మిల్లింగ్ ‘కష్టం’
తాడేపల్లిగూడెం : బియ్యం సేకరణపై నెలకొన్న సందిగ్ధత వీడింది. లెవీ పేరిట ప్రభుత్వం సేకరిస్తున్న బియ్యూనికి సంబంధించి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్‌సీఐ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ముగిసేలోగా దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. పౌర సరఫరాల వ్యవస్థ (పీడీఎస్) అవసరాల కోసం సేకరించే బియ్యూన్ని ఇకపై ఎఫ్‌సీఐ నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకునే విధంగా నూతన లెవీ విధానం ఖరారైంది. రేషన్ కార్డులు, విపత్తుల సందర్భంలో ప్రజలకు సరఫరా చేసేందుకు అవసరమైన బియ్యూన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐపైనే ఆధారపడింది.
పాత పద్ధతిలో రైస్‌మిల్లర్లు రైతులనుంచి ధాన్యాన్ని సేకరించేవారు. ఆ మొత్తం ధాన్యాన్ని ఆడగా వచ్చిన బియ్యంలో 75శాతాన్ని ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో విక్రయిం చేవారు. మిగిలిన 25శాతం బియ్యూన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రరుుం చుకోవడం లేదా ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. నూతన లెవీ విధా నం ద్వారా ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి పలకబోతోంది. ఇకపై రైతుల నుంచి 75 శాతం ధాన్యం కొనే బాధ్యతను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ చేపడతారుు. ఇందుకోసం ఐకేపీ గ్రూపులు, వ్యవసాయ శాఖ, మరీ అవసరమైతే ఎఫ్‌సీఐ రంగంలోకి దిగుతాయి. సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడిస్తారు. బియ్యం ఆడినందుకు క్వింటాల్‌కు ఇంత అని మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తుంది. పౌర సరఫరాల వ్యవస్థ అవసరాలకు సరిపోగా మిగిలిన బియ్యూన్ని ఇతర ప్రాంతాలకు చేరేవేసే బాధ్యతను ప్రభుత్వమే చూస్తుంది. ఈ విధానం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అమలవుతోంది.
మిల్లర్ల పాత్ర ఇక పరిమితమే
ఇప్పటివరకూ ధాన్యం సేకరించి.. బియ్యం ఆడించే పని మిల్లర్ల ద్వారానే సాగుతోంది. కొత్త లెవీ విధానం అమల్లోకి వస్తే మిల్లర్ల పాత్ర పరిమితమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ పాత్ర పెరుగుతుంది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ కలిసి మొత్తం పంటలో 75శాతం ధాన్నాన్ని రైతుల నుంచి నేరుగా కొనాలి. మిగిలిన 25 శాతం ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనుగోలు చేయూల్సి ఉంటుంది. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తాము తప్పుకుంటే రైతులకు ఇబ్బందులు తప్పవనే వాదనలు మిల్లర్ల నుంచి వినిపిస్తున్నారుు. రైతులకు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నారుు.
ఈ దృష్ట్యా 50 శాతం మిల్లర్లు, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సేకరించేలా అనుమతించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు. అక్టోబర్ 1నుంచి కొత్త ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ మొదలు కానుండగా, ఆలోగా కేంద్రం స్పందిస్తే మిల్లర్లు, ప్రభుత్వం 50 : 50 దామాషాలో ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉంటుందని, లేదంటే 75 : 25 శాతం దామాషాలో ధాన్యం సేకరణ ఉంటుందని చెబుతున్నారు. అంటే 75 శాతం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ సేకరిస్తే మిగిలిన 25 శాతం ధాన్యాన్ని మిల్లర్లు సేకరించుకునే వెసులుబాటు ఇస్తారు.