Dark Web marketplace
-
Netflix Alert: మీకు నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉందా?
అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా మారిన డార్క్ వెబ్‌లో భారతీయుల వినియోగించే అమెజాన్ ఓటీటీ ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాటు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీ కార్డులను విచ్చల విడిగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అనుమానిత పాకిస్తాన్ హ్యాకర్ దాదాపు 5 వేల మంది భారత పౌరుల డేటాను డార్క్ వెబ్‌లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. హ్యాకర్ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానెల్‌లలో భారత పౌరుల ఐడెంటిటి కార్డులను విక్రయించడమే కాకుండా ఫోరమ్‌లలోని సమాచారాన్ని బహిరంగంగా లీక్ చేశాడు. దీంతో వేలాది భారతీయులు సైబర్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు తెలిపాయి. నిందితుడు డార్క్ వెబ్‌లోని పాకిస్తాన్ ఫోరమ్‌లో దేశీయ సమాచారాన్ని షేర్ చేశాడు. డేటాను అమ్మేందుకు కొనుగోలు దారులతో ఉర్దూలో సంభాషించాడని, సదరు నేరస్తుడి ప్రొఫైల్‌లో పాకిస్తాన్ జెండా ఉందని ఇంటెలిజెన్స్ నిపుణులు గుర్తించారు. ఆ హ్యాకర్ తీరును రోజుల తరబడి ట్రాక్ చేసిన తర్వాత భారత్‌కు చెందిన ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థల డేటా సైతం సేకరించినట్లు తేలింది. ఈ లీక్ గురించి హ్యాకర్ సీఈఆర్టీ -ఇన్, యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్‌ను కూడా హెచ్చరించినట్లు వెల్లడైంది. డేటాను సేకరించిన హ్యాకర్ డార్క్ వెబ్‌లో అదనంగా 4వేల ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు,డ్రైవింగ్ లైసెన్స్‌లు బహిరంగంగా లీక్ అయినట్లు నివేదిక సూచిస్తుంది. అదే వ్యక్తి పాస్‌వర్డ్‌లతో సహా పెద్ద సంఖ్యలో నెట్‌ఫ్లిక్స్ ఖాతా వివరాలను, అంతర్జాతీయ గుర్తింపు పత్రాలను కూడా ఈ డార్క్ వెబ్‌లో షేర్ చేసిన దర్యాప్తులో వెల్లడైంది. -
అలర్ట్! భారీగా తమిళనాడు ప్రజల డేటా హ్యాక్
తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్) డేటా దొంగలించబడింది. దాదాపు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాను హ్యాకర్ ఫోరంలో అప్ లోడ్ చేసినట్లు బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ టెక్నిశాంక్ తెలిపింది. లీక్ చేయబడ్డ డేటాలో ఆధార్ నెంబర్లు అదేవిధంగా లబ్ధిదారుల సున్నితమైన వివరాలు, వారి కుటుంబ సమాచారం, మొబైల్ నెంబర్లతో సహా ఉన్నాయి. హ్యాకర్లు ఫిషింగ్ దాడుల కోసం ఈ లీక్ చేసిన డేటాను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలోని పెద్ద వ్యక్తుల నుంచి నిస్సహాయ ప్రజలను సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే, డేటా హ్యాక్ కావడంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బహిరంగంగా ధృవీకరించలేదు. డార్క్ వెబ్ లో లీక్ అయిన డేటాలో తమిళనాడులో మొత్తం 49,19,668 మంది సమాచారం ఉందని సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ తెలిపింది. దీనిలో 3,59,485 ఫోన్ నంబర్లతో ప్రభావిత వినియోగదారుల చిరునామాలు, ఆధార్ నంబర్ల కూడా ఉన్నట్లు ఉంది. లీక్ డ్ డేటా ఫీల్డ్ లలో నవజాత శిశువులతో సహా పౌరులందరి డేటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మక్కల్ నంబర్' కూడా ఉన్నట్లు పేర్కొంది. హ్యాక్ అయిన డేటాలో లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మొదట ది వీక్ నివేదించింది. తమిళనాడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వెబ్ సైట్ లేదా ఎక్కడి నుంచి డేటా హ్యాక్ అయ్యింది అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. తమిళనాడు పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ విభాగం పోర్టల్ లో డ్యాష్ బోర్డ్ పీడీఎస్ వ్యవస్థ కోసం 6.8 కోట్లకు పైగా రిజిస్టర్డ్ లబ్ధిదారులు ఉన్నట్లు చూపిస్తుంది. బెంగళూరుకు చెందిన టెక్నిశాంక్ట్ సీఈఓ నందకిశోర్ హరికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. లీక్ అయిన డేటాను జూన్ 28న అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ డేటాను కనుగొన్న కొద్దిసేపటికే ఈ హ్యాక్ అయిన డేటా గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు టెక్నిశాంక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. హ్యాక్ అయిన వివరాలకు సంబంధించి తమిళనాడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబర్ స్పందించి, నివేదికను దర్యాప్తు కోసం ఫార్వర్డ్ చేసినట్లు ధృవీకరించినట్లు హరికుమార్ చెప్పారు. తమిళనాడు పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ విభాగం (tnpds.gov.in) వెబ్ సైట్ సైబర్ దాడికి గురైనట్లు, "1945వీఎన్" అనే సైబర్ క్రిమినల్ గ్రూప్ హ్యాక్ చేసినట్లు టెక్నిశాంక్ట్ పేర్కొంది. గత డిసెంబర్ లో గాడ్జెట్స్ 360 తెలంగాణ ప్రభుత్వ సైట్ లో ఒక లోపం ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపం వల్ల ఉద్యోగుల, పెన్షనర్ల సున్నితమైన డేటాను బహిర్గతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై స్పందించిన ట్విటర్ -
ఆ కంపెనీ 170లక్షల అకౌంట్లు హ్యాక్
డార్క్ వెబ్ మార్కెట్ ప్లేస్.. దొంగలించిన డ్రగ్స్, ఆయుధాలు, డేటా బేస్, నకిలీ డాక్యుమెంట్ల విక్రయానికి ఇదే అడ్డా. ఈ అడ్డా వలలో ఇప్పుడు దేశీయ అతిపెద్ద ఆన్ లైన్ రెస్టారెంట్ గైడ్ జోమాటో చిక్కుకుంది. జోమాటోకు చెందిన 170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్లు డార్క్ వెబ్ లో అమ్మకానికి వచ్చినట్టు సెక్యురిటీ బ్లాక్ హ్యాక్ రీడ్ రిపోర్టు చేసింది.. ఈ డేటా బేస్ లో రిజిస్ట్రర్డ్ జోమాటో యూజర్ల ఈ-మెయిల్స్, పాస్ వర్డ్ లు ఉన్నాయి. దొంగలించిన డేటా జుమాటోకి చెందినదేనని నిరూపించడానికి నమూనా డేటాను కూడా ఆ విక్రయదారుడు షేర్ చేశాడని హ్యాక్ రీడ్ తెలిపింది. దీంతో జోమాటో భద్రతా వైఫల్యాలతో తీవ్ర సతమతమవుతోంది. ఆ డేటా మొత్తాన్ని 1,001.45 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టు చేస్తోంది. అమ్మకందారుడు ఎన్‌క్లే పేరుతో ఈ డేటా డార్క్ వెబ్ లో అమ్మకానికి వచ్చినట్టు తెలిసింది. జోమాటోలో రిజిస్ట్ర్ అయిన ప్రతి కస్టమర్ ఫోన్ నెంబర్, అడ్రస్, ఈ-మెయిల్ ఐడీ వారిదగ్గర ఉంటుంది. ఒకవేళ ఈ హ్యాకింగ్ కనుక నిజమైతే, ఇండియన్ ఐటీ యాక్ట్ సెక్షన్ 43ఏ కింద జోమాటోనే యూజర్ల వ్యక్తిగత డేటాకు బాధ్యత వహించి, పరిహారాలు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ సైబర్ లా, సైబర్ సెక్యురిటీ ఎక్స్ పర్ట్ ప్రశాంత్ మలి చెప్పారు. 20 కి పైగా దేశాల్లో జోమాటో యప్ ను వాడుతున్నారు. నెలకు 90 మిలియన్ కు పైగా యూజర్లు ఈ యాప్ ను వాడుతున్నారు.