల చిరునామాలు, ఆధార్ నంబర్ల కూడా ఉన్నట్లు ఉంది. లీక్ డ్ డేటా ఫీల్డ్ లలో నవజాత శిశువులతో సహా పౌరులందరి డేటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మక్కల్ నంబర్' కూడా ఉన్నట్లు పేర్కొంది. హ్యాక్ అయిన డేటాలో లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మొదట ది వీక్ నివేదించింది.

తమిళనాడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వెబ్ సైట్ లేదా ఎక్కడి నుంచి డేటా హ్యాక్ అయ్యింది అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. తమిళనాడు పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ విభాగం పోర్టల్ లో డ్యాష్ బోర్డ్ పీడీఎస్ వ్యవస్థ కోసం 6.8 కోట్లకు పైగా రిజిస్టర్డ్ లబ్ధిదారులు ఉన్నట్లు చూపిస్తుంది. బెంగళూరుకు చెందిన టెక్నిశాంక్ట్ సీఈఓ నందకిశోర్ హరికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. లీక్ అయిన డేటాను జూన్ 28న అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ డేటాను కనుగొన్న కొద్దిసేపటికే ఈ హ్యాక్ అయిన డేటా గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు టెక్నిశాంక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. 

హ్యాక్ అయిన వివరాలకు సంబంధించి తమిళనాడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబర్ స్పందించి, నివేదికను దర్యాప్తు కోసం ఫార్వర్డ్ చేసినట్లు ధృవీకరించినట్లు హరికుమార్ చెప్పారు. తమిళనాడు పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ విభాగం (tnpds.gov.in) వెబ్ సైట్ సైబర్ దాడికి గురైనట్లు, "1945వీఎన్" అనే సైబర్ క్రిమినల్ గ్రూప్ హ్యాక్ చేసినట్లు టెక్నిశాంక్ట్ పేర్కొంది. గత డిసెంబర్ లో గాడ్జెట్స్ 360 తెలంగాణ ప్రభుత్వ సైట్ లో ఒక లోపం ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపం వల్ల ఉద్యోగుల, పెన్షనర్ల సున్నితమైన డేటాను బహిర్గతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై స్పందించిన ట్విటర్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement