హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును ఆంధ్రప్రదేశ్ సీఐడీ విచారణ జరుపుతున్న తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ బ్యాంకు ఖాతాలు, నగదు వివరాలపై విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నిచగా.. 22 ఖాతాల్లో రూ. 6 లక్షల నగదు ఉన్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. అయితే దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించిన సంస్థ ఖాతాల్లో కేవలం ఆరు లక్షలే ఉండటమేంటని కోర్టు సీఐడీని ప్రశ్నించింది.
రెండేళ్లలో సంస్థ ఖాతాల్లో నుండి డ్రా అయిన డబ్బు వివరాలను చెప్పాలని కోర్టు కోరింది. ఇలా అయితే బాధితులకు న్యాయం ఎలాచేస్తారని సీఐడీని ప్రశ్నించిన కోర్టు.. కస్టడీ విచారణ వివరాలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.