
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉమ్మడి పొత్తులో ముసలం ఏర్పడింది.
సాక్షి, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉమ్మడి పొత్తులో ముసలం ఏర్పడింది. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకే కేటాయిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడంతో తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోయారు.
నియోజకవర్గ ఇంచార్జి వలవల మల్లిఖార్జున రావు(బాబ్జి) మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం సీటు లేదని అధిష్టానం పొత్తుకు ముందే చెప్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో నాకు నియోజకవర్గ ఇంచార్జి ఇచ్చినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశానని, విలువ లేకుండా చేశారన్నారు. క్రమశిక్షణ ఎక్కువ ఉన్న నియోజకవర్గం మనది. అందుకే మనల్ని లోకువగా చూస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇదీ చదవండి: రఘురామా.. ప్లీజ్ గెటవుట్!