unhappy
-
ప్రపంచంలో సంతోషకరంగా లేని దేశాలివే.. భారత్ స్థానం?
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా గురించి విన్నాం. ప్రతిసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచి సంతోషానికి ప్రతికగా నిలుస్తోంది. మరికొన్ని దేశాలు కొద్ది తేడాలతో సంతోషకరమైన దేశాలుగా మొదటి పదిస్థానాల్లో నిలిచి మరింత ఆనందంగా జీవించేలా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయి. అయితే ఆ సంతోషానికి కనుచూపు మేరలో కూడా లేకుండా తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్న దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల జాబితా, అందుకు గల కారణాలు తోపాటు భారత్ ఏ స్థానంలో ఉందో చూద్దామా..ప్రపంచవ్యాప్తంగా ఆనంద స్థాయిలలో వైవిధ్యాలను నిర్ణయించడానికి ఆరు కీలక అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది ప్రపంచ సంతోష నివేదిక. ఈ అంశాల్లో సామాజిక మద్దతు, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేకపోవడం తదితరాల ఆధారంగా జాబితాను అందిస్తుంది. వాటన్నింటిలో వెనుకబడి ఉండి అత్యల్ప సంతోషకరమైన దేశాలుగా నిలిచిన దేశాలేవంటే..అఫ్ఘనిస్తాన్..ప్రపంచ సంతోష సూచికలో 137 దేశాలలో అట్టడుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో తక్కువ ఆయుర్దాయం తోపాటు మహమ్మారికి ముందు నుంచి ఉన్న వివిధ నిరంతర సమస్యల సవాలును ఎదుర్కొంటుంది. దీనికి గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉన్నప్పటికీ, పోరాటాలు, పౌరుల శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేశాయి.లెబనాన్..అఫ్ఘనిస్తాన్ తర్వాత, లెబనాన్ రెండవ అత్యల్ప సంతోషకరమైన దేశంగా దురదృష్టకర ఘనతను కలిగి ఉంది. ఈ దేశంలో అత్యంత సంతోషకరమైన దేశాల కంటే ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సామాజిక-రాజకీయ సవాళ్లు, ఆర్థిక అస్థిరతతో సతమతమవుతోంది. సియెర్రా లియోన్..ప్రపంచంలో మూడవ అత్యలప్ప సంతోషకరమైన దేశంగా ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ నిలిచింది. తక్కువ సంతోష సూచికకు దోహదపడే ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆర్థిక అసమానతలు, రాజకీయ అస్థిరత, సామాజిక అశాంతి తీవ్రంగా ఉన్నాయిజింబాబ్వే..ప్రపంచ సంతోష నివేదికలో నాల్గవ స్థానంలో ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న అఫ్ఘనిస్తాన్, లెబనాన్, సియెర్రా లియోన్‌లతో పోలిస్తే జింబాబ్వే కొంచెం అనుకూలమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశం అల్లకల్లోల చరిత్ర, కొనసాగుతున్న సవాళ్లతో పోరాడుతోం. ఇది ఆ దేశలోని మొత్తం జనాభా శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో..ఈ దేశం ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సుదీర్ఘ చరిత్ర సంఘర్షణ, రాజకీయ తిరుగుబాటు, నిరంకుశ పాలన, బలవంతంగా స్థానభ్రంశం తదితర సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ అంశాలన్ని అత్యల్ప సంతోషానికి సూచిక.బోట్స్వానా..బోట్స్వానా అఫ్ఘనిస్తాన్, లెబనాన్ వంటి దేశాల కంటే కొంచెం ముందుంది. ఇక్కడ సాపేక్ష స్థిరత్వం ఉన్నప్పటికీ, సామాజిక శ్రేయస్సలో వెనుబడి ఉండటంతో అత్యల్ప సంతోషకరమైన దేశాల్లో చేరింది.మలావి..వేగంగా పెరుగుతున్న జనాభా, సారవంతమైన భూమి, నీటిపారుదల లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది మలావి. ఈ నేపథ్యంలోనే అక్కడ పౌరులు అనందానికి ఆమడం దూరంలో ఉండి, అసంతృప్తితో బతుకీడస్తన్నారు. కొమొరోస్..ఈ దేశం రాజకీయ తిరుగుబాట్లు కారణంగా కొమొరోస్ను ప్రపంచంలోని అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చేర్చింది. ఇక్కడ ఉన్న సామాజిక-రాజకీయ దృశ్యం ప్రజలపై గణనీయంగా ప్రభావితం చూపుతోంది. అందువల్లే ఈ దేశం అసంతృప్తి వాతవరణంగా తార స్థాయిలో నెలకొంది.టాంజానియా..ప్రధాన సంతోష సూచికలలో తక్కువ స్కోర్ల కారణంగా దీనిని ఈ జాబితాలో చేర్చారు. దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పలు తీవ్ర సవాళ్లను ఎదుర్కుంటుంది. ఇది మొత్తం దేశం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. అందవల్లే ఆధునిక ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో విఫలమవుతుంది. ఈ కారణాల రీత్యా అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చేరింది. జాంబియాఅత్యల్స సంతోషకరమైన జాబితాలో చిట్టచివరన పదో స్థానంలో ఉన్న దేశం జాంబియా. దీన్ని సెంట్రల్ ఆఫ్రికన్ ఫెడరేషన్ అని పిలుస్తారు. ఇక్కడ ఉపాధి, రాజకీయ అనిశ్చిత, సామాజిక అసమానత తదితర సవాళ్లతో పోరాడుతోంది.భారతదేశం ఈ జాబితాలో లేనప్పటికీ, అది చాలా వెనుకబడి లేదు. ‘ప్రపంచంలోని అత్యంత తక్కువ సంతోషకరమైన దేశంగా 12వ స్థానంలో ఉంది.(చదవండి: అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం) -
సంతోషంగా ఉంటేనే విధులు.. లేకుంటే 10 రోజులు సెలవులు!
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. దీని ప్రాముఖ్యత గత దశాబ్ద కాలంలో విపరీతంగా పెరిగింది. పనితోపాటు కుటుంబంతో గడపడం, అభిరుచులు మొదలైనవాటికి ఒక రోజులో కొంత సమయం కేటాయించడం మధ్య సమతౌల్యాన్ని ఈ పదం సూచిస్తుంది. దీని గురించి బాగా ఆలోచించిన ఒక చైనీస్ రిటైల్ వ్యాపారవేత్త తన సంస్థలో "అన్హ్యపీ లీవ్" అనే భావనను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఉద్యోగులు సంతోషంగా లేకుంటే విధులకు రాకుండా సెలవు తీసుకోవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది. చైనాలోని రిటైల్ చైన్ అయిన పాంగ్ డాంగ్ లై వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యూ డాంగ్లాయ్ ఈ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. ఇది సిబ్బంది తమ అభీష్టానుసారం 10 రోజుల అదనపు సెలవులు తీసుకుకోవడానికి అనుమతిస్తుంది. "ప్రతి సిబ్బందికి స్వేచ్ఛ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ వారు సంతోషంగా లేని సమయాలు ఉంటాయి, కాబట్టి మీరు సంతోషంగా లేకుంటే, పనికి రావద్దు" అని ఆయన చెప్పారు. సెలవులు తీసుకోవాలనుకునే ఏ ఉద్యోగికీ యాజమాన్యం నో చెప్పదని డోంగ్లాయ్ స్పష్టం చేశారు. "ఈ సెలవును యాజమాన్యం తిరస్కరించలేదు. తిరస్కరణ అనేది ఉల్లంఘన" అని ఆయన స్పష్టం చేశారు. -
తాడేపల్లిగూడెం: టీడీపీ-జనసేన పొత్తులో ముసలం
సాక్షి, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉమ్మడి పొత్తులో ముసలం ఏర్పడింది. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకే కేటాయిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడంతో తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోయారు. నియోజకవర్గ ఇంచార్జి వలవల మల్లిఖార్జున రావు(బాబ్జి) మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం సీటు లేదని అధిష్టానం పొత్తుకు ముందే చెప్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో నాకు నియోజకవర్గ ఇంచార్జి ఇచ్చినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశానని, విలువ లేకుండా చేశారన్నారు. క్రమశిక్షణ ఎక్కువ ఉన్న నియోజకవర్గం మనది. అందుకే మనల్ని లోకువగా చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదీ చదవండి: రఘురామా.. ప్లీజ్ గెటవుట్! -
ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..? ఐటీ కంపెనీ ఫ్రెషర్ల ఆవేదన
ఐటీ కంపెనీ ఎంఫసిస్ తమను ఆన్‌బోర్డింగ్ చేయించకుండా తీవ్ర జాప్యం చేస్తోందని ఆ సంస్థ ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు ఫ్రెషర్లు ట్విటర్ వేదికగా తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నుంచి తాము అందుకున్న అంగీకార పత్రాల గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో తమను ఉద్యోగంలోకి తీసుకుంటారో లేదో అని భయాందోళన చెందుతున్నారు. తాను కంపెనీ నుంచి 2021 అక్టోబర్‌లో అంగీకార పత్రం అందుకున్నానని, అప్పటి నుంచి జాయినింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నానని నితిన్‌రాకేష్ అనే అభ్యర్థి తెలియజేశారు. కంపెనీ నుంచి అంగీకార పత్రం అందుకున్నప్పుడు తాను కూడా ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగి కాబోతున్నానని ఎంతో సంతోషించానని, కానీ తనను ఆన్‌బోర్డ్ చేయకుండా ఎంఫసిస్ కంపెనీ నిరాశకు గురిచేస్తోందని వాపోయాడు. ఇప్పటికైనా ఆన్‌బోర్డ్ చేయాలని వేడుకుంటున్నాడు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) తౌహీద్ అనే మరో అభ్యర్థి.. తనుకు 2022 జూన్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారని, 2023 మార్చికి దాని గడువు ముగిసిపోతుందని, ఆన్‌బోర్డింగ్‌పై సమాచారం ఇవ్వాలని అభ్యర్థించారు. నిక్కీ అనే అభ్యర్థి అయితే తాను 16 నెలలుగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్నాని, ఈ కంపెనీలో చేరాలనే ఉద్దేశంతో ఇతర కంపెనీల వచ్చిన ఆఫర్లను కూడా వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక) -
గోల్డెన్ ఫెరారీ వీడియో చక్కర్లు, ఆనంద్ మహీంద్ర అసహనం
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సాధారణంగా చలోక్తులు, ఆసక్తికర విషయాలు, విజ్ఞాన దాయక విషయాలనే సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా వీటన్నింటికి భిన్నంగా ఆయన చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తరుచూ ఆటో మొబైల్ పరిశ్రమలోని నూతన ఆవిష్కరణలపై స్పందించే ఆనంద్ మహీంద్రఅతి ఖరీదైన గోల్డెన్ ఫెరారీపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. హంగూ, ఆర్భాటాలతో లగ్జరీ కారు ఓనరు హడావిడి, జనాల క్రేజ్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వీడియోలను ఎందుకు చూస్తున్నారో తెలియదు, డబ్బును ఎలా ఖర్చుచేయకూడదో నెర్పే విషయం అయితే తప్ప అని వ్యాఖ్యానించారు. సంపద ఉంటే ప్రదర్శించాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటివి సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతాయో అర్థం కాదంటూ విసుగు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కమెంట్లు కూడా చేశారు. ఆనంద్ మహీంద్రా ఆటోమొబైల్స్ ప్రపంచంలో వివిధ పరిణామాలపై తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల గ్రీన్ మొబిలిటీకి తన మద్దతు అంటూ రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ట్విట్ చేశారు. వాస్తవానికి పూర్తిగా బంగారు పూత పూసిన ఈ వీడియో 2017లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. సౌదీ నంబరు ప్లేట్‌తో ఈ కారు నిజమైన యజమాని ఎవరు, అసలు యజమాని నుండి ఈ కారును ఇండో-అమెరికన్ కొనుగోలు చేశారా అనేది స్పష్టత లేదు. కాగా ఇటలీకి చెందిన కార్ల కంపెనీ ఫెరారి అత్యంత విలువ గల కార్లను ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. I don’t know why this is going around on social media unless it is a lesson on how NOT to spend your money when you are wealthy… pic.twitter.com/0cpDRSZpnI — anand mahindra (@anandmahindra) July 19, 2021 -
పదవుల పందేరంపై టీఆర్ఎస్లో కలకలం
సాక్షి, హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణతోపాటు చీఫ్ విప్, విప్ తదితర పదవుల పందేరం టీఆర్ఎస్లో కొత్త సమస్యలు సృష్టి స్తోంది. అసమ్మతి గళాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యూహం మరిన్ని అసంతృప్త గళాలకు ఊపిరి పోస్తోంది. మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో పార్టీలో మొదలైన కలకలం మంత్రివర్గం విస్తరణ తర్వాత కూడా సద్దుమణగడం లేదు. ఆదివారం మొదలైన అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా తనకు ఎదురైన మీడియా ప్రతినిధు లతో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని సమాధానం చెప్పుకునే స్థితిలోకి నెట్టినట్లు కనిపిస్తోంది. తనను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా వారించిన సీఎం కేసీఆర్.. మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు అని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే వద్దన్నారు. కౌన్సిల్లో ఉండు. నీకు మంత్రి పదవి ఇస్తా అని అన్నాడు. మా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పారు. నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దు. అందులో రసం లేదు. కేసీఆర్ మా ఇంటికి పెద్ద. మేమంతా ఓనర్లమే. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో, ఎప్పుడు దిగిపోతారో వాళ్లిష్టం’’ అంటూ నాయిని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య కూడా తనకు ఏ పదవీ దక్కే పరిస్థితి లేదని వాపోయారు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించక పోవడాన్ని మీడియా వద్ద ప్రస్తావించడంతోపాటు మాదిగ కుల సంఘాలు ప్రశ్నించాలనే రీతిలో సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణతో ఆశావహుల్లో నిరాశ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందని భావించిన కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం తమను కనీసం పిలిచి మాట్లాడక పోవడంపై అవేదన చెందుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించిన మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విఛాఫ్ చేయడంతోపాటు గన్మెన్లను కూడా వదిలి వెళ్లడంపై చర్చ జరుగుతోంది. తనకు తిరిగి మంత్రి పదవి లభిస్తుందనే ధీమాతో ఉన్న జోగు రామన్న మినిస్టర్ క్వార్టర్స్‌లోనే ఉంటున్నట్లు తెలిసింది. మంత్రి పదవిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతోనే మినిస్టర్ క్వార్టర్స్‌లో కొనసాగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం వెనుక కూడా అసంతృప్తే కారణమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటల వ్యాఖ్యలు సద్దుమణుగుతున్న వేళ తాజాగా అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. ఈటల స్థానంలో కొత్త మంత్రి గంగుల కమలాకర్ హాజరు కావడంతో ఈటలకు చెక్ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఓవైపు బీజేపీ పదేపదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల అసమ్మతి రాగం ఎటు దారి తీస్తుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
కచ్చితంగా బరిలోకి దిగుతాం..!
సాక్షి, హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం పంపిన ముగ్గురు దూతలు అసంతృప్త నేతలతో సమావేశమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి, ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణమూర్తి, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ దాదాపు 20 మందికి పైగా నేతలతో సమావేశమై వారి భవిష్యత్‌పై హామీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇందులో పొంగులేటి సుధాకర్‌రెడ్డి (ఖమ్మం), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), నాయి ని రాజేందర్‌రెడ్డి (వరంగల్ పశ్చిమ), సంగిశెట్టి జగదీశ్ (ముషీరాబాద్), తోటకూర జంగయ్య యాదవ్ (మేడ్చల్), కార్తీక్‌రెడ్డి (రాజేంద్రనగర్), నేరెళ్ల శారద (కరీంనగర్), పాల్వాయి స్రవంతి (మునుగోడు), గజ్జెల కాంతం (చొప్పదండి), దుర్గం భాస్కర్ (బెల్లంపల్లి), దరువు ఎల్లన్న (ధర్మపురి), విజయరామరాజు (కంటోన్మెంట్) ఉన్నారు. అసంతృప్తులతో మాట్లాడిన నేతలు భవిష్యత్‌లో తప్పకుండా న్యాయం చేస్తామని, పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తున్నందున త్యాగం చేయక తప్పదని చెప్పినట్టు తెలుస్తోంది. దూతలతో సమావేశం అయిన తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి మాత్రం తాము కచ్చితంగా ఎన్నికల బరిలో ఉండి తీరుతామని, పార్టీ అధిష్టానం బీ ఫారం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుజ్జగింపుల కమిటీని పొన్నాల లక్ష్మయ్య, రేగులపాటి రమ్యారావు, వీహెచ్, మధుయాష్కీ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితోపాటు దుబ్బాక టీజేఎస్ అభ్యర్థి చిందం రాజ్‌కుమార్, అక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్రెడ్డితో కూడా అధిష్టాన దూతలు చర్చించారు. అధిష్టానం నుంచి బుజ్జగింపుల కోసం వచ్చిన దూతలు సోమవారం కూడా నగ రంలోనే ఉండి మరికొందరు అసంతృప్తులతో సమావేశం కానున్నారు. బండ్ల గణేశ్, కాసాని జ్ఞానేశ్వర్, బండ కార్తీకరెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నివాసానికి వెళ్లి తమకు పోటీచేసే అవకాశం కల్పించాలని కోరారు. భేటీ తర్వాత ఎవరేమన్నారంటే.. నా తండ్రి పాల్వాయి గోవర్ధనరెడ్డి 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. చివరివరకు మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉన్నారు. నేను 20 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నా. ఇప్పుడు కార్యకర్తలకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. భవిష్యత్ బాగుంటుందని దూతలు చెప్పారు. రాహుల్‌గాంధీ కూడా వ్యక్తిగతంగా చెప్పారు. – పాల్వాయి స్రవంతి (మునుగోడు) ‘గత ఎన్నికల అనుభవాలను దూతలకు చెప్పా. పొత్తుల పేరుతో సిట్టింగ్ సీట్లు ఇవ్వకపోవడాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా. నాకు సీటు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం కష్టపడతా.’ –పొంగులేటి సుధాకర్‌రెడ్డి (ఖమ్మం) ‘యాదవులకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదో చెప్పాలని దూతలను అడిగాను. ఎంపీగా పోటీచేసే వారికి ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అన్ని సామాజిక వర్గాలను కలుపు కొనిపోవాలి. యాదవులను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? రాహుల్‌గాంధీ, సోనియా అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరా. నేడు నామినేషన్ వేస్తా. సోనియాగాంధీ సభ కంటే ముందే నా విషయంలో క్లారిటీ వస్తుంది.’ – తోటకూర జంగయ్య యాదవ్ (మేడ్చల్) -
గిట్టుబాటు ధరలేక ఉల్లిరైతు విలవిల
-
మధ్యతరగతిపై పన్నుల భారం
కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విభిన్న రకాల వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపారని, ప్రభుత్వ ఉద్యోగుల సహితం బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరపలేదని, ప్రజలపై భారాలు మోపుతుందంటున్నారు. పెట్టుబడి దారులకు కొమ్ముకాసే బడ్జెట్ కల్లూరురూరల్: కేంద్రం ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్మిక సంక్షేమాన్ని తుంగలో తొక్కి పెట్టుబడి దారులకు ఊతం ఇచ్చేలాగా వుందని సీపీఎం మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో పేదలకు ఎటువంటి మేలు జరిగే అవకాశం లేదని, అంకెల గారడితో ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసగించిందన్నారు. రెతులకు ఎలాంటి ఉపయోగం కలగదన్నారు. – తన్నీరు కృష్ణార్జునరావు, సీపీఎం మండల కార్యదర్శి మద్దతు ధరతో రైతుకు మేలు తల్లాడ: బడ్డెట్లో కనీస మద్దతు ధర కల్పించడం హర్షదాయకం. పత్తి, మిర్చి వంటి పంటలు ప్రతి ఏటా మద్దతు ధర లేక రైతాంగం నష్ట పోతుంది. రైతుల పరిస్థితి, వారి కష్టాలను చూసిన కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించింది. వ్యవసాయం రంగంలో రుణాలు ఇప్పించడానికి రూ.11 లక్షల కోట్లు కేటాయించినట్లు ప్రకటించటం మంచిదే. రైతులకు ఉపయోగ పడే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. – దగ్గుల శ్రీనివాసరెడ్డి, రైతు, తల్లాడ మాలాంటోళ్లకు ధైర్యం కలిగించింది మాది పేద కుటుంబం. కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు దారులకు సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని బడ్జెట్లో చెప్పటం మాలాంటోళ్లకు ధైర్యం కలిగించింది. – ఎం.నాగబాబు, సత్తుపల్లి ఆరోగ్య బీమా మంచిది చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామనటం చాలా మంచిది. వీటితో పిల్లలను మంచిగా చదించటానికి అవకాశం లభిస్తుంది. – చిత్తలూరి నర్సింహారావు, సత్తుపల్లి నిరుద్యోగులకు నిరాశే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు నిధులు కేటాయించకపోవటం దారుణం. నిరుద్యోగులకు నిరాశే కలిగించింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒనగూరిందేమీ లేదు. ఇది ధనులకు ఉపయోగపడేవిధంగా ఉంది. – భీమిరెడ్డి పుల్లారెడ్డి, వేంసూరు గ్యాస్ పొయ్యి ఇస్తే పొగ బాధ తప్పినట్లే కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. కట్టెల పొయ్యి మీద పొగతో వంట చేసుకునే మాలాంటి వాళ్ళకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే పొగ కష్టాలు తీరుతాయి. – జినుగు రాణి, పెనుబల్లి -
అడుగుపెట్టి చూడ... అధ్వానమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు...అన్నారు పెద్దలు. సొంతింటి కలను సాకారం చేసుకోవడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికీ తెలుసు. అంత స్తోమత లేకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ‘హౌస్ çఫర్ ఆల్ పథకా’న్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘అందరికీ ఇళ్లు’ ఉండాలన్న లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏమిటో నేటికీ స్పష్టత లేకపోయినా దాని నిర్మాణం పేరిట పూర్తి అజమాయిషీ చెలాయిస్తోంది. పోనీ అలా అయినా లబ్ధిదారులకు మేలు చేస్తుందా అంటే అదీ లేదు. నిర్మాణ బాధ్యతలను భుజానకెత్తుకుని ఇరుకు గదులు...ఆపై ‘సన్‌షేడ్ లేని ఇళ్లు, కప్ బోర్డుల్లేని గదులను నిర్మిస్తోంది. ఇవి చాలదన్నట్టు వాస్తు చూడకుండా నిర్మాణం చేపట్టేస్తున్నారు. ఇప్పుడీ నిర్మాణాలపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వస్తువులు భద్రపరుచుకోవడానికి వీల్లేని ఇళ్లు తమకెందుకని నిలదీస్తున్నారు. శనివారం ఆ ఇళ్ల పరిశీలనకొచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణకు ఆ అసంతృప్తి సెగ తాకింది. కట్టిన ఇళ్లు నాలుగు కాలాలపాటు ఉండాలని భావిస్తారు. మళ్లీ మళ్లీ మదుపు పెట్టే పరిస్థితి ఉండకూడదని ఆలోచిస్తారు. అందుకే ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు దగ్గరి నుంచి అన్ని సౌకర్యాలున్నాయా లేవా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ‘తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండన్నట్టుగా ఏదోరకంగా కట్టించి ఇచ్చేస్తాం....వాటిలోనే ఉండండన్నట్టుగా వ్యవహరిస్తోంది. వాస్తవంగా కొత్తగా నిర్మించినప్పుడే అన్నీ చూసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇలాగే కడతాం...ఏదైనా మార్పులు చేసుకోవల్సి వస్తే తర్వాత చేసుకోండన్నట్టుగా ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం కింద పెద్దాపురంలో నిర్మిస్తున్న ఇళ్ల విషయంలో ముందుకెళ్తోంది. ఇప్పుడా ఇళ్లు మేడిపండు చందంగా తయారయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దాపురం పట్టణంలో తొలి విడతగా సుమారు 1734 ఇళ్ల నిర్మాణాలను ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద గృహ నిర్మాణం చేపట్టారు. రెండో దఫాగా సుమారు 1676 ఇళ్లు మంజూరు కాగా వాటిని కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక వాలుతిమ్మాపురం రోడ్డులో నిర్మించే ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఏపీ టిడ్కోకు అప్పగించగా ఓ బడా కంపెనీతో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇళ్ల నిర్మాణాలను మూడు విభాగాలుగా నిర్మిస్తున్న పాలకులు, అధికారులకు కూడా ఏ ప్లాన్ ఇళ్లు ఎక్కడ నిర్మిస్తున్నారో తెలియని ఆయోమయ స్థితిలో ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. వరండా, గదులు కూడా ఇరుకుగా నిర్మించడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్క ఇటుక వాడకుండానే అధునాతన టెక్నాలజీ పేరుతో స్లాబ్ పద్ధతిలో గోడ నిర్మాణాలు చేపడుతోంది. ఇదిలా ఉంటే గదుల్లో ఎక్కడా సన్షేడ్లుగాని, కప్ బోర్డులు గానీ లేవు. వీటి నిర్మాణం జోలికి వెళ్లలేదు. అవి లేకపోవడంతో లబ్ధిదారులు తమ వస్తువులు భద్రపరుచుకోవడానికి ఇబ్బంది పడతారు. ఆ దిశగా ఆలోచించ లేదు. ఇక కేటగిరీ 2 కింద చేపడుతున్న నిర్మాణాల్లో ఈశాన్యంలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇది వాస్తుకు విరుద్ధమని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా అన్ని రకాలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలే అప్పు...ఆపై లోపాలా ? ప్రభుత్వం నిర్దేశించిన మూడు కేటగిరీల్లోనూ లబ్ధిదారుడికి రూ.3 లక్షలకుపైగా రుణభారం పడుతుంది. దీన్ని చెల్లించుకోవడమే పేద, మధ్య తరగతి వారికి తలకు మించిన భారం కానుంది. ఈ నేపథ్యంలో సన్ షేడ్ల్లేని ఇళ్లు, కప్‌బోర్డులు లేని గదులు నిర్మిస్తే వాటి కోసం మళ్లీ మదుపు పెట్టాల్సి ఉంటోంది. అలాగే వాటి కోసం కొత్త గోడలపైన పునర్నిర్మాణం చేయవల్సి వస్తోంది. ఈ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవల్సింది పోయి లబ్ధిదారులు నిలదీస్తుంటే ఏర్పాటు చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మంత్రి నారాయణకు నిరసన సెగ ఇరుకు గదులు, సన్షేడ్లు, కప్ బోర్డుల్లేవన్న విషయాన్ని గుర్తించిన లబ్ధిదారులు శనివారం ఆ ప్రాంతానికి వచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణను నిలదీశారు. మహిళలంతా మంత్రిని చుట్టుముట్టి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక సన్షేడ్లు, కప్ బోర్డులు ఏర్పాటు చేస్తామని సర్దిచెప్పే ప్రయత్నం మంత్రి చేశారు. పూర్తి స్థాయి వసతులు లేవు అన్ని వసతులతో ఇళ్లు నిర్మిస్తామన్నారు. కనీస వసతులు లేకుండా ఇరుకు గదులతో ఇళ్లు నిర్మిస్తున్నారు. సన్‌సైన్, కప్ బోర్డులు లేకుంటే సామాన్లు పెట్టుకోవడానికి లేకుండాపోతుంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. – సుందరపల్లి సుజాత, లబ్ధిదారులు, పెద్దాపురం. రుణభారం తప్పదు... నాణ్యత కనబడడం లేదు ‘అందరికీ ఇళ్లు’ పేరిట ఇళ్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం లబ్ధిదారులకు రుణభారం తప్పడం లేదు. ఏళ్ల తరబడిగా ఇచ్చిన రుణాన్ని చెల్లించేందుకు సిద్ధపడ్డా కనీస ఇటుక లేని ఇళ్లు నిర్మిస్తున్నారు. ఎంతవరకు నాణ్యతగా నిలబడతాయో కూడా మాకు అర్థం కావడం లేదు. ఆధునిక ఇళ్ల పేరిట విశాలమైన గదులు లేకుండా ఇరుకుగా నిర్మిస్తున్నారు. ప్రశ్నిస్తే చూడడానికి బాగున్నాయా..? లేదా...? అంటున్నారే తప్ప వసతులు కల్పిస్తున్న దాఖలాలైతే కనబడడం లేదు. – కంపర పార్వతి, స్థానికులు, లబ్ధిదారు, పెద్దాపురం -
వెంకయ్య అసహనం ఎంతలా అంటే...
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సభ్యుల నినాదాలు.. పదే పదే సభలో అంతరాయం కలిగించటం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడుకు చికాకు తెప్పిస్తున్నాయి. ఒకనొక సమయంలో ఆయన ముఖంలోనే భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదాలో తొలి సమావేశాలను నిర్వహిస్తున్న ఆయన ఓ కార్యక్రమంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతున్నాయంటే.. మొదలవుతున్నాయ్.. వెంటనే ఆగిపోతున్నాయ్. ఇది దేశానికి అంత మంచిది కాదు. విలువైన సభా సమయం.. ప్రజా ధనం వృధా అవుతోంది. ప్రజలకు నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీలో ఓ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యానించారు. ఇక గతంలో ఇదే సభలో ఆయన సుదీర్ఘకాలం సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పరిస్థితులు రాను రాను మరీ అద్వానంగా తయారవుతున్నాయని.. కీలకమైన బిల్లులపై చర్చించే పరిస్థితులు కనిపించటం లేదని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్థిక పురోగతి.. లక్ష్యాలు అన్న అంశంపై కూడా ఆయన ప్రసగించారు. కాగా, మన్మోహన్పై మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కూడా సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. -
పోలీసుల తీరుపై కేంద్రమంత్రి అసంతృప్తి
హైదరాబాద్: లష్కర్ బోనాల సందర్భంగా మహంకాళీ అమ్మవారి దర్శనం కోసం కేంద్ర మంత్రి బండారు దత్తత్రేయ వచ్చారు. ఆలయ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీమణి అనారోగ్యంతో బాధపడుతోందని వాహనాన్ని ఆలయ సమీపం వరకు తీసుకెళ్లే విధంగా చూడమని పోలీసులను కోరినా లాభం లేకపోయింది. ఆలయం వద్దకు వాహనాలా రాకోపోకలు నిషేద్ధమని చాలా దూరంలోనే మంత్రి వాహనాన్ని నిలిపేశారు. స్థానికి ఎంపీ అయిన తనకు పోలీసులు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
హీరోయిన్‌పై పొరుగువారి మండిపాటు
లాస్ ఏంజిల్స్: బ్రాడ్పీట్తో తెగదెంపులు చేసుకున్న హాలీవుడ్ హీరోయిన్ ఎంజెలీనా జోలీ ఇటీవల ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని లాస్ ఫెలిజ్ ఏరియాలో 25 మిలియన్ డాలర్లను వెచ్చించి మరీ ఆ ఇంటిని ఎంజెలీనా ముచ్చటపడి తీసుకుంది. వారం రోజుల కిందటే తన ఆరుగురు పిల్లలతో కలిసి ఎంజెలీనా ఆ ఇంటిలోకి వెళ్లింది. అయితే.. లాస్ ఫెలిజ్లోని పొరుగువారు మాత్రం ఎంజిలీనాపై మండిపడుతున్నారు. ఇంతకు ముందు ప్రశాంతంగా ఉన్న తమ ప్రైవేట్ ఎస్టేట్ కాస్తా హీరోయిన్ రాకతో గందరగోళంగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏంజిలీనా వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందని వాపోతున్నారు. అసలు అక్కడ ఎంజెలీనా ఇల్లు తీసుకోవడం ఏమాత్రం సరికాదని ఇరుగుపొరుగువారు అభిప్రాయపడుతున్నారు. ఇతర సెలబ్రిటీలు సైతం ఆ ప్రాంతంలో ఉంటున్నా.. ఎంజిలీనాపై ఉన్న ఎక్కువ అటెన్షన్ సమస్యలకు కారణమౌతున్నట్లు తెలుస్తోంది. -
సంతోషం కొంతే!
ఎమ్మెల్సీ గెలుపుపై టీడీపీ నేతల్లో కనిపించని ఆనందం – మెజార్టీ తగ్గడంతో ఎక్కడో గుబులు – భారీగా డబ్బులు వెదజల్లి.. సీఎం రంగంలోకి దిగినా దిగదుడుపే – అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని శిల్పా హెచ్చరికలు – చర్యలు తప్పవని ఘాటు వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎక్కడో అసంతృప్తి వ్యక్తమయ్యింది. ఎమ్మెల్సీగా అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించినా ఆ సంతోషం పెద్దగా కనిపించని పరిస్థితి. మెజార్టీ భారీగా తగ్గడంతో ఎక్కడో గుబులు కనిపించింది. అడుగడుగునా ఇది గెలుపు కాదని.. చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా తమ పరిస్థితి తయారైందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తన గెలుపునకు కొందరు పనిచేయలేదని.. వారి జాబితాను ఇప్పటికే తయారు చేశామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల విజేత శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. ఇలాంటి నేతలపై చర్యలు తప్పవని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తన గెలుపుపై తనకే పెద్దగా సంతృప్తి లేదన్నారు. తమ పార్టీలోకి 5గురు విపక్ష ఎమ్మెల్యేలు చేరిన తర్వాత కూడా మెజార్టీ తగ్గడాన్ని నియోజకవర్గాల వారీగా అధ్యయనం చేస్తామని వెల్లడించారు. అనంతరం అధిష్టానానికి ఫిర్యాదు చేసి.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన అధికార పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. చావుతప్పి.. తమ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేఈ ప్రభాకర్‌తో పాటు కేఈ ప్రతాప్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. నైతికంగా గెలుపు తమదేనన్న గౌరు వ్యాఖ్యలను మరికొద్ది మంది టీడీపీ నేతలు కూడా సపోర్టు చేయడం గమనార్హం. పార్టీలోకి ఏకంగా 5గురు ఎమ్మెల్యేలు వచ్చినా వైసీపీకి ప్రజాబలం తగ్గకపోగా పెరగడం బట్టి చూస్తే తాము పునారోలించుకోవాల్సిందేనన్న అభిప్రాయం వారిలో వ్యక్తమయ్యింది. అయితే, ఎంత ఖర్చు చేసినప్పటికీ.. మెజార్టీ తగ్గిన నేపథ్యంలో సహకరించని వారిపై ఫిర్యాదు చేస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటనపై ఆ పార్టీలో చర్చ రేపుతోంది. అలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు భారీగా డబ్బులు వెదజల్లినా.. చివరి రెండు రోజుల్లో నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా తమ పరిస్థితి ఇంతేనా అని వాపోతున్నారు. ఆ ఎమ్మెల్యేలు వచ్చినా..! వాస్తవానికి రెండేళ్లక్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డికి 147 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే, ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరారు. వీరితో పాటు పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు పార్టీలు మారారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరుగుతుందని.. కనీసంలో కనీసం 200 వరకూ వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకున్నారు. ఇదే అంశాన్ని తమ నివేదికలో అధిష్టానానికి వెల్లడించారు. అయితే, ఇందుకు భిన్నంగా మెజార్టీ భారీగా తగ్గడంతో ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు. తమ ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు బాగానే చేశారని శిల్పా ప్రకటించారు. తద్వారా పరోక్షంగా పార్టీ మారిన నేతలు సహకరించలేదని తన అభిప్రాయాన్ని ఆయన గెలిచిన వెంటనే వెలిబుచ్చారు. అంతేకాకుండా ఎవరెవరు సహకరించలేదో తమకు తెలుసునని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆయన అనుమానిస్తున్నారని.. వారు తమ పార్టీలోకి వచ్చినప్పటికీ పెద్దగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పార్టీ మారిన నేతలకు– అప్పటికే ఉన్న ఇన్‌చార్జీలకు మధ్య మరోసారి విభేదాలు పొడచూపే అవకాశం కనిపిస్తోంది. కొసమెరుపు: శిల్పా వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారిన నేతలెవ్వరూ కౌంటింగ్ వద్ద కనపడకపోవడం గమనార్హం. -
జీహెచ్ఎంసీ అధికారులపై కేటీఆర్ అసంతృప్తి?
-
విమర్శలను తిప్పికొట్టలేరా?
► మంత్రుల తీరుపై కేసీఆర్ అసంతృప్తి ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా.. వివరించలేకపోతున్నారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో బాగున్నా, ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉన్నా కూడా.. విపక్షాల విమర్శలను మంత్రులు తిప్పికొట్టలేకపోతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాల వారీగా మంత్రుల పనితీరును కేసీఆర్ సమీక్షించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు.. పలువురు మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, రుణమాఫీ అంశాలపై విపక్షాల విమర్శలకు మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాల్లో వాస్తవ పరిస్థితిపై పూర్తి వివరాలతో ఒక నివేదిక అందజేయాలని సీఎస్ రాజీవ్‌శర్మను ఆదేశించారు. పన్నుల రూపంలో రాష్ట్రానికి 20%ఆదాయం వస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా మంత్రి ఈటల రాజేందర్ సరిగా వివరించలేక పోయారని కేసీఆర్ ప్రస్తావించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రుణమాఫీపై రైతులకు స్పష్టత ఇవ్వలేకపోయార న్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు అంశాన్ని మేనేజ్ చేయలేకపోయారని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద కొంత బకాయిలు చెల్లిస్తామని ప్రైవేటు యాజమాన్యాలతో చర్చించలేకపోయారని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భగీరథ’పై ఇంత నిర్లక్ష్యమా? మిషన్ భగీరథ పథకం పనుల్లో జాప్యంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు భగీరథ పనులను పర్యవేక్షించడం లేదని తప్పుబట్టారు. పనులను అనుకున్న రీతిలో, అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. తొలిసారిగా కేబినెట్ సమావేశానికి హాజరైన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ పథకం పనుల పురోగతిని వివరించారు. ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులంతా సహకారం అందించాలని కోరారు. ఒక్క మారుమూల ప్రాంతాలకు కూడా పైప్‌లైన్ ద్వారా తాగునీటిని అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఆయా జిల్లాల మం త్రులు, భగీరథ అధికారులు హెలికాప్టర్లో వెళ్లి, ప్రణాళికలు రూపొందించాలన్నారు. నూ తన సచివాలయం అంశాన్ని కూడా మంత్రుల కు వివరించారు. తూర్పు ముఖంగా కొత్త సచి వాలయ భవనం ఉంటుందని తెలిపారు. -
ఉల్లి రైతుల గోడు పట్టదా?
-
అమ్మపై అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక ఎన్నికల్లో పోటీకి అన్నాడీఎంకే అవకాశం ఇవ్వలేదంటూ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. అమ్మ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళనకు దిగారు. ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరిమిత స్థానాల వల్ల అగ్రనేతలకు మాత్రమే అవకాశం లభిస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ మొదలుకుని గ్రామ పంచాయతీ వరకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అవసరం కాబట్టి అన్నాడీఎంకేలోని ఔత్సాహికులంతా ఆశపడ్డారు. అమ్మ ప్రకటించే అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూశారు. ఈనెల 26వ తేదీన అన్నాడీఎంకే విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో హతాశులయ్యారు. చెన్నై టీ నగర్ 132 వార్డుకు ప్రకటించిన అభ్యర్థిఆనంది మరో వార్డుకు చెందిన మహిళా అంటూ అగ్రహించిన కార్యకర్తలు అన్నాడీఎంకే దక్షిణ కార్యాలయాన్ని, రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. తిరుచ్చిరాపల్లి కార్పొరేషన్‌లోని పలువురు అన్నాడీఎంకే కౌన్సిలర్లపై ముందుగానే అసంతృప్తి నెలకొని ఉండగా, వారిలోని కొందరికి మళ్లీ అవకాశం రావడంతో ప్రత్యర్థులు భగ్గుమన్నారు. ఈ విషయంపై తాడోపేడో తేల్చుకోవాలని సుమారు 500 మంది కార్యకర్తలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. మార్గమధ్యంలో మంత్రి వెల్లమండి నటరాజన్ కారులో ఎదురురావడంతో ముట్టడించారు. కారును రాళ్లతోనూ, చెప్పులతోనూ కొట్టారు. డబ్బులు పుచ్చుకుని సీటిచ్చారని, పార్టీ ద్రోహి అంటూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి కారు నుంచి దిగి చర్చలు జరిపారు. కోయంబత్తూరు, దిండుగల్లు జిల్లాల్లో సైతం పార్టీ కార్యాలయాల ముట్టడి చేశారు. ఆత్మహత్యా యత్నం: తిరువళ్లూరుకు చెందిన సిట్టింగ్ అభ్యర్థి సెల్వకుమారి పోటీ కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. తనకు అవకాశం వస్తుందని ప్రజల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే జాబితాలో పేరు లేకపోవడంతో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చెన్నై చేపాక్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. తీవ్రగాయాలకు గురైన ఆమెను చెన్నై కీల్పాక్ ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే తిరువళ్లూరుకు చెందిన తమిళ్ సెల్వి టికెట్ ఆశించి భంగపడ్డారు. తన భార్యకు అవకాశం రాలేదని ఆవేదన చెందిన భర్త రజనీరవి సోమవారం రాత్రి తన చేతిని కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. తీవ్రరక్తస్రావం అవుతుండగా గుర్తించిన ఆయన భార్య అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.అలాగే చెన్నై విరుగంబాక్కం వార్డు కార్యదర్శి ఆర్ శేఖర్ తనకు అవకాశం రాలేదని తెలుసుకుని మంగళవారం తెల్లవారుజాము 5.45 గంటలకు 20 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అన్నాడీఎంకే నామినేషన్లు:అన్నాడీఎంకే అభ్యర్థులు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లలోని 919 వార్డు స్థానాలకు, పంచాయతీల్లోని 638 స్థానాలకు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. అందరూ సరిగ్గా మధ్యాహ్నం 12.05 నుంచి ఒంటి గంటలోగా నామినేషన్లు వేయడం పూర్తి చేశారు. అలాగే చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డులకు మండల కార్యాలయాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులులు నామినేషన్లు వేశారు. బందోబస్తులో లక్ష పోలీసులు:స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, శాంతి భద్రతల నడుమ పూర్తయ్యేలా లక్ష మంది పోలీసులను బందోబస్తు పెడుతున్నట్లు డీజీపీ టీకే రాజేంద్రన్ మంగళవారం ప్రకటించారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలో మొత్తం 7 వేల పోలింగ్ బూతులు ఉండగా వీటిల్లో 300 సమస్యాత్మక పోలింగ్ బూతులను గుర్తించి 12 వేల మంది పోలీసులను బందోబస్తు పెట్టినట్లు తెలిపారు. అలాగే చెన్నై నగర పరిధిలో ముందు జాగ్రత్త చర్యగా 10వేల మంది రౌడీలపై నిఘా పెట్టామని చెప్పారు. తుపాకీ లెసైన్సు దారులు తమ ఆయుధాలను స్వచ్చందంగా అప్పగించాలని ఆయన కోరారు. -
కుమారుడిపై మండిపడ్డ ములాయం
-
దత్తతకు పార్కులు, చెరువులు
-
మీడియాపై మోదీ అసహనం
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్మాన్ వనీ మృతి పట్ల మీడియా ఎక్కువ కవరేజీ ఇవ్వడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక ఉగ్రవాదిని ప్రసార మాధ్యమాలు హీరోగా చేయడాన్ని మోదీ తప్పుబట్టారు. బుర్మాన్ వనీ ఎన్ కౌంటర్, అనంతరం నెలకొన్న పరిస్థితులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దేశాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించే ఇటువంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని అన్నారు. అతని అనుచరులూ తగిన మూల్యం చెల్లించక తప్పదని మోదీ స్పష్టం చేశారు. -
తీవ్ర అసంతృప్తిలో పరుగుల రాణి
న్యూఢిల్లీ: ఒలింపిక్ అర్హత సాధించడం కోసం నిర్వహించే పోటీలు(ఫెడరేషన్ కప్) ఢిల్లీలో నిర్వహించడంపట్ల ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉష అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత కలుషిత వాతావరణం కలిగిన ప్రాంతమైన ఢిల్లీలో క్వాలిఫైయింగ్ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఇబ్బంది అని ఆమె అన్నారు. అసలు ఇక్కడ వారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. 'ఒలింపిక్ క్వాలిఫైయింగ్ క్రీడల నిర్వహణ కోసం ఢిల్లీని ఎంచుకోవడం నాకు చాలా అసంతృప్తిగా ఉంది. ఢిల్లీ దుమ్ముధూళితో నిండిన భయంకరమైన వాతావరణం కలిగినది. దాదాపు అందరూ అథ్లెట్లు ముఖాలకు ముసుగులు ధరించి శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఆక్సిజన్ ఎలా అందుతుంది? వారు ఈ వెంట్ ను మరో ప్రాంతంలోగానీ, లేదా మరోసమయంలో గానీ నిర్వహిస్తే బాగుంటుంది' అని పీటీ ఉష చెప్పారు. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ప్రస్తుతం ఈవెంట్ నిర్వహిస్తున్న ప్రాంతంలో గాలి స్వఛ్ఛత చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నారు. -
బాలీవుడ్ హీరోకు అది నచ్చలేదట!
ముంబై: బిహార్ లో సంపూర్ణ నిషేధం విధించడంపై బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ఈ విలక్షణ నటుడు సోషల్ మీడియాలో తన భావాలను పంచుకున్నారు. వరుస ట్విట్లతో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. వేల కోట్ల రూపాయల రెవెన్యూ నష్టపోవడం తప్ప, మద్య నిషేధం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని ఆయన ట్విట్ చేశారు. '' మీరు చట్టవ్యతిరేక మరియు అక్రమ మద్యం ప్రోత్సహిస్తున్నారు. మద్య నిషేధం ప్రపంచవ్యాప్తంగా విఫలమైంది. వేక్ అప్ ! మీరు కూడా 3వేల కోట్ల రెవెన్యూ నష్టపోతారు, " అంటూ రిషి ట్వీట్ చేశారు. "మద్యం సేవిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష ! అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఐదు సంవత్సరాలా? వహ్ నితీష్' అని కమెంట్ పోస్ట్ చేశారు. ఒక పక్క ధూమపానం, మద్యం సేవించడం ప్రమాదకరం...ప్రజలారా దయచేసి వీటినుంచి దూరంగా ఉండమని సలహా యిస్తూనే ....కూలి చిత్రంలో నటిస్తున్న రోజులనుంచి మద్యం సేవిస్తున్నానంటూ 1983 చిత్రం " కూలి " మూవీలోని ఒక ఫోటోను షేర్ చేశారు. కాగా మంగళవారం రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం నితీష్ ప్రకటించారు. దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించిన రాష్ట్రాలలో గుజరాత్ , మణిపూర్, నాగాలాండ్ తర్వాత ఈ కోవలో నాలుగవదిగా బిహార్ అవతరించింది. Bihar you will encourage bootlegging and illicit liquor.Prohibition has failed worldwide. Wake up!You will also lose ₹3000 Crs revenue loss — Rishi Kapoor (@chintskap) 5 April 2016 Practising drinking since Coolie days. Waise-Smoking and Drinking is hazardous. People Please abstain from it. Tx! pic.twitter.com/Tk4VNRku4L — Rishi Kapoor (@chintskap) 5 April 2016 -
అగ్రిగోల్డ్ కేసు విచారణ తీరుపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును ఆంధ్రప్రదేశ్ సీఐడీ విచారణ జరుపుతున్న తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ బ్యాంకు ఖాతాలు, నగదు వివరాలపై విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నిచగా.. 22 ఖాతాల్లో రూ. 6 లక్షల నగదు ఉన్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. అయితే దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించిన సంస్థ ఖాతాల్లో కేవలం ఆరు లక్షలే ఉండటమేంటని కోర్టు సీఐడీని ప్రశ్నించింది. రెండేళ్లలో సంస్థ ఖాతాల్లో నుండి డ్రా అయిన డబ్బు వివరాలను చెప్పాలని కోర్టు కోరింది. ఇలా అయితే బాధితులకు న్యాయం ఎలాచేస్తారని సీఐడీని ప్రశ్నించిన కోర్టు.. కస్టడీ విచారణ వివరాలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. -
'సర్వేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి'
-
దయనీయంగా మారిన టీడీపీ పరిస్థితి
-
ఇంత నిర్లక్ష్యమా!
రోడ్ల పనుల్లో ఏడో స్థానంలో వరంగల్ మీ జిల్లాకు నష్టం చేస్తున్నారు అధికారులపై ఈఎన్సీ ఆగ్రహం కాంట్రాక్టర్ల తీరుపైనా అసంతృప్తి మార్చిలోపు పూర్తి చేయాలని ఆదేశం పంచాయతీరాజ్ రోడ్లపై సమీక్ష వరంగల్ : పంచాయతీరాజ్ రోడ్ల పనులు జరుగుతున్న తీరుపై ఈ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) ఎం.సత్యనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్ల నిర్మాణం విషయంలో జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజనీర్లు అలసత్వం చూపుతున్నారని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన కొత్త రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులపై పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ), డివిజనల్ ఇంజనీర్లు(డీఈ)లు, సహాయ ఇంజనీర్లు(ఏఈ), కాంట్రాక్టర్లతో ఈఎన్సీ ఎం.సత్యనారాయణరెడ్డి జిల్లా పరిషత్ సమావేశమందిరంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ శాఖ గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా రోడ్ల నిర్మా ణం, పునరుద్ధరించేందుకు రూ.416 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. రోడ్ల పనులను పూర్తి చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రోడ్లు పనులను పూర్తి చేసే విషయంలో వరంగల్ జిల్లా రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అనుభవం గల పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారని, 22 హాట్ మిక్స్ ప్లాంట్లు ఉన్నా.. రోడ్ల పనులు జరిగే తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదన్నారు. పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని రూ. 230.35 కోట్లతో 1676.37 కిలో మీటర్ల పొడవైన బీటీ రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణరుుంచిందని, రూ. 185.71 కోట్లతో 396.83 కిలో మీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేయనుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 484 కిలో మీటర్ల రోడ్లనే పునరుద్ధించారని, కేవలం 57 కిలో మీటర్ల మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చారని పేర్కొన్నారు. ఇంత అధ్వాన్నంగా పనులు జరిగితే ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. ఇంజ నీరింగ్ అధికారులు అలసత్వం వీడాలని... క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించాలని ఆదేశించారు. కాం ట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తి చేసేందుకు వీలుగా ఇంజనీర్లు ప్రయత్నించాలని, వెంటవెంటనే రికార్డులు నమోదు చేయాలన్నా రు. ‘రోడ్ల పనులను త్వరగా పూర్తి చేస్తేనే ప్రభుత్వం కొత్తగా పనులను మంజూరు చేస్తుంది. వరంగల్‌లో ఎక్కువ మంది ఇంజనీర్లు సొం త జిల్లా వారే ఉన్నారు. ప్రస్తుత పనులు త్వరగా పూర్తి చేయించకపోతే జిల్లాకు కొత్త పనులు వచ్చే అవకాశం ఉండదు. మీ నిర్లక్ష్యంతో మీ జిల్లాకే నష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి’ అని అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించలేని వారిపై శాఖపరంగా చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ హెచ్చరించారు. కాంట్రాక్టర్లూ.. ఆలస్యం వద్దు పంచాయతీరాజ్ రోడ్ల పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కాంట్రాక్టర్ల సమస్యలను ఏవైనా ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, పనులను ఆల స్యం చేస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బిల్లుల మంజూరు విషయంలో గతంలో బాగా ఆలస్యమయ్యేదని, ఇప్పుడు గరిష్టంగా మూడు నెలల్లోనే బిల్లులు ఇస్తున్నామన్నారు. బిల్లుల మంజూ రు, రికార్డుల నమోదు, అంచనా వ్యయం విషయాల్లో ఇంజనీర్ల తీరు సరిగా లేదని పలువురు కాంట్రాక్టర్లు ఈఎన్సీకి ఫిర్యాదు చేశారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని, మార్చిలోపు రోడ్ల పనులను పూర్తి చేయాలని ఈఎన్సీ చెప్పారు. 29న ముఖ్యకార్యదర్శి సమీక్ష పంచాయతీరాజ్ శాఖ రోడ్ల పనుల పురోగతిపై శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ.సింగ్ ఈనెల 29న జి ల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశానికి అనుమతులు, అంచనా నివేదికల పనులు పూర్తి చేసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. -
ఫ్లైఓవర్ పనులపై కలెక్టర్ అసంతృప్తి
వేగంగా పూర్తి చేయాలని ఆదేశం టీమ్ వర్క్‌గా పని చేయాలని సూచన శంకుస్థాపన వేదిక ఏర్పాట్ల పరిశీలన విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు సంబంధించి మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో ఏడు మీటర్ల లోతులో డ్రిగ్గింగ్ చేపట్టాల్సి ఉండగా, కేవలం 3 మీటర్ల వరకే చేయడంపై కలెక్టర్ బాబు.ఎ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ అంతర్ రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్లైఓవర్ పనుల శంకుస్థాపనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితీష్ గట్కారీ ఈనెల 5న నిర్వహిస్తారని ఆయన తెలిపారు. సోమవారం భవానీపురం, కుమ్మరిపాలెం సెంటర్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించి శంకుస్థాపన కార్యక్రమ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఫ్లైఓవర్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది జూలై 15 నాటికి పూర్తి చే యాలని, వాస్తవంగా చేసే పనులపై ఎప్పటికపుక్పడు టెలిగ్రామ్, వాట్సప్ ద్వారా వివరాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు, నిర్మాణ సంస్థ సిబ్బంది టీమ్ వర్క్‌గా పని చేస్తేనే నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయగలుగుతామని కలెక్టర్, ఎన్‌హెచ్, సోమ ప్రాజెక్టు అధికారులతో పేర్కొన్నారు. ఒకే జోన్‌గా పుష్కర ఘాట్లు దుర్గాఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం, ఫెర్రీ వరకు ఒకే జోన్‌గా పుష్కర స్నాన ఘట్టాల ప్రతిపాదనలు చేస్తున్నందున దానికి అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. అలాగే దుర్గా ఫ్లైఓవర్ వంతెన పనులతో సమాంతరంగా చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై ఇరిగేషన్, మున్సిపల్, రోడ్లు, భవనాలు, దుర్గగుడి, పోమ కంపెనీ ప్రతినిధులు బృందంగా ఏర్పడి ప్రణాళికలు రూపొందించి మ్యాప్‌ను 24 గంటల్లో అందించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్‌కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ సి.రామకృష్ణ, ఆర్అండ్బీ అధికారులు మోషే, ఆంజేయులురెడ్డి, సోమ ప్రాజెక్టు మేనేజర్ సతీష్ పాల్గొన్నారు. -
వేతన సవరణ రిపోర్టుపై ఉద్యోగులు అసంతృప్తి
-
ఇన్నేళ్లయినా అస్సలు హ్యాపీ లేదట
శ్రీనగర్: కొంతమంది వ్యక్తుల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఎవరికీ అర్ధంకాదు. ఒక్కోసారి ఏం లేకపోయినా సంతోషం ఉంటే ఒక్కోసారి మాత్రం అన్నీ ఉన్నా సంతోషం మాత్రం దగ్గరికి రాదు. ప్రస్తుతం కాశ్మీర్‌లోని పండిట్ల అంశం కూడా అలాగే తయారైంది. దాదాపు 20 ఏళ్లపాటు జమ్మూప్రాంతంలో గడిపిన వీరంతా ప్రస్తుతం కశ్మీర్ లోయ ప్రాంతానికి తరలి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఆనందం మాత్రం తమ దరి చేరలేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా బుద్గా జిల్లాలోని షేకాపోరా అనే ప్రాంతంలో ఉంటున్న వీణా కౌల్(60) అనే వ్యక్తిని ప్రశ్నించినప్పుడు వారి దయనీయ పరిస్థితి కనిపించింది. ఒకే అపార్ట్ మెంట్లలో రెండు రెండు కుటుంబాలు, ఆ కుటుంబాలకు ఒకటే కిచెన్, ఒకటే బాత్ రూం, ఇతర అంశాలు కూడా పరస్పరం పంచుకోవాల్సి రావడంతోపాటు మరింకెన్నో సమస్యలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో తాండవిస్తున్నాయి. దీంతో తిరిగి తమ నివాస ప్రాంతానికి వచ్చామన్న సంతోషం మాత్రం కరువైందని వారు వాపోతున్నారు. మొత్తం 1200 మంది కశ్మీర్ పండిట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయా ప్రాంతంలో స్థిరపడ్డారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. కానీ, రేషన్ కార్డులుగానీ, ఓటరు గుర్తింపుకార్డులుగానీ ఇవ్వలేదు. పునరావాసానికి సంబంధించి ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. తీవ్రవాదం కారణంగా కశ్మీర్ పండిట్లు చెల్లా చెదురవగా తిరిగి కేంద్ర ప్రభుత్వం వారిని ఒకచోటకు చేరుస్తున్న విషయం తెలిసిందే. -
‘వీడ్కోలు’కు అవకాశం ఇవ్వలేదు!
రిటైర్మెంట్పై సెహ్వాగ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: తన ఆఖరి టెస్టుకు ముందు సెలక్టర్లు తనతో వ్యవహరించిన తీరు పట్ల వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ సమయంలో తగిన అవకాశాలు ఇవ్వకుండానే వేటు వేశారని, కనీసం తనతో మాట్లాడి ఉంటే గౌరవంగా తప్పుకునేవాడినని అతను అన్నాడు. ‘2013 ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తప్పించే ముందు సెలక్టర్లు నా భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగితే అదే సిరీస్‌లో రిటైర్మెంట్ ప్రకటించి ఒక ప్రసంగం కూడా చేసేవాడిని. కానీ నాకు మరోలా రాసి పెట్టి ఉంది’ అన్నాడు. గతంలో 2007లోనే జట్టులోంచి తొలగించినప్పుడు రిటైర్ అవుదామనుకున్నానని, అయితే సచిన్ నచ్చజెప్పడంతో ఆగిపోయానని వీరూ గుర్తు చేసుకున్నాడు. కామెంటరీ చేస్తే తన ఆటలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతానని అన్నాడు. -
పదవుల భర్తీపై తెలుగుతమ్ముళ్ల రుసరుసలు
-
కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో దానం!
-
ఆ పోలీసులు నగరానికి మంచిది కాదు
న్యూఢిల్లీ: అసంతృప్తితో ఉండే పోలీసు అధికారులు నగరానికి అంత మంచిదికాదని అతడి అవసరాలన్నీతీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఢిల్లీ హైకోర్టు సూచించింది. తన పరిశీలనలోకి వచ్చిన ప్రకారం నీరు, విద్యుత్, పరిశుభ్రత వంటి కొన్ని ప్రత్యేకమైన అవసరాలను పోలీసు అధికారులు ఉంటున్న నివాసాలకు తప్పనిసరిగా కల్పించే ఏర్పాట్లు చేయాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పీడబ్ల్యూడీ)కి ఆదేశించింది. ఢిల్లీలోని పలు పోలీసుల భవనాలను పరిశీలించేందుకై ఏర్పడిన లాయర్ల ప్యానెల్ నివేదిక ఇచ్చిన అనంతరం పలు పోలీసు అపార్ట్ మెంట్లలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. వెంటనే వారికి ఆ సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇవ్వాలని చెప్పింది. అసంతృప్తితో ఉండే పోలీసులు విధుల విషయంలో ఏకాగ్రతతో పనిచేయాలేరని, వారిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. -
నో కామెంట్
కాంగ్రెస్‌లో అసంతృప్తిపై సీఎం బెంగళూరు : నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న అసృతప్తిపై వివరణ ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిరాకరించారు. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు ‘నో కామెంట్’అంటూ సమాధానమిచ్చారు. బెంగళూరులోని విధానసౌధాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అసమ్మతిపై మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య, కు టుంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖా దర్ మాట్లాడుతూ ‘పోస్టులు దక్కలేదని ఆత్మహత్యలకు యత్నించడం సరికాదు. ఇప్పుడు కాకపోతే మరోసారి సరైన పదవి దక్కుతుంది.’ అని పేర్కొన్నారు. -
జానారెడ్డి తీరుపై అసంతృప్తి
-
కేంద్రం పై కెసిఆర్ నారాజ్
-
అసంతృప్తితో రగులుతోన్న తెలుగు తమ్ముళ్లు