సమస్యల పరిష్కారమే అజెండా
తాడేపల్లిగూడెం /పెంటపాడు :తాడేపల్లిగూడెం పట్టణ సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గూడెంలో బుధవారం ఆయన వార్డు బాట చేపట్టారు. ఒకటో వార్డు గణేష్ నగర్ గుడి నుంచి 4 వార్డు డీఎస్ చెరువు వరకు కాలినడకన పర్యటించారు. 1, 2, 3, 4, వార్డులలో డ్రెయినేజీ, నీటి సరఫరా, లో వోల్టేజ్, పందుల స్వైరవిహారం సమస్యలను, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పలువురు వినతులు అందించారు.
మాణిక్యాలరావు మాట్లాడుతూ సమస్యలను గుర్తించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు.
వీధికుళాయిల వద్ద అధికంగా మహిళలు ఉండటం గమనించిన మంత్రి కుళాయి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు. వేకువజాము 5 గంటలకు వార్డు పర్యటనకు బయలు దేరిన ఆయన ఉదయం 9 గంటల వరకు వార్డులలోనే గడిపారు. మధ్యలో కనిపిం చిన పలు ఆలయాల్లో ఆయన పూజ చేయిం చారు. మునిసిపల్ కమీషనర్ టి.నిరంజన్‌రెడ్డి, తహసిల్దార్ పాశం నాగమణి, దేవాదాయ శాఖ అధికారి కేవీవీ రమణ, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, ఆయా వార్డుల కౌన్సిలర్లు రాంపండు, కొల్లి రమావతి, అడపా జమున, సింగం సుబ్బారావు పాల్గొన్నారు.
బీజేపీలో చేరికలు
తాడేపల్లిగూడెం : దేవాదాయ శాఖ మంత్రి ైపైడికొండల మాణిక్యాలరావు సమక్షంలో బుధవారం పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన వగ్వాల అచ్యుతరామయ్యతోపాటు ఎల్.ప్రకాశరావు, పి.రాంబాబు, తాడేపల్లిగూడెంకు చెందిన కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి మంత్రి ఆహ్వానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ పార్టీ జిల్లాలో బలమైన శక్తిగా తయారవుతోందన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పురాతన ఆలయాలకు ప్రాభవం తీసుకొస్తా ...
తణుకు : పురాతన ఆలయాలను గుర్తించి వాటికి ప్రాభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. బుధవారం తణుకులోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 25వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములు కజ్జాకు గురైనట్లు గుర్తించామన్నారు. వాటిపై కోర్టుల్లో వాజ్యాలుండటంతో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలతో కమిటి వేసి వాటిని పరిష్కరించాలని యోచిస్తున్నట్టు వివరించారు. దేవాదాయ శాఖ ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చటంతోపాటు,
ఆలయాల జమా ఖర్చులన్నీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. భక్తులు ఇచ్చే కానుకలకు ఆలయ అధికారుల జవాబుదారీతోపాటు వాటిని దేనికోసం సమర్పించారో దానికే వినియోగిస్తామన్నారు. దేవాలయ భూముల కౌలు తక్కువుగా ఉన్నచోట పెంచే మార్గాలను అన్వేషిస్తామని ఈ విషయంలో కౌలు రైతుల పట్ల మానవాతా దృక్పథంతో వ్యవహరిస్తామని వివరించారు. దేవాలయాలు వ్యాపార సంస్థలు కావని కౌలు వ్యత్యాసం మరీ ఎక్కువుగా ఉంటేనే పెంచే విషయంపై దృష్టిసారిస్తామన్నారు. దేవాదాయశాఖ పరిధిలోకి రాని ఆలయాల్లోను నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగేలా ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులు, ధార్మిక సంస్థల సహాయం తీసుకుంటామన్నారు.
దేవాదాయ శాఖలో మిగులు సిబ్బంది ఉన్నట్టు గుర్తించామని, వారి సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై చీఫ్ సెక్రటరీతో కమిటీ వేస్తామన్నారు. మానవ సేవే దైవ సేవ అనే రీతిలో పెద్ద ఆలయాలకు అనుబంధంగా వైద్య, విద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దేవాలయ భూముల్లో నిర ్వ హిస్తున్న తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ కళాశాల అంశాన్ని పరిశీలించి తగుచర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాసవర్మ, వీవీఎస్ వర్మ, వైడీ కృష్ణయ్య, మల్లిన రాధాకృష్ణ, శేషాద్రిశాస్త్రి పాల్గొన్నారు.